డాటాను, ఇమేజెస్‌ను సేఫ్‌గా స్టోర్ చేసుకోవడానికి, ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ 'ది బెస్ట్' అంటే అతిశయోక్తి కాదు. అయితే గూగుల్ డ్రైవ్‌ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే అందులో ఉన్న ఫీచర్స్ గురించి తెలిసి ఉండాల్సిందే. ఆ ఫీచర్స్ విశేషాలు మీ కోసం...
గూగుల్ అందిస్తున్న స్టోరేజ్ సర్వీస్ 'గూగుల్ డ్రైవ్' ఇందులో డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు, ప్రజెంటేషన్లు...ఇలా రకరకాల ఫైల్స్‌ని భద్రపరచుకోవచ్చు. స్టోర్ చేసుకున్న డాటాను కంప్యూటర్ లేక మొబైల్ నుంచి డాటాను యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎక్కువ సైజులో ఉన్న ఫైల్స్‌ను మెయిల్‌కు అటాచ్ చేసి పంపడం చాలా కష్టం. అలాంటప్పుడు గూగుల్ డ్రైవ్ నుంచి జీమెయిల్‌కు లింక్ పంపించడం ద్వారా సేమ్ ఫైల్‌ని, సేమ్ వెర్షన్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ గూగుల్ డ్రైవ్‌లో ఎన్నో ఉన్నాయి.
సెర్చ్ చేయడం సులభం
గూగుల్ డ్రైవ్‌లో ఉన్న బెస్ట్ ఫీచర్స్‌లో ఇది ఒకటి. డాక్యుమెంట్లను రియల్ టైమ్‌లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. వారు చేస్తున్న మార్పులను గమనించవచ్చు. మీ సలహాలను రియల్‌టైమ్‌లో వెల్లడించవచ్చు. గూగుల్ డ్రైవ్‌లో ఫైల్స్, డాక్యుమెంట్స్‌ని సెర్చ్ చేయడం చాలా సులభం. డాక్యుమెంట్ పేరుతోనే కాకుండా, ఆ ఫైల్‌ని షేర్ చేసుకున్న వ్యక్తి పేరుతో కూడా సెర్చ్ చేసే సౌలభ్యాన్ని గూగుల్ డ్రైవ్ అందిస్తోంది. ఒకవేళ మీకు డాక్యుమెంట్ పేరు గుర్తులేకపోయినా సులభంగా సెర్చ్ చేయవచ్చు. అయితే ఆ డాక్యుమెంట్‌ని ఎవరితో షేర్ చేసుకున్నారో గుర్తుంచుకుంటే చాలు. ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవాలంటే గూగుల్ డ్రైవ్‌లోకి సైనిన్ అయ్యాక ఎడమ వైపు ఉన్న 'షేర్డ్ విత్ మి' లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ బాక్స్‌లో ఎవరితో షేర్ చేసుకున్నారో వారి పేరును టైప్ చేయాలి. అప్పుడు వారితో షేర్ చేసుకున్న ఫైల్స్ లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. డాక్యుమెంట్ పేరుతో కాకుండా వ్యక్తి పేరును గుర్తుపెట్టుకుంటే చాలు, కావలసిన ఫైల్స్‌ని సులభంగా సెర్చ్ చేసి పొందవచ్చు.
ఈజీ నావిగేషన్
జీమెయిల్ సైనిన్ అయి ఉన్నారు. గూగుల్‌డ్రైవ్‌లోకి వెళ్లడానికి ప్రత్యేకంగా మళ్లీ సైనిన్ కావలసిన అవసరం లేదు. జీమెయిల్ సెర్చ్‌బాక్స్‌లోనే రెండు ప్రదేశాల్లోను సెర్చ్ చేయవచ్చు. జీమెయిల్ నుంచి నావిగేట్ చేయాలంటే కుడి వైపున ఉన్న గేర్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఒక మెనూ ప్రత్యక్ష్యం అవుతుంది. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. తరువాత ల్యాబ్స్ టాబ్‌పై క్లిక్ చేయండి. యాప్స్ సెర్చ్ ఆప్షన్‌ను ఎనేబుల్‌లో ఉండేలా ఎంపిక చేసుకోండి. ఇప్పుడు జీమెయిల్ సెర్చ్‌బాక్స్‌లో టైప్ చేసి గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్స్‌ను పొందవచ్చు.
సేవ్ చేయడం సులభం
సెర్చ్ చేస్తుండగా ఒక ఇమేజ్ లేక ఒక డాక్యుమెంట్ నచ్చిందనుకోండి. వెంటనే నేరుగా డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నట్లయితే సేవ్ టు డ్రైవ్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఇందుకోసం బాగా ఉపయోగపడుతుంది. మీరు సెర్చ్ చేసి వెతికిన డాక్యుమెంట్‌ను రైట్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా డ్రైవ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
యాప్స్‌తో ట్యాప్
గూగుల్ డ్రైవ్‌లో డాక్యుమెంట్లు మాత్రమే కాదు, ఫోటోలు కూడా భద్రపరుచుకుంటారు. వాటిని సరదాగా కాఫీ మగ్‌పై లేక టీషర్ట్స్‌పై ఫోటోలుగా వేసుకుంటే ఎంతో బాగుంటుంది కూడా. క్రోమ్ వెబ్‌స్టోర్‌లో ఉన్న 'స్ప్రెడ్‌షర్ట్ డిజైనర్ ఫర్ గూగుల్ డ్రైవ్'ని ఎంచుకుంటే మీ సరదా తీరుతుంది. 'హల్లోఫాక్స్' సహాయంతో గూగుల్ డ్రైవ్ నుంచి నేరుగా డాక్యుమెంట్లను ఫాక్స్ కూడా చేయవచ్చు. వాప్‌వోల్ఫ్ అటోమేటర్ ఫర్ గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించి గూగుల్ డ్రైవ్‌ను డ్రాప్‌బాక్స్, ఎవర్‌నోట్, కిండెల్, పికాసా వంటి అప్లికేషన్లతో సింక్ర నైజ్ చేసుకోవచ్చు. సాధారణంగా సోషల్ నెట్‌వర్క్ టూల్‌గా గూగుల్‌ప్లస్ ఉపయోగపడుతుంది. అయితే డాక్యుమెంట్లను సర్కిల్స్‌తో షేర్ చేసుకోవాలంటే డాక్యుమెంట్‌పై రైట్‌క్లిక్ చేసి షేర్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. షేర్ చేసుకున్నాక సర్కిల్స్ నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సైతం పొందవచ్చు.
షార్ట్‌కట్ ్స
గూగుల్ డ్రైవ్‌ని మరింత సమర్థవంతంగా ఉపయోగిం చుకోవాలంటే టిప్స్ లిస్ట్‌ని ఎంచుకోండి. లిస్ట్ ఆప్ కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ని ఎంచుకోవడం ద్వారా గూగుల్‌డ్రైవ్‌లో వర్క్‌ని మరింత వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
న్యూ ట్యాబ్ అవసరమా?
ఒక డాక్యుమెంట్‌లో పనిచేస్తున్నప్పుడు కొత్త ట్యాబ్‌ను లేక వెబ్‌పేజ్‌ను ఓపెన్ చేయాలంటే కష్టపడాల్సి వస్తుంది. అయితే టూల్స్‌లో రీసెర్చ్ మెనూ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా డాక్యుమెంట్ లోపల రైట్‌సైడ్‌లో రీసెర్చ్ పేన్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. అందులో ఉండే టూల్ సహాయంతో కావలసిన కంటెంట్‌ను సులభంగా పొందవచ్చు. ఇమేజెస్‌ను డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో నేరుగా డాక్యుమెంట్‌లోకి పొందవచ్చు.
మీకు నచ్చిన భాషలో...
భాష ఏదైనా గూగుల్ డ్రైవ్‌కు పర్వాలేదు. ఇటీవలే మరో 18 భాషలను గూగుల్ డ్రైవ్‌లో యాడ్ చేశారు. దీంతో మొత్తం 65 భాషలను గూగుల్ డ్రైవ్ సపోర్టు చేస్తోంది. గూగుల్ డ్రైవ్‌లో కుడి పక్కన ఉన్న గేర్ ఐకాన్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో జనరల్‌పై క్లిక్ చేసి కావలసిన లాంగ్వేజ్‌ని ఎంచుకోవాలి.
ఆఫ్‌లైన్‌లోనూ...
ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్లను యాక్సెస్ చేసుకోవాలా? దానికీ ఒక మార్గం ఉంది. క్రోమ్‌వెబ్‌స్టోర్‌లో దీస్ ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అయిపోతే చాలు. ఆఫ్‌లైన్‌లో గూగుల్ డ్రైవ్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చో తెలిసిపోతుంది. ఆఫ్‌లైన్‌లో డాక్యుమెంట్లను ఎడిట్ చేసుకోవడం, డ్రాయింగ్స్, ప్రెజెంటేషన్స్ వంటి పనులన్నీ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్‌ని ఉపయోగించని వ్యక్తులతో డాక్యుమెంట్లపై వర్క్ చేయాలంటే క్విక్ఆఫీస్‌ని ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. క్విక్ఆఫీస్ సహాయంతో ఫైల్స్‌ని రీడ్, ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్‌ని ఎంచుకుంటే గూగుల్ డ్రైవ్‌ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చనడంలో సందేహం లేదు కదూ!
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment