Tuesday, 3 December 2013

నా మొబైల్‌లో నంబరుకో రింగ్‌టోన్ సెట్ చేసుకునేదెలా?

నేను కెసి 555 మోడల్ మొబైల్ ఫోన్ వాడుతున్నాను. నా ఫోన్‌లోని కాంటాక్ట్ నంబర్లలో కొన్నిటికి నేను కామన్ రింగ్‌టోన్ కాకుండా సపరేట్ రింగ్ టోన్‌ను సెట్ చేద్దామనుకుంటున్నాను. కానీ నా ఫోన్‌లో ఈ ఆప్షన్ కనబడలేదు. ఈ ఫీచర్‌ను నేను పొందేది ఎలా??
మీరు ముందుగా మీ ఫోన్‌లోని కాంటాక్ట్ నెంబర్లు ఫోన్ మెమొరీలో సేవ్ చేసి ఉన్నాయా లేదా సిమ్ మెమొరీలో సేవ్ చేసి ఉన్నాయా అని చెక్ చేయండి. ఒకవేళ సిమ్ మెమొరీలో కనుక మీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే గనుక, మీరు వాటికి సపరేట్ రింగ్‌టోన్‌ను సెట్ చేయలేరు. కాబట్టి మీరు ఏ కాంటాక్ట్ నెంబరుకైతే సపరేట్ రింగ్‌టోన్‌ను సెట్ చేయాలని అనుకుంటున్నారో, దాన్ని మీరు సిమ్ మెమొరీ నుంచి ఫోన్ మెమొరీలోకి కాపీ చేయవలసి ఉంటుంది. కాంటాక్ట్స్‌లోకి వెళ్లి కాంటాక్ట్ నేమ్ వద్ద ఉన్న సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. కాపీ టు ఫోన్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోన్ మెమొరీలో సేవ్ అయిన ఈ కాంటాక్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకొని ఆ కాంటాక్ట్‌కు సపరేట్ రింగ్‌టోన్‌ను సెట్ చేయవచ్చు.

నేను నోకియా 2730 క్లాసిక్ ఫోన్‌ను వాడుతున్నాను. నా ఫోన్‌లోని మెమొరీ కార్డు పాస్‌వర్డ్ మర్చిపోయాను.దీన్ని తిరిగి పొందటం లేదా రీసెట్ చేయడం ఎలా?
- మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌కు వెళ్లండి.
- సెట్టింగ్స్‌లో సిస్టమ్ ఫోల్డర్‌ను సెలెక్ట్ చేయండి.
- సిస్టమ్ ఫోల్డర్‌లో ఎంఎంసి స్టోర్ అనే ఫైల్ ఉంటుంది.
- దాన్ని మీ కంప్యూటర్‌లోకి నోకియా పిసి స్యూట్ ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా పంపించండి.
- ఇప్పుడు ఆ ఎంఎంసి స్టోర్ ఫైల్‌ను నోన్‌ప్యాడ్‌లో ఓపెన్ చేయండి.
- అందులో మీ మెమొరీ కార్డు పాస్‌వర్డ్ కనిపిస్తుంది.

నేను నోకియా ఎన్ 8 వాడుతున్నాను. నేను ఫ్యాక్టరీ రీసెట్ కోడ్‌ను మర్చిపోయాను. దీన్ని తిరిగి పొందటం ఎలా? ఈ కోడ్ తెలియనందువల్ల నా ఫోన్‌ను రీసెట్ చేయలేకపోతున్నాను. దీనికి పరిష్కారం తెలియజేయండి.
మీ ఫ్యాక్టరీ రీసెట్ కోడ్ రికవరీ చేయడం సాధ్యపడక పోవచ్చు. మీ ఫోన్‌ను రీసెట్ చేయడానికి ఈ కింది పద్ధతుల్లో దేనినైనా వాడవచ్చు.
- menu -settings-phone-phonemgmt-factory setting-delete data and restore
దీని వల్ల మీ రీసెట్ కోడ్ తిరిగి డీఫాల్ట్ కోడ్ అయిన 12345కు మారే అవకాశం ఉంది.
- మీ సమస్య ఇంకా ఉంటే కనుక, మీ ఫోన్‌ను హార్డ్ రీసెట్ చేయవచ్చు. కానీ దీనివల్ల మీ ఫోన్‌లోని డాటా మొత్తం ఎరేజ్ అవుతుంది. హార్డ్ రీసెట్ చేయడానికి
- మీ ఎన్ 8 ను స్విచ్ఆఫ్ చేయండి.
volume down +camera button + menu button+power button
ను నొక్కి అలాగే (press and hold)మీ ఫోన్ వైబ్రేట్ అయ్యి స్క్రీన్ మళ్లీ వెలిగేంత వరకు పట్టుకొని ఉంచండి. దీనివల్ల మీ ఫోన్‌లోని డీఫాల్ట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీస్టోర అవుతాయి.
మీ డాటాను పోగొట్టుకోకూడదు అనుకుంటే మీ దగ్గరలోని నోకియా కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

నేను ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్‌ను నా కంప్యూటర్‌లో వాడుతున్నాను. నా మానిటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే కుడివైపునకు ఫ్లిప్ అయింది. దీని వల్ల చాలా అసౌకర్యంగా ఉంది. ఇది నా మానిటర్ హార్డ్‌వేర్‌లోని సమస్యా? దీన్ని నేను ఎలా పరిష్కరించుకోవాలి?
మీ మానిటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే ఏ వైపునకు అయినా ఫ్లిప్ అయితే మీరు ఈ కింది పద్ధతిని పాటించవచ్చు.  ctrl+alt+ arrow keys కాంబినేషన్‌ను వాడి , మీ స్క్రీన్ డిస్‌ప్లేను తిరిగి నార్మల్ పొజిషన్‌కు మార్చుకోవచ్చు. మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే కుడివైపునకు ఫ్లిప్ అయ్యిందంటున్నారు కాబట్టి ctrl+alt+up arrow keys కాంబినేషన్‌ను వాడండి.
కె. ప్రకాషరావు
టెక్నికల్ డైరెక్టర్, సెల్‌టెక్, హైదరాబాద్
kancharla_kash@hotmail.com
www.celtec.in
- See more at: http://www.andhrajyothy.com/node/37200#sthash.43nx9jUs.dpuf

No comments:

Post a Comment