Monday, 9 December 2013

RTI on Union Govt Employees




Courtesy-Eenadu

Good Health excersise Practices

Courtesy-Eenadu

Modern farm equipments



Courtesy-Eenadu

Natural farming Practices

Courtesy-Eenadu

Consumption of Electricity

Courtesy-Eenadu

LLR preperation for Ladies

Courtesy-Eenadu

Fight with Corruption



Courtesy-Eenadu

సెల్‌ఫోన్ హోల్డర్

Published at: 09-12-2013 02:14 AM


 3  0  0 

 



సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌కి పెట్టి టేబుల్ మీదనో, కిటికీ అంచుమీదనో, కుర్చీల్లోనో సెల్‌ఫోన్ పెడుతుంటాం. చాలా ఇళ్లల్లో చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ను ఉంచేందుకు సరైన ఏర్పాటు ఏదీ ఉండదు. దీనివల్ల సెల్‌ఫోన్ కింద పడిపోయే సందర్భాలు బోలెడు ఉంటాయి. ఇక మీదట అవన్నీ మర్చిపోండి అంటున్నారు మేక్ ఇట్- లవ్ ఇట్ డాట్‌కాం వాళ్లు. చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ను జాగ్రత్తగా పెట్టుకునేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేశారు. దీన్ని ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంటే చాలు. సెల్‌ఫోన్ చార్జింగ్ హోల్డర్ తయారైపోతుంది.
ఇందుకు మీకు చదునుగా ఉన్న ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ఒకటి కావాలి. ఈ బాటిల్ సైజ్ మీ సెల్‌ఫోన్ కంటే మరీ పెద్దదిగా, మరీ చిన్నదిగా కాకుండా ఉండాలి. బాటిల్ ఎంపిక చేసుకున్న తరువాత దాన్ని వేడినీళ్లతో శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి. సీసా ఆరిన తరువాత సెల్‌ఫోన్‌ని బాటిల్ మీద పెట్టి పెన్సిల్‌తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఆకారంలోనే బాటిల్ ముందు భాగాన్ని కోయాలి. బాటిల్ వెనకవైపు పై భాగంలో హ్యాండిల్ ఆకారంలో మార్క్ చేసి ఆ ఆకారంలో బాటిల్‌ను కట్ చేయాలి. తరువాత చివర్లను శాండ్ పేపర్‌తో రుద్దితే ఎగుడు దిగుడులేమైనా ఉంటే పోతాయి. ఆ తరువాత స్ప్రే పెయింటింగ్, వినైల్ లేదా స్టెన్సిల్ వర్క్ చేస్తే లుక్ వస్తుంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న సెల్‌ఫోన్ హోల్డర్ మాత్రం క్లాత్‌తో తయారైంది. కట్ చేసిన బాటిల్ చుట్టూరా శాండ్ పేపర్‌తో రుద్ది దానిపై ఉన్న అక్షరాలు పోయేలా చేయాలి. ఆ తరువాత బాటిల్ చుట్టూ ఎంత క్లాత్ పడుతుందో కొలుచుకుని బాటిల్ షేప్‌లో దాన్ని కత్తిరించాలి. ఆ తరువాత బాటిల్ ముందు భాగానికి గమ్ రాయాలి. దానిపైన కత్తిరించుకున్న క్లాత్‌ని బాటిల్ పై భాగంలో అతికించాలి. ఆ తరువాత బాటిల్ అంతటా గమ్ రాసి మిగతా క్లాత్‌ని బిగుతుగా అతికించాలి. అదనంగా వస్త్రం మిగిలిపోతే దాన్ని కత్తిరించేయాలి. ఆ తరువాత బాటిల్ అడుగు భాగం ఆకారంలో క్లాత్ కత్తిరించాలి. బాటిల్ అడుగున గమ్ రాసి కత్తిరించిన క్లాత్‌ని అతికించాలి. అంతే ప్లాస్టిక్ బాటిల్ హోల్డర్ రెడీ.
సౌజన్యం:www.makeit-loveit.com
Courtesy-http://www.andhrajyothy.com

అవయవదానం

చనిపోయిన వాళ్లు మళ్లీ బతుకుతారా? పునర్జన్మ నిజంగా ఉందా? మనుషులకు లేదు కాని అవయవాలకు ఉంది. బతికున్నప్పుడే అవయవదానానికి అంగీకరిస్తే.. ప్రాణం పోయాక కూడా మరొకరిలో ప్రాణం పోసుకోవచ్చు. అంతటి మహత్కార్యాన్ని భుజాన వేసుకుంది నిమ్స్‌లోని జీవన్‌దాన్ కేంద్రం...
పునర్జన్మ ఉందో లేదో మనకు తెలీదు. కాని అవయవదానం చేస్తే మరొకరికి మాత్రం పునర్జన్మ తప్పక లభిస్తుంది. కన్నతల్లిదండ్రులను జన్మనిచ్చిన వాళ్లు అంటాం. పునర్జన్మను ఇచ్చిన వాళ్లనైతే ఏమనాలి? దేవుళ్లు అనాలి. ఆయువు పోయాక మట్టిలో కలిసిపోయే బదులు.. పోతూ పోతూ మరొకరికి పునర్జన్మను ప్రసాదించి వెళ్లిపోతే - జీవితానికి అంతకంటే సార్థకత మరేముంటుంది? ఒక్కసారి హైదరాబాద్‌లోని నిమ్స్‌లోనున్న 'జీవన్‌దాన్'కు వెళితే ఆ భావనే స్ఫురిస్తుంది. గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం ఇవన్నీ పూర్వం నుంచి వస్తున్న దానాలు. కష్టంలో ఉన్న తోటి మనిషిని ఆదుకోవాలన్న అంతస్సూత్రంతో పుట్టుకొచ్చిన సంప్రదాయ సంస్కృతులివి. ఇప్పుడు ఆ దానాలన్నిటి కన్నా మహా దానం అవయవదానం. జీవన్మృతులకు వరం.
అవయవాల అక్రమ విక్రయాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టుకొచ్చింది జీవన్‌దాన్. ఇప్పటికీ సామాన్యులకు దీని గురించి పెద్దగా తెలియదు. అవసరమొచ్చినప్పుడు వైద్యులు చెబితే తప్పించి అవగాహన లేదు. అయితే ఈ మధ్యనే జీవన్‌దాన్ ద్వారా తొలి గుండెమార్పిడి విజయవంతం కావడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. "మాది ఎటువంటి లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థ. అవయవాలు కావాల్సిన వ్యక్తికి, అవయవదానం చేస్తున్న వ్యక్తికీ అనుసంధానకర్తలము మేము. మన దగ్గర ఇప్పటి వరకు రెండు రకాల అవయవదానాలు ఉన్నాయి. ఒకటి- బతికుండగానే అవయవదానం చేయడం. రెండు- బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల (కుటుంబ సభ్యుల అనుమతితోనే) నుంచి తీసిన అవయవాలను ఇతరులకు అమర్చడం. మా సంస్థ రెండో దాని కోసమే పనిచేస్తోంది'' అన్నారు జీవన్‌దాన్ సహాయకురాలు శైలజ. రోడ్డు ప్రమాదాల వల్ల, ఇతరత్రా సంఘటనల వల్ల తీవ్రగాయాలైన వారు.. కొన్ని సందర్భాల్లో బతకడం కష్టం. వైద్యులు ఆఖరి ప్రయత్నం చేసినా బ్రెయిన్‌డెడ్ అవుతారు. అంటే మెదడు తప్ప మిగిలిన అవయవాలన్నీ బాగుంటాయి. ఆ మనిషి బతికే అవకాశమే లేదు కనక ఆ అవయవాలను తీసి.. అవసరమైన వారికి శస్త్రచికిత్సల ద్వారా అమర్చవచ్చు. ఈ మొత్తం ప్రక్రియకూ సహాయపడుతుంది జీవన్‌దాన్.
ముందు వచ్చిన వారికి....
అవయవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులు జీవన్‌దాన్‌లో రిజిస్ట్రర్ కావాలి. అప్పుడే అందులోని పేషెంట్లకు జీవన్‌దాన్‌లో అవయవాల్ని అందించేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇరవై ఆరు ఆస్పత్రులు సభ్యత్వం తీసుకున్నాయి. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీద అందిస్తారు. ఒక్కోసారి పేషెంట్ అత్యవసర పరిస్థితిని కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. "ఇందుకొక కమిటీ ఉంటుంది. దీనికి ఛైర్మన్ జిల్లా వైద్యాధికారి, సహ ఛైర్మన్ నిమ్స్ డైరెక్టర్, రిజిస్టర్ అయిన ఆస్పత్రులు సభ్యులుగా ఉంటాయి. అవయవదానం, అవయవ మార్పిడి ఈ రెండూ పారదర్శకంగానే జరుగుతాయి. అయితే మార్పిడి చేసుకున్నవారు, ఇచ్చిన దాతల వివరాలను మాత్రం రహస్యంగానే ఉంచుతారు వైద్యులు. లేకపోతే కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది'' అంటున్నారు జీవన్‌దాన్ ఇంఛార్జి డాక్టర్ జి.స్వర్ణలత.
దుఃఖంలోనూ ఒప్పించి...
ఇదివరకైతే అవయవదానం కోసం ముందుకొచ్చే వారే కాదు. దీనికి కారణం మతపరమైన విశ్వాసాలు, సెంటిమెంట్లు. బ్రెయిన్‌డెడ్ కావడం అంటే మనిషి ప్రాణం దక్కదనే అర్థం. ఈ విషయాన్ని వైద్యులు బాధితుడి కుటుంబసభ్యులకు తెలియజేస్తారు. ఫలానా పేషెంటు బ్రెయిన్‌డెడ్ అయ్యాడన్న సంగతి తెలుసుకున్న వెంటనే జీవన్‌దాన్ సభ్యులు అక్కడికి వెళతారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూనే, అవయవదానం గురించి అవగాహన కల్పిస్తారు. "సంబంధిత వ్యక్తి ఎలాగూ బతకడు. మీరు ఒప్పుకుంటే ఆ వ్యక్తి అవయవాలను తీసి మరొకరికి అమరుస్తారు. కనీసం తొమ్మిది మందికి ప్రాణదానం చేసినవారు అవుతారు. ప్రాణం పూర్తిగా పోతే వాటిల్లో ఏదీ పనికిరాదు. ఆలోచించండి'' అని నచ్చజెబుతారు జీవన్‌దాన్ సభ్యులు. అందుకు అంగీకరిస్తే ఆ సమాచారాన్ని వైద్యులకు తెలియజేశాక.. అవయవ మార్పిడి ప్రక్రియ జరుగుతుంది. "ఒకరిది ప్రాణం పోతున్న పరిస్థితి. మరొకరిది పోయే ఆ ప్రాణం మీద ఆధారపడి ప్రాణం నిలుపుకోవాల్సిన పరిస్థితి. వీరిద్దరి మధ్య చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అందుకే అవయవదాతల కుటుంబీకులకు గ్రీఫ్ కౌన్సెలింగ్ ఇస్తాం. దీనికి సైకాలజీ తెలుసుండాలి..'' అంటున్నారు ఉద్యోగులు.
వారికి పునర్జన్మ..
జీవన్‌దాన్ కింద ఈ ఏడాది ఇప్పటి వరకు- మొత్తం 36 మంది అవయవదానం చేశారు. వారి నుంచి 161 అవయవాలను తీసి ఇతరులకు అమర్చినట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో మూత్రపిండాలు, కాలేయం, గుండె రక్తనాళాలు, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఈ మధ్యనే తొలి గుండెమార్పిడి కూడా జరిగింది. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ల కౌన్సెలింగ్ వల్ల మెల్లమెల్లగా అవయవదానం కోసం ఎక్కువమంది ముందుకొస్తున్నారు. మెదక్‌కు చెందిన బాలయ్య అపార్ట్‌మెంట్ వాచ్‌మ్యాన్. వయసు ముప్పయి నాలుగేళ్లు. కిందపడి తలకు బలమైన గాయమైతే వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. అయినా ఫలితం లేదు. బ్రెయిన్‌డెడ్ అయినట్లు ప్రకటించారు వైద్యులు. ఆయన భార్యకు, ఇద్దరు కూతుళ్లకు జీవన్‌దాన్ సభ్యులు అవగాహన కల్పించారు. "ఆ పేషెంట్ నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు గుండె కవాటాలు తీసుకుని.. ఇతరులకు మార్పిడి చేశారు వైద్యులు'' అని చెప్పారు సభ్యులు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటకు చెందిన ఇరవై రెండేళ్ల సంగీత తండ్రితో కలిసి మోటారుబైక్ మీద వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా కిందపడింది. తలకు బలమైన గాయమవ్వడంతో నిమ్స్‌కు తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. బ్రెయిన్‌డెడ్ కావడంతో.. అవయవదానం కోసం కుటుంబీకులను ఒప్పించారు. ఆమె శరీరం నుంచి తీసుకున్న ఏడు అవయవాలను ఏడుగురికి అమర్చారు.
కరీంనగర్ జిల్లా తిరుమలాపురానికి చెందిన మరో వ్యక్తి నుంచి కూడా ఏడు అవయవాలను తీసుకుని.. పలువురికి ప్రాణం పోశారు వైద్యులు. "మన దగ్గర మరింత చైతన్యం రావాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే.. ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ వెనుక ఆర్గాన్‌డొనేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో అందుకు అంగీకరించినట్లు ఉంటే.. ఆ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రమాదానికి లోనై బ్రెయిన్‌డెడ్ అయితే.. అవయవాలను తీసుకుంటారు వైద్యులు. ఆర్గాన్స్‌ను తీసుకోవడానికి సమయమే కీలకమైనది. మనిషి పూర్తిగా చనిపోయాక తీసుకునే వీలుండదు..'' అంటున్నారు శైలజ. ఇంఛార్జి వైద్యురాలు స్వర్ణలత మాట్లాడుతూ "ఇందులో ప్రపంచానికే ఆదర్శం స్పెయిన్ దేశం. అవయవదానం మీద వారికున్న అంకితభావం మరొకరికి లేదు. మన దేశంలో తమిళనాడు ఆదర్శంగా నిలుస్తోంది. యాక్సిడెంట్స్ అవుతూనే పోలీసులకు ఎలా సమాచారం వెళ్లిపోతుందో.. జీవన్‌దాన్‌లాంటి అవయవదాన సంస్థలకు కూడా ఆ సమాచారం వెళ్లిపోతుంది. మన దగ్గర ఇంత నెట్‌వర్క్ లేదు. ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకే బ్యాంకులకు, ఐటీ కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకు వెళ్లి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. వైద్యసదస్సుల్లో దీని గురించి ప్రస్తావించి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని కోరుతున్నాం'' అని ఆమె చెప్పారు.
అవయవదానం చేయదల్చిన వారు జీవన్‌దాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్నాక ఆర్గాన్ డోనర్ కార్డు అందిస్తారు. అది అవయవదానాన్ని సులువు చేస్తుంది.
ప్రస్తుతం అవయయవ మార్పిడి కోసం రెండువేల మందికి పైగా జీవన్‌దాన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దాతలు దొరికినప్పుడే వీరందరికీ పునర్జన్మ!
అవయవదానంలో ప్రపంచానికే ఆదర్శం స్పెయిన్ దేశం. దాని మీద వారికున్న అంకితభావం మరొకరికి లేదు. మన దేశంలో తమిళనాడు ఆదర్శంగా నిలుస్తోంది. యాక్సిడెంట్స్ అవుతూనే పోలీసులకు ఎలా సమాచారం వెళ్లిపోతుందో.. జీవన్‌దాన్‌లాంటి అవయవదాన సంస్థలకు కూడా ఆ సమాచారం అలా వెళ్లిపోతుంది. మన దగ్గర ఇంత నెట్‌వర్క్ లేదు. ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకే బ్యాంకులకు, ఐటీ కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకు వెళ్లి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. వైద్యసదస్సుల్లో దీని గురించి ప్రస్తావించి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని కోరుతున్నాం
డాక్టర్.జి.స్వర్ణలత, ఇంఛార్జి, జీవన్‌దాన్ కేంద్రం, నిమ్స్, హైదరాబాద్.
ఫోన్: 88850 60093, 98499 66317
- మల్లెంపూటి ఆదినారాయణ
- See more at: Courtesy-Andhrajyothy

Friday, 6 December 2013

10th క్లాస్' సర్టిఫికెట్ పోయిందా? ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

"HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST.." '10th క్లాస్' సర్టిఫికెట్ పోయిందా? అయితే వర్రీ కాకండి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. website Link :http://182.72.241.154/SSCHT/SSCResultsDetails.aspx లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో '10th క్లాస్' మార్కుల లిస్ట్ అతి ముఖ్యమైనది. ఇది 'Date of Birth' కి ప్రూఫ్‌గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు. సో.. ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా, ఈ website మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది.. అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్‌ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.. website Link: http://182.72.241.154/SSCHT/SSCResultsDetails.aspx
Courtesy- Andhra People

Link for MS-Excel Shortcuts

For Excel Short cuts- http://www.bmedia4tech.com/2013/11/15/139/Here-are-75-Excel-Shortcuts-tips-to-improve-your-skill

For Excel Formulas

Go- http://www.bmedia4tech.com/2013/12/05/166/34-Excel-Formulas-and-Functions-You-Should-Definitely-Know

 For Understanding Formulas

http://www.bmedia4tech.com/2013/11/26/150/Excel-Tips-4-Understanding-Formulas-Basic-Formulas-with-Examples


MIRACLE DRINK KILLS CANCER CELLS TOO

This MIRACLE DRINK has been circulating for a long time long
ago.It is worth your while to take note.

It is like a Miracle Drink! It is simple.

You need one beet root, one carrot and one apple that
combine together to make the JUICE! Wash the above, cut with the skin on into pieces and put them into the juicer and
immediately you drink the juice.

You can add some lime or lemon for more refreshing taste.
This Miracle Drink will be effective for the following ailments:

1. Prevent cancer cells to develop.It will restrain cancer cells to grow.
2. Prevent liver, kidney,pancreas disease and it can cure ulcer
as well.
3. Strengthen the lung, prevent heart attack and high blood
pressure.
4. Strengthen the immune system
5. Good for the eyesight, eliminate red and tired eyes or dry eyes
6. Help to eliminate pain from physical training, muscle ache
7. Detoxify, assist bowel movement, eliminate constipation.Therefore it will make skin healthy & LOOK more radiant.It is God sent for acne problem.
8. Improve bad breath due to indigestion, throat infection,
9.pain
10. Assist Hay Fever Sufferer from Hay Fever attack.

There is absolutely no side effect. Highly nutritious and easily
absorbed.Very effective if you need to loose weight.You will notice your immune system will be improved after 2 week routine.

Please make sure to drink immediately from the juicer for
best effect.

PLEASE SHARE TO YOUR FAMILY AND FRIENDS.

Alert with Bank accounts while using debit cards

முன்பெல்லாம் ரொக்கமாகப் பணத்தை கையில் வைத்துக் கொள்ள பயப்படுவார்கள். ஆனால் இப்போது டெபிட்
கார்டுகளை வைத்திருக்கதான் அதிகம் பயப்பட வேண்டிருக்கிறது!

காரணம், சமீப காலமாக பலருடைய பேங்க்
அக்கவுன்டில் இருந்து அவர்களுக்குத் தெரியாமல் பணம் சூறையாடப்பட்டு விடுவதுதான்!
ஏ.டி.எம். கார்டில் இருக்கும் தகவல்களை 'ஸ்கிம்மர்’ எனும் கருவி மூலம் அபகரித்து, அதைக்
கொண்டு போலி கார்டுகளை உருவாக்கி, பணத்தை எடுத்து விடுகிறார்கள் சில சமூக விரோத சக்திகள்.

குறிப்பாக சென்னை போன்ற நகரங்களில் இத்தகைய நவீன கொள்ளைகள் அதிகமாக நடந்து வந்தாலும், மற்ற
இடங்களிலும் நடக்காது என்பதற்கு எந்த உத்தரவாதமும் இல்லை.

அதனால் பணத்தைப் பறிகொடுப்பதற்கு முன்பாக தேவையான முன்னெச்சரிக்கை நடவடிக்கைகளை எடுத்துக் கொண்டால்
இழப்பைச் சந்திக்க வேண்டியதிருக்காது.

கவனிக்க வேண்டியவை..!

*வழக்கத்திற்கு மாறாக ஏ.டி.எம். இயந்திரத்தின் முன்பக்கத்திலிருந்து ஏதாவது வயர்கள்
வெளியே செல்வதைப் பார்த்தால் அந்த இயந்திரத்தைப் பயன்படுத்தாதீர்கள்.

*பின் நம்பரை டைப் செய்யும்போது, அதை யாரும் பார்க்காதபடி மறைத்துக் கொள்ளுங்கள்.

*பரிமாற்ற ரசீதுகளை ஏ.டி.எம். இயந்திர அறையிலோ அல்லது அருகிலோ தூக்கி எறியாமல்
கையோடு எடுத்துச் செல்லுங்கள்.

*ஏ.டி.எம். இயந்திரத்தில் ஏற்படும் சந்தேகங்களுக்கு வங்கியைத் தவிர, அறிமுகம் இல்லாத வெளிநபரிடம்
எந்த உதவியையும் கோர வேண்டாம்.

*ஏ.டி.எம். சென்டரில் ஒன்றுக்கு மேற்பட்ட மெஷின்கள் இருந்து ஏதாவது ஒன்று வேலை செய்யாமல்
இருந்தால், மற்றதைப் பயன்படுத்துவதைத் தவிர்ப்பது நல்லது. காரணம், மற்ற மெஷின்களை தற்காலிகமாகச்
செயலிழக்கச் செய்து, 'ஸ்கிம்மர்’ கருவி பொருத்தப் பட்ட மெஷினை பயன்படுத்தும் வகையில் சமூக விரோதிகள்
நமக்கு வலை விரித்திருக்கலாம்.

*ஏ.டி.எம். இயந்திரத்தைச் சுற்றி சந்தேகப்படும்படியான விஷயங்கள் அல்லது நடமாட்டங்கள் ஏதேனும்
இருந்தாலோ அல்லது உங்களது கணக்கில் நீங்கள் செய்யாத பரிமாற்றங்கள் இருந்தாலோ உங்களது வங்கிக்கும், காவல்
துறைக்கும் முதலில் தெரியப்படுத்துங்கள்.

*ஓட்டல்கள், கடைகள் போன்ற இடங்களில் பில்லை டெபிட் கார்டு மூலம் செலுத்தும் போது ஜாக்கிரதையாக
இருப்பது அவசியம். ஏனெனில், நீங்கள் கார்டை கொடுத்து விட்டு உட்கார்ந்துவிட்டால், அதை ஸ்கிம்மர்
பொருத்திய மெஷினில் ஸ்வைப் செய்தாலும் தெரியாமல் போய்விடும். அதன் மூலம் நம் ஏ.டி.எம்.
கார்டு தொடர்பான விஷயங்கள் நமக்கே தெரியாமல் திருடு போக வாய்ப்பிருக்கிறது.
அஷ்வின்

Courtesy-Tamil News

Kidney stone juice

one in ten people will have a kidney stone at some time in their lives”.
To avoid kidney stones from forming, drinking a lot of fluids such as filtered water is highly recommended.

1. Avoid foods high in oxalate: Peanuts, almonds, cashews, hazelnuts, soybeans, soy milk, wheat germ and wheat bran, spinach, black tea, instant tea, rhubarb, beets, most dried beans, sweet potatoes and chocolate.
2. Reduce animal protein foods.
3. If you have kidney stones your doctor will recommend for you to cut down on salt and sodium you take. Limit the amount of salt (sodium), calcium, oxalate, protein, potassium and fluid in your diet. Your health practitioner will probably advise you to limit sodium to 2,000 milligrams each day.
4. You also need to learn how to read the labels and avoid foods high in calcium. It is important that you learn from your health practitioner the right balance of calcium to eat.
Tip: Drink a glass of water before bed and if you wake during the night, drink another glass before going back to bed.

Try this juice to help you with kidney stones:
Lemon is high in citric acid, which is believed to help break-up calcium-based kidney stones.
Watermelon is one of the best fruit for kidney stones. It has the highest level of water among all types of fruits. Water is crucial when it comes to passing kidney stones. It is also high in potassium, which is a form of salt that helps dissolve the kidney stones. Watermelon is a diuretic and increases urine formation.
In addition to drinking as many glasses of water as you possibly can, drink 1 or 2 juices each day.
Juices contain citrates which will aid in the breakup of the stones.
Juice:
1 orange, peeled
1 apple
1 lemon
4 slices of watermelon
4 ice cubes
All ingredients must be organic.

PLEASE TALK TO YOUR HEALTH PRACTITIONER BEFORE CHANGING YOUR DIET..

Cattle Schemes for Ryots


Courtesy-Eenadu

Tuesday, 3 December 2013

Help from Govt Agricutural Website

Courtesy-Eenadu

సేఫ్‌గా స్టోర్ చేసుకోవడానికి, ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్

డాటాను, ఇమేజెస్‌ను సేఫ్‌గా స్టోర్ చేసుకోవడానికి, ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ 'ది బెస్ట్' అంటే అతిశయోక్తి కాదు. అయితే గూగుల్ డ్రైవ్‌ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే అందులో ఉన్న ఫీచర్స్ గురించి తెలిసి ఉండాల్సిందే. ఆ ఫీచర్స్ విశేషాలు మీ కోసం...
గూగుల్ అందిస్తున్న స్టోరేజ్ సర్వీస్ 'గూగుల్ డ్రైవ్' ఇందులో డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు, ప్రజెంటేషన్లు...ఇలా రకరకాల ఫైల్స్‌ని భద్రపరచుకోవచ్చు. స్టోర్ చేసుకున్న డాటాను కంప్యూటర్ లేక మొబైల్ నుంచి డాటాను యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎక్కువ సైజులో ఉన్న ఫైల్స్‌ను మెయిల్‌కు అటాచ్ చేసి పంపడం చాలా కష్టం. అలాంటప్పుడు గూగుల్ డ్రైవ్ నుంచి జీమెయిల్‌కు లింక్ పంపించడం ద్వారా సేమ్ ఫైల్‌ని, సేమ్ వెర్షన్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ గూగుల్ డ్రైవ్‌లో ఎన్నో ఉన్నాయి.
సెర్చ్ చేయడం సులభం
గూగుల్ డ్రైవ్‌లో ఉన్న బెస్ట్ ఫీచర్స్‌లో ఇది ఒకటి. డాక్యుమెంట్లను రియల్ టైమ్‌లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. వారు చేస్తున్న మార్పులను గమనించవచ్చు. మీ సలహాలను రియల్‌టైమ్‌లో వెల్లడించవచ్చు. గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్, డాక్యుమెంట్స్‌ని సెర్చ్ చేయడం చాలా సులభం. డాక్యుమెంట్ పేరుతోనే కాకుండా, ఆ ఫైల్‌ని షేర్ చేసుకున్న వ్యక్తి పేరుతో కూడా సెర్చ్ చేసే సౌలభ్యాన్ని గూగుల్ డ్రైవ్ అందిస్తోంది. ఒకవేళ మీకు డాక్యుమెంట్ పేరు గుర్తులేకపోయినా సులభంగా సెర్చ్ చేయవచ్చు. అయితే ఆ డాక్యుమెంట్‌ని ఎవరితో షేర్ చేసుకున్నారో గుర్తుంచుకుంటే చాలు. ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవాలంటే గూగుల్ డ్రైవ్‌లోకి సైనిన్ అయ్యాక ఎడమ వైపు ఉన్న 'షేర్డ్ విత్ మి' లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ బాక్స్‌లో ఎవరితో షేర్ చేసుకున్నారో వారి పేరును టైప్ చేయాలి. అప్పుడు వారితో షేర్ చేసుకున్న ఫైల్స్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. డాక్యుమెంట్ పేరుతో కాకుండా వ్యక్తి పేరును గుర్తుపెట్టుకుంటే చాలు, కావలసిన ఫైల్స్‌ని సులభంగా సెర్చ్ చేసి పొందవచ్చు.
ఈజీ నావిగేషన్
జీమెయిల్ సైనిన్ అయి ఉన్నారు. గూగుల్‌డ్రైవ్‌లోకి వెళ్లడానికి ప్రత్యేకంగా మళ్లీ సైనిన్ కావలసిన అవసరం లేదు. జీమెయిల్ సెర్చ్‌బాక్స్‌లోనే రెండు ప్రదేశాల్లోను సెర్చ్ చేయవచ్చు. జీమెయిల్ నుంచి నావిగేట్ చేయాలంటే కుడి వైపున ఉన్న గేర్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఒక మెనూ ప్రత్యక్ష్యం అవుతుంది. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. తరువాత ల్యాబ్స్ టాబ్‌పై క్లిక్ చేయండి. యాప్స్ సెర్చ్ ఆప్షన్‌ను ఎనేబుల్‌లో ఉండేలా ఎంపిక చేసుకోండి. ఇప్పుడు జీమెయిల్ సెర్చ్‌బాక్స్‌లో టైప్ చేసి గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్స్‌ను పొందవచ్చు.
సేవ్ చేయడం సులభం
సెర్చ్ చేస్తుండగా ఒక ఇమేజ్ లేక ఒక డాక్యుమెంట్ నచ్చిందనుకోండి. వెంటనే నేరుగా డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నట్లయితే సేవ్ టు డ్రైవ్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఇందుకోసం బాగా ఉపయోగపడుతుంది. మీరు సెర్చ్ చేసి వెతికిన డాక్యుమెంట్‌ను రైట్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
యాప్స్‌తో ట్యాప్
గూగుల్ డ్రైవ్‌లో డాక్యుమెంట్లు మాత్రమే కాదు, ఫోటోలు కూడా భద్రపరుచుకుంటారు. వాటిని సరదాగా కాఫీ మగ్‌పై లేక టీషర్ట్స్‌పై ఫోటోలుగా వేసుకుంటే ఎంతో బాగుంటుంది కూడా. క్రోమ్ వెబ్‌స్టోర్‌లో ఉన్న 'స్ప్రెడ్‌షర్ట్ డిజైనర్ ఫర్ గూగుల్ డ్రైవ్'ని ఎంచుకుంటే మీ సరదా తీరుతుంది. 'హల్లోఫాక్స్' సహాయంతో గూగుల్ డ్రైవ్ నుంచి నేరుగా డాక్యుమెంట్లను ఫాక్స్ కూడా చేయవచ్చు. వాప్‌వోల్ఫ్ అటోమేటర్ ఫర్ గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించి గూగుల్ డ్రైవ్‌ను డ్రాప్‌బాక్స్, ఎవర్‌నోట్, కిండెల్, పికాసా వంటి అప్లికేషన్లతో సింక్ర నైజ్ చేసుకోవచ్చు. సాధారణంగా సోషల్ నెట్‌వర్క్ టూల్‌గా గూగుల్‌ప్లస్ ఉపయోగపడుతుంది. అయితే డాక్యుమెంట్లను సర్కిల్స్‌తో షేర్ చేసుకోవాలంటే డాక్యుమెంట్‌పై రైట్‌క్లిక్ చేసి షేర్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. షేర్ చేసుకున్నాక సర్కిల్స్ నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సైతం పొందవచ్చు.
షార్ట్‌కట్ ్స
గూగుల్ డ్రైవ్‌ని మరింత సమర్థవంతంగా ఉపయోగిం చుకోవాలంటే టిప్స్ లిస్ట్‌ని ఎంచుకోండి. లిస్ట్ ఆప్ కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ని ఎంచుకోవడం ద్వారా గూగుల్‌డ్రైవ్‌లో వర్క్‌ని మరింత వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
న్యూ ట్యాబ్ అవసరమా?
ఒక డాక్యుమెంట్‌లో పనిచేస్తున్నప్పుడు కొత్త ట్యాబ్‌ను లేక వెబ్‌పేజ్‌ను ఓపెన్ చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. అయితే టూల్స్‌లో రీసెర్చ్ మెనూ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా డాక్యుమెంట్ లోపల రైట్‌సైడ్‌లో రీసెర్చ్ పేన్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. అందులో ఉండే టూల్ సహాయంతో కావలసిన కంటెంట్‌ను సులభంగా పొందవచ్చు. ఇమేజెస్‌ను డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో నేరుగా డాక్యుమెంట్‌లోకి పొందవచ్చు.
మీకు నచ్చిన భాషలో...
భాష ఏదైనా గూగుల్ డ్రైవ్‌కు పర్వాలేదు. ఇటీవలే మరో 18 భాషలను గూగుల్ డ్రైవ్‌లో యాడ్ చేశారు. దీంతో మొత్తం 65 భాషలను గూగుల్ డ్రైవ్ సపోర్టు చేస్తోంది. గూగుల్ డ్రైవ్‌లో కుడి పక్కన ఉన్న గేర్ ఐకాన్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో జనరల్‌పై క్లిక్ చేసి కావలసిన లాంగ్వేజ్‌ని ఎంచుకోవాలి.
ఆఫ్‌లైన్‌లోనూ...
ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్లను యాక్సెస్ చేసుకోవాలా? దానికీ ఒక మార్గం ఉంది. క్రోమ్‌వెబ్‌స్టోర్‌లో దీస్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అయిపోతే చాలు. ఆఫ్‌లైన్‌లో గూగుల్ డ్రైవ్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలిసిపోతుంది. ఆఫ్‌లైన్‌లో డాక్యుమెంట్లను ఎడిట్ చేసుకోవడం, డ్రాయింగ్స్, ప్రెజెంటేషన్స్ వంటి పనులన్నీ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్‌ని ఉపయోగించని వ్యక్తులతో డాక్యుమెంట్లపై వర్క్ చేయాలంటే క్విక్ఆఫీస్‌ని ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. క్విక్ఆఫీస్ సహాయంతో ఫైల్స్‌ని రీడ్, ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్‌ని ఎంచుకుంటే గూగుల్ డ్రైవ్‌ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చనడంలో సందేహం లేదు కదూ!
Courtesy-Andhrajyothy

నా మొబైల్‌లో నంబరుకో రింగ్‌టోన్ సెట్ చేసుకునేదెలా?

నేను కెసి 555 మోడల్ మొబైల్ ఫోన్ వాడుతున్నాను. నా ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లలో కొన్నిటికి నేను కామన్ రింగ్‌టోన్ కాకుండా సపరేట్ రింగ్ టోన్‌ను సెట్ చేద్దామనుకుంటున్నాను. కానీ నా ఫోన్‌లో ఈ ఆప్షన్ కనబడలేదు. ఈ ఫీచర్‌ను నేను పొందేది ఎలా??
మీరు ముందుగా మీ ఫోన్‌లోని కాంటాక్ట్ నెంబర్లు ఫోన్ మెమొరీలో సేవ్ చేసి ఉన్నాయా లేదా సిమ్ మెమొరీలో సేవ్ చేసి ఉన్నాయా అని చెక్ చేయండి. ఒకవేళ సిమ్ మెమొరీలో కనుక మీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే గనుక, మీరు వాటికి సపరేట్ రింగ్‌టోన్‌ను సెట్ చేయలేరు. కాబట్టి మీరు ఏ కాంటాక్ట్ నెంబరుకైతే సపరేట్ రింగ్‌టోన్‌ను సెట్ చేయాలని అనుకుంటున్నారో, దాన్ని మీరు సిమ్ మెమొరీ నుంచి ఫోన్ మెమొరీలోకి కాపీ చేయవలసి ఉంటుంది. కాంటాక్ట్స్‌లోకి వెళ్లి కాంటాక్ట్ నేమ్ వద్ద ఉన్న సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. కాపీ టు ఫోన్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోన్ మెమొరీలో సేవ్ అయిన ఈ కాంటాక్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకొని ఆ కాంటాక్ట్‌కు సపరేట్ రింగ్‌టోన్‌ను సెట్ చేయవచ్చు.

నేను నోకియా 2730 క్లాసిక్ ఫోన్‌ను వాడుతున్నాను. నా ఫోన్‌లోని మెమొరీ కార్డు పాస్‌వర్డ్ మర్చిపోయాను.దీన్ని తిరిగి పొందటం లేదా రీసెట్ చేయడం ఎలా?
- మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌కు వెళ్లండి.
- సెట్టింగ్స్‌లో సిస్టమ్ ఫోల్డర్‌ను సెలెక్ట్ చేయండి.
- సిస్టమ్ ఫోల్డర్‌లో ఎంఎంసి స్టోర్ అనే ఫైల్ ఉంటుంది.
- దాన్ని మీ కంప్యూటర్‌లోకి నోకియా పిసి స్యూట్ ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా పంపించండి.
- ఇప్పుడు ఆ ఎంఎంసి స్టోర్ ఫైల్‌ను నోన్‌ప్యాడ్‌లో ఓపెన్ చేయండి.
- అందులో మీ మెమొరీ కార్డు పాస్‌వర్డ్ కనిపిస్తుంది.

నేను నోకియా ఎన్ 8 వాడుతున్నాను. నేను ఫ్యాక్టరీ రీసెట్ కోడ్‌ను మర్చిపోయాను. దీన్ని తిరిగి పొందటం ఎలా? ఈ కోడ్ తెలియనందువల్ల నా ఫోన్‌ను రీసెట్ చేయలేకపోతున్నాను. దీనికి పరిష్కారం తెలియజేయండి.
మీ ఫ్యాక్టరీ రీసెట్ కోడ్ రికవరీ చేయడం సాధ్యపడక పోవచ్చు. మీ ఫోన్‌ను రీసెట్ చేయడానికి ఈ కింది పద్ధతుల్లో దేనినైనా వాడవచ్చు.
- menu -settings-phone-phonemgmt-factory setting-delete data and restore
దీని వల్ల మీ రీసెట్ కోడ్ తిరిగి డీఫాల్ట్ కోడ్ అయిన 12345కు మారే అవకాశం ఉంది.
- మీ సమస్య ఇంకా ఉంటే కనుక, మీ ఫోన్‌ను హార్డ్ రీసెట్ చేయవచ్చు. కానీ దీనివల్ల మీ ఫోన్‌లోని డాటా మొత్తం ఎరేజ్ అవుతుంది. హార్డ్ రీసెట్ చేయడానికి
- మీ ఎన్ 8 ను స్విచ్ఆఫ్ చేయండి.
volume down +camera button + menu button+power button
ను నొక్కి అలాగే (press and hold)మీ ఫోన్ వైబ్రేట్ అయ్యి స్క్రీన్ మళ్లీ వెలిగేంత వరకు పట్టుకొని ఉంచండి. దీనివల్ల మీ ఫోన్‌లోని డీఫాల్ట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీస్టోర అవుతాయి.
మీ డాటాను పోగొట్టుకోకూడదు అనుకుంటే మీ దగ్గరలోని నోకియా కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

నేను ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్‌ను నా కంప్యూటర్‌లో వాడుతున్నాను. నా మానిటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే కుడివైపునకు ఫ్లిప్ అయింది. దీని వల్ల చాలా అసౌకర్యంగా ఉంది. ఇది నా మానిటర్ హార్డ్‌వేర్‌లోని సమస్యా? దీన్ని నేను ఎలా పరిష్కరించుకోవాలి?
మీ మానిటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే ఏ వైపునకు అయినా ఫ్లిప్ అయితే మీరు ఈ కింది పద్ధతిని పాటించవచ్చు.  ctrl+alt+ arrow keys కాంబినేషన్‌ను వాడి , మీ స్క్రీన్ డిస్‌ప్లేను తిరిగి నార్మల్ పొజిషన్‌కు మార్చుకోవచ్చు. మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే కుడివైపునకు ఫ్లిప్ అయ్యిందంటున్నారు కాబట్టి ctrl+alt+up arrow keys కాంబినేషన్‌ను వాడండి.
కె. ప్రకాషరావు
టెక్నికల్ డైరెక్టర్, సెల్‌టెక్, హైదరాబాద్
kancharla_kash@hotmail.com
www.celtec.in
- See more at: http://www.andhrajyothy.com/node/37200#sthash.43nx9jUs.dpuf

Open school for Illiterates

Courtesy-Eenadu

Emergency Ambulance Service for poor

Courtesy-Eenadu

మీ నిద్రే... మీకు ఒక మెడికల్ టెస్ట్!

మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు. ఉదాహరణకు మనకు నిద్రాభంగం కలిగిస్తూ, కనిపించే అనేక సమస్యలు నిజానికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా పరిగణించాలి. మీ నిద్రే ఒక వైద్యపరీక్షగా మారి మిమ్మల్ని డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందిగా నిశ్శబ్దంగా ఆదేశిస్తుందేమో పరిశీలించుకోండి. గుండెలో మంటగా, ఛాతీలో ఇబ్బందిగా ఉంటే అది బ్యారెట్స్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంది. మన సమాజంలో దాదాపు 45 శాతం మందిలో ఈ లక్షణం ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. అయితే నిద్రలో కనిపించినప్పుడు వాళ్ల ఆందోళన అధికమవుతుంది. ఛాతీలో మంటతో పాటు చెమట పట్టడం, ఎడమ భుజం/చేతిలో నొప్పి వంటి లక్షణాలు లేకపోతే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ లక్షణం దీర్ఘకాలం కనిపిస్తుంటే డాక్టర్‌ను  తప్పక సంప్రదించాలి. చాలామంది దీన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. తొలిదశల్లో అయితే ఇది కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఉండే దశగా భావించవచ్చు. అయితే కొన్నిసార్లు ఈసోఫేగస్‌లో కింద ఉండే కణాలు మార్పు చెందడం వల్ల వచ్చే కాలమ్నార్ ఎపిథీలియమ్ లైన్‌డ్ లోయర్ ఈసోఫేగస్ అనే కండిషన్ వల్ల కావచ్చు.  సాధారణంగా అక్కడ ఉండే కణ నిర్మాణానికి బదులు పైన పేర్కొన్న కాలమ్నార్ కణాలుగా కణాలు మార్పులు చెందితే దాన్ని బ్యారట్స్ సిండ్రోమ్‌గా పేర్కొనవచ్చు. అది గ్యాస్‌ను పైకి ఎగజిమ్మే సాధారణ జీఈఆర్‌డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సిండ్రోమ్) అయితే పర్వాలేదు. ఒకవేళ అది బ్యారెట్స్ సిండ్రోమ్‌గా మార్పు చెందుతుంటే మాత్రం తక్షణం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గ్యాస్ ఎక్కువగా కనిపిస్తుంటే మాత్రం తొలి దశలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గ్యాస్/జీఈఆర్‌డీ సమస్యను అధిగమించవచ్చు.
నిద్రలో పళ్లు కొరకడమనే ఈ లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సవుస్య ఉండవచ్చు. దీన్నే బ్రక్సిజం అంటారు. పిల్లల్లో ఇది సర్వసాధారణం. పిల్లల్లోనైతే ఇది  మొదటి ఐదేళ్లలో మొదలయ్యే సమస్య. పిల్లల్లో సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వం ఉన్నప్పుడు ఇలా పళ్లు కొరకడం ద్వారా వ్యక్తమయ్యే బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక పెద్దలలోనైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఇది కనిపిస్తుంది. పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతూ ఉంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి.
నిద్రకు ఉపక్రమించే వుుందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయుత్నించాలి. వారి వునసుల్లో ఉన్న భయూలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్లు వంటివి వారికి పెట్టకూడదు. సవుస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే వత్ గార్డ్స్, వత్‌పీసెస్ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సవుస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్) సవుస్యలు - వూల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు పడిపోవడం, దడవ ఎవుుక జారుుంట్ (టెంపోరో వూండిబులార్ జారుుంట్) సవుస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో డెంటల్ సర్జన్‌ను కలవాల్సి ఉంటుంది. ఇక పెద్దల్లోనైతే మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు అవసరమైన ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ల వంటివి చేయడం మంచిది.
 స్లీప్ ఆప్నియా కావచ్చు. అదలా కొనసాగడం ప్రమాదకరమూ కావచ్చు.
  మనకు కొద్దిసేపు శ్వాస ఆడకపోయినా, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే ఈ సమస్యను వైద్యపరిభాషలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అంటారు. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. మనం నిద్రపోయినప్పుడు మన గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలామందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి, శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక.  శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేకసార్లు వస్తుంది. దాంతో రాత్రివేళల్లో అనేకసార్లు నిద్రాభంగం కలుగుతుంది. 
  అందువల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. రాత్రుళ్లు గురకపెడుతూ, పగటివేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావడం, రక్తపోటు పెరగడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. గుండెజబ్బులు ఉన్నవారికైతే ఇలా రక్తపోటు పెరగడం గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నిద్రకు ముందు ఆల్కహాల్‌ను తీసుకోకూడదు.  ధూమపానాన్ని, నిద్రమాత్రలు వాడే అలవాటును మానేయాలి.
 ప్ర: రాత్రుళ్లు నిద్రలో తీవ్రంగా చెమటలు పడుతున్నాయా? అది క్షయ (ట్యూబర్క్యులోసిస్) కావచ్చు.సాధారణంగా క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్) ఉన్నవారి శరీర ఉష్ణోగ్రత ఉదయం వేళలతో పోలిస్తే... సాయంత్రం నుంచి రాత్రివేళల్లో మరింతగా పెరుగుతుంటుంది. ఒక్కోసారి శరీర ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతుందంటే, రాత్రివేళల్లో తీవ్రంగా చెమటలు పట్టి, పక్కబట్టలు కూడా తడిసి, వాటిని మార్చాల్సినంత ఎక్కువగా ఉండవచ్చు. క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్, పేగులు, కాలేయం వంటి కీలక అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. కొన్నిరోజులు మందులు వాడగానే రోగ లక్షణాలు తగ్గడంతో మందులు మానేస్తుంటారు. దాంతో మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ కేసులు ఎక్కువ. టీబీని పూర్తిగా నయం చేయడానికి క్రమం తప్పకుండా పూర్తిగా వైద్యపర్యవేక్షణలో మందులు వాడటం అత్యవసరం. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో డాట్స్ (డెరైక్ట్‌లీ అబ్‌జర్వ్‌డ్ థెరపీ షార్ట్ కోర్స్) చికిత్స కార్యక్రమం కింద కార్యకర్తల ఆధ్వర్యంలో రోగి క్రమం తప్పకుండా మందులు తీసుకునేలా చూస్తున్నారు. అలాగే మందుల వల్ల వస్తున్న దుష్ర్పభావాలు (సైడ్‌ఎఫెక్ట్స్) వంటి వాటిని (ఉదాహరణకు... చర్మంపై ర్యాషెస్, అసిడిటీ, కాలేయం స్రవించే ఎంజైముల పెరుగుదల, చూపుతగ్గడం, వినికిడి శక్తిలో మార్పులు, మూత్రపిండాల పనితీరులో మార్పుల వంటివి) కూడా పరీక్షించి దానికి అనుగుణంగా మందులను, వాటి మోతాదులను నిర్ణయించాల్సి ఉంటుంది.
 ప్ర: నిద్రలో కాళ్లకండరాలు అకస్మాత్తుగా పట్టేసి నొప్పితో విలవిలలాడుతుంటే?
 జ: సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగుపాళ్లలో ద్రవాలు (హైడ్రేషన్) సమకూరకపోవడం కారణాలు కావచ్చు.
  రాత్రి నిద్రలో కాళ్ల కండరాలు, పిక్కలు పట్టేసి, ఒకపట్టాన వదలకుండా చాలాసేపు బాధిస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారంలో పొటాషియమ్, మెగ్నీషియమ్ మరియు విటమిన్ల లోపం వల్ల, లవణాలు, తగినంత ద్రవాలు లేకుండా ఉన్నాయని అర్థం. అంటే మనం అన్ని పోషకాలు లభించేలా సమతులాహారం తీసుకోవడం లేదని పరిగణించాల్సి ఉంటుంది. ఇదేమీ ప్రమాదకరమైన పరిణామం కాదు. దీనివల్ల కండరాలు పనిచేయడానికి అవసరమైన పాళ్లలో మెగ్నీషియమ్ లభించడం లేదని భావించి, అది పుష్కలంగా లభించే గుమ్మడి గింజలు, చేపలు, ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పొటాషియమ్ అన్నది అరటిపండ్లలో, కొబ్బరినీళ్లలో ఎక్కువ. దీనికి తోడు తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లతో పాటు ద్రవాహారం లేదా కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటుంటే ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. -నిర్వహణ: యాసీన్
  రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా?  డయాబెటిస్... లేదా పురుషుల్లోనైతే ప్రోస్టేట్ సమస్య కావచ్చు. రాత్రి వేళల్లో చాలాసార్లు నిద్రలేచి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే బహుశా అది చక్కెర వ్యాధి /డయాబెటిస్ లక్షణం కావచ్చేమోనని అనుమానించాలి. చక్కెర వ్యాధిలో రక్తంలోని చక్కెర పాళ్లు పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. దాంతో రక్తంలోని ఈ ఎక్కువైన చక్కెరను బయటకు పంపించేందుకు మూత్రపిండాలు ఎక్కువగా మూత్రవిసర్జన  చేసి, ఎక్కువైన చక్కెరను మూత్రం ద్వారా విసర్జించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే అలా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇక కొందరిలోనైతే ఇలా మూత్రం వచ్చినట్లు అనిపిస్తూ, అది ధారగా కాకుండా చుక్కలు చుక్కలుగా పడుతుండటం, వారి వయసు యాభై దాటి ఉండటం తటస్థిస్తే వారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు కూడా అయి ఉండవచ్చు.
 ఈ లక్షణం పిల్లల్లో ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అంతకుముందు చాలా రోజులు పక్క తడపకుండా ఉండి, ఆ తర్వాత పక్క తడుపుతుంటే, అది టైప్-1 డయాబెటిస్‌కు గాని లేదా తీవ్రమైన మానసిక వేదనకు గాని చిహ్నం అయ్యేందుకు అవకాశం ఉంది.  పెద్దల్లో సమస్య టైప్-2 డయాబెటిస్ అయితే క్రమం తప్పకుండా చక్కెరపాళ్లను పరీక్షించుకుంటూ... నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ వారు సూచించిన... చక్కెర నియంత్రణ మందులు క్రమం తప్పక వాడుతుండాలి. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథి వాపు అయితే డాక్టర్ సలహా మేరకు మొదట వుందులు వాడి, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయుూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చికిత్స చేయించాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లల్లోనైతే తప్పక డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి.

 -డాక్టర్ సి.హేమంత్
 సీనియర్ జనరల్ ఫిజీషియన్,
 యశోదా హాస్పిటల్స్,
 సోమాజిగూడ, హైదరాబాద్
మీ నిద్రే... మీకు ఒక మెడికల్ టెస్ట్!
Sakshi | Updated: December 04, 2013 01:39 (IST)
మీ నిద్రే... మీకు ఒక మెడికల్ టెస్ట్!
 మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు. ఉదాహరణకు మనకు నిద్రాభంగం కలిగిస్తూ, కనిపించే అనేక సమస్యలు నిజానికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా పరిగణించాలి. మీ నిద్రే ఒక వైద్యపరీక్షగా మారి మిమ్మల్ని డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందిగా నిశ్శబ్దంగా ఆదేశిస్తుందేమో పరిశీలించుకోండి.

 ప్ర: నిద్రలో గుండెల్లో మంటగా ఉందా?...
 జ: అది జీఈఆర్‌డీ లేదా బ్యారెట్స్ సిండ్రోమ్ కావచ్చు.
  నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసిందా? గుండెలో మంటగా, ఛాతీలో ఇబ్బందిగా ఉంటే అది బ్యారెట్స్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంది. మన సమాజంలో దాదాపు 45 శాతం మందిలో ఈ లక్షణం ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. అయితే నిద్రలో కనిపించినప్పుడు వాళ్ల ఆందోళన అధికమవుతుంది. ఛాతీలో మంటతో పాటు చెమట పట్టడం, ఎడమ భుజం/చేతిలో నొప్పి వంటి లక్షణాలు లేకపోతే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ లక్షణం దీర్ఘకాలం కనిపిస్తుంటే డాక్టర్‌ను  తప్పక సంప్రదించాలి. చాలామంది దీన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. తొలిదశల్లో అయితే ఇది కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఉండే దశగా భావించవచ్చు. అయితే కొన్నిసార్లు ఈసోఫేగస్‌లో కింద ఉండే కణాలు మార్పు చెందడం వల్ల వచ్చే కాలమ్నార్ ఎపిథీలియమ్ లైన్‌డ్ లోయర్ ఈసోఫేగస్ అనే కండిషన్ వల్ల కావచ్చు.

  సాధారణంగా అక్కడ ఉండే కణ నిర్మాణానికి బదులు పైన పేర్కొన్న కాలమ్నార్ కణాలుగా కణాలు మార్పులు చెందితే దాన్ని బ్యారట్స్ సిండ్రోమ్‌గా పేర్కొనవచ్చు. అది గ్యాస్‌ను పైకి ఎగజిమ్మే సాధారణ జీఈఆర్‌డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సిండ్రోమ్) అయితే పర్వాలేదు. ఒకవేళ అది బ్యారెట్స్ సిండ్రోమ్‌గా మార్పు చెందుతుంటే మాత్రం తక్షణం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గ్యాస్ ఎక్కువగా కనిపిస్తుంటే మాత్రం తొలి దశలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గ్యాస్/జీఈఆర్‌డీ సమస్యను అధిగమించవచ్చు.

 ప్ర: నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?
 జ: అది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు.
 త నిద్రలో పళ్లు కొరకడమనే ఈ లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సవుస్య ఉండవచ్చు. దీన్నే బ్రక్సిజం అంటారు. పిల్లల్లో ఇది సర్వసాధారణం. పిల్లల్లోనైతే ఇది  మొదటి ఐదేళ్లలో మొదలయ్యే సమస్య. పిల్లల్లో సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వం ఉన్నప్పుడు ఇలా పళ్లు కొరకడం ద్వారా వ్యక్తమయ్యే బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక పెద్దలలోనైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఇది కనిపిస్తుంది. పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతూ ఉంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి.

  నిద్రకు ఉపక్రమించే వుుందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయుత్నించాలి. వారి వునసుల్లో ఉన్న భయూలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్లు వంటివి వారికి పెట్టకూడదు. సవుస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే వత్ గార్డ్స్, వత్‌పీసెస్ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సవుస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్) సవుస్యలు - వూల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు పడిపోవడం, దడవ ఎవుుక జారుుంట్ (టెంపోరో వూండిబులార్ జారుుంట్) సవుస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో డెంటల్ సర్జన్‌ను కలవాల్సి ఉంటుంది. ఇక పెద్దల్లోనైతే మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు అవసరమైన ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ల వంటివి చేయడం మంచిది.

 ప్ర: నిద్రలో గురక ఎక్కువగా వినిపిస్తోందా?
 జ: స్లీప్ ఆప్నియా కావచ్చు. అదలా కొనసాగడం ప్రమాదకరమూ కావచ్చు.
  మనకు కొద్దిసేపు శ్వాస ఆడకపోయినా, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే ఈ సమస్యను వైద్యపరిభాషలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అంటారు. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది.

 మనం నిద్రపోయినప్పుడు మన గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలామందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి, శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక.  శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేకసార్లు వస్తుంది. దాంతో రాత్రివేళల్లో అనేకసార్లు నిద్రాభంగం కలుగుతుంది.

  అందువల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. రాత్రుళ్లు గురకపెడుతూ, పగటివేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావడం, రక్తపోటు పెరగడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. గుండెజబ్బులు ఉన్నవారికైతే ఇలా రక్తపోటు పెరగడం గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నిద్రకు ముందు ఆల్కహాల్‌ను తీసుకోకూడదు.  ధూమపానాన్ని, నిద్రమాత్రలు వాడే అలవాటును మానేయాలి.

 ప్ర: రాత్రుళ్లు నిద్రలో తీవ్రంగా చెమటలు పడుతున్నాయా?
 జ: అది క్షయ (ట్యూబర్క్యులోసిస్) కావచ్చు.
  సాధారణంగా క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్) ఉన్నవారి శరీర ఉష్ణోగ్రత ఉదయం వేళలతో పోలిస్తే... సాయంత్రం నుంచి రాత్రివేళల్లో మరింతగా పెరుగుతుంటుంది. ఒక్కోసారి శరీర ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతుందంటే, రాత్రివేళల్లో తీవ్రంగా చెమటలు పట్టి, పక్కబట్టలు కూడా తడిసి, వాటిని మార్చాల్సినంత ఎక్కువగా ఉండవచ్చు. క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్, పేగులు, కాలేయం వంటి కీలక అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. కొన్నిరోజులు మందులు వాడగానే రోగ లక్షణాలు తగ్గడంతో మందులు మానేస్తుంటారు. దాంతో మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ కేసులు ఎక్కువ.

  టీబీని పూర్తిగా నయం చేయడానికి క్రమం తప్పకుండా పూర్తిగా వైద్యపర్యవేక్షణలో మందులు వాడటం అత్యవసరం. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో డాట్స్ (డెరైక్ట్‌లీ అబ్‌జర్వ్‌డ్ థెరపీ షార్ట్ కోర్స్) చికిత్స కార్యక్రమం కింద కార్యకర్తల ఆధ్వర్యంలో రోగి క్రమం తప్పకుండా మందులు తీసుకునేలా చూస్తున్నారు. అలాగే మందుల వల్ల వస్తున్న దుష్ర్పభావాలు (సైడ్‌ఎఫెక్ట్స్) వంటి వాటిని (ఉదాహరణకు... చర్మంపై ర్యాషెస్, అసిడిటీ, కాలేయం స్రవించే ఎంజైముల పెరుగుదల, చూపుతగ్గడం, వినికిడి శక్తిలో మార్పులు, మూత్రపిండాల పనితీరులో మార్పుల వంటివి) కూడా పరీక్షించి దానికి అనుగుణంగా మందులను, వాటి మోతాదులను నిర్ణయించాల్సి ఉంటుంది.

 ప్ర: నిద్రలో కాళ్లకండరాలు అకస్మాత్తుగా పట్టేసి నొప్పితో విలవిలలాడుతుంటే?
 జ: సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగుపాళ్లలో ద్రవాలు (హైడ్రేషన్) సమకూరకపోవడం కారణాలు కావచ్చు.
  రాత్రి నిద్రలో కాళ్ల కండరాలు, పిక్కలు పట్టేసి, ఒకపట్టాన వదలకుండా చాలాసేపు బాధిస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారంలో పొటాషియమ్, మెగ్నీషియమ్ మరియు విటమిన్ల లోపం వల్ల, లవణాలు, తగినంత ద్రవాలు లేకుండా ఉన్నాయని అర్థం. అంటే మనం అన్ని పోషకాలు లభించేలా సమతులాహారం తీసుకోవడం లేదని పరిగణించాల్సి ఉంటుంది. ఇదేమీ ప్రమాదకరమైన పరిణామం కాదు. దీనివల్ల కండరాలు పనిచేయడానికి అవసరమైన పాళ్లలో మెగ్నీషియమ్ లభించడం లేదని భావించి, అది పుష్కలంగా లభించే గుమ్మడి గింజలు, చేపలు, ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పొటాషియమ్ అన్నది అరటిపండ్లలో, కొబ్బరినీళ్లలో ఎక్కువ. దీనికి తోడు తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లతో పాటు ద్రవాహారం లేదా కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటుంటే ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది.
 -నిర్వహణ: యాసీన్

 రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా?
 డయాబెటిస్... లేదా పురుషుల్లోనైతే ప్రోస్టేట్ సమస్య కావచ్చు.
  రాత్రివేళల్లో చాలాసార్లు నిద్రలేచి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే బహుశా అది చక్కెర వ్యాధి /డయాబెటిస్ లక్షణం కావచ్చేమోనని అనుమానించాలి. చక్కెర వ్యాధిలో రక్తంలోని చక్కెర పాళ్లు పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. దాంతో రక్తంలోని ఈ ఎక్కువైన చక్కెరను బయటకు పంపించేందుకు మూత్రపిండాలు ఎక్కువగా మూత్రవిసర్జన  చేసి, ఎక్కువైన చక్కెరను మూత్రం ద్వారా విసర్జించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే అలా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇక కొందరిలోనైతే ఇలా మూత్రం వచ్చినట్లు అనిపిస్తూ, అది ధారగా కాకుండా చుక్కలు చుక్కలుగా పడుతుండటం, వారి వయసు యాభై దాటి ఉండటం తటస్థిస్తే వారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు కూడా అయి ఉండవచ్చు.

 ఈ లక్షణం పిల్లల్లో ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అంతకుముందు చాలా రోజులు పక్క తడపకుండా ఉండి, ఆ తర్వాత పక్క తడుపుతుంటే, అది టైప్-1 డయాబెటిస్‌కు గాని లేదా తీవ్రమైన మానసిక వేదనకు గాని చిహ్నం అయ్యేందుకు అవకాశం ఉంది.
 పెద్దల్లో సమస్య టైప్-2 డయాబెటిస్ అయితే క్రమం తప్పకుండా చక్కెరపాళ్లను పరీక్షించుకుంటూ... నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ వారు సూచించిన... చక్కెర నియంత్రణ మందులు క్రమం తప్పక వాడుతుండాలి. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథి వాపు అయితే డాక్టర్ సలహా మేరకు మొదట వుందులు వాడి, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయుూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చికిత్స చేయించాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లల్లోనైతే తప్పక డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి.

 -డాక్టర్ సి.హేమంత్
 సీనియర్ జనరల్ ఫిజీషియన్,
 యశోదా హాస్పిటల్స్,
 సోమాజిగూడ, హైదరాబాద్

Alert with fruits danger

Courtesy-Eenadu

Aids Awareness centres in Warangal Dist

Courtesy-Eenadu

Aware about Consumers Protection





Courtesy-Eenadu

Mee seva problems


Courtesy-Eenadu