Published at: 09-12-2013 02:14 AM
సెల్‌ఫోన్‌ను చార్జింగ్‌కి పెట్టి టేబుల్ మీదనో, కిటికీ అంచుమీదనో, కుర్చీల్లోనో సెల్‌ఫోన్ పెడుతుంటాం. చాలా ఇళ్లల్లో చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ను ఉంచేందుకు సరైన ఏర్పాటు ఏదీ ఉండదు. దీనివల్ల సెల్‌ఫోన్ కింద పడిపోయే సందర్భాలు బోలెడు ఉంటాయి. ఇక మీదట అవన్నీ మర్చిపోండి అంటున్నారు మేక్ ఇట్- లవ్ ఇట్ డాట్‌కాం వాళ్లు. చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్‌ను జాగ్రత్తగా పెట్టుకునేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేశారు. దీన్ని ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంటే చాలు. సెల్‌ఫోన్ చార్జింగ్ హోల్డర్ తయారైపోతుంది.
ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంటే చాలు. సెల్‌ఫోన్ చార్జింగ్ హోల్డర్ తయారైపోతుంది.
ఇందుకు మీకు చదునుగా ఉన్న ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ ఒకటి కావాలి. ఈ బాటిల్ సైజ్ మీ సెల్‌ఫోన్ కంటే మరీ పెద్దదిగా, మరీ చిన్నదిగా కాకుండా ఉండాలి. బాటిల్ ఎంపిక చేసుకున్న తరువాత దాన్ని వేడినీళ్లతో శుభ్రంగా కడిగి ఆరపెట్టాలి. సీసా ఆరిన తరువాత సెల్‌ఫోన్‌ని బాటిల్ మీద పెట్టి పెన్సిల్‌తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఆకారంలోనే బాటిల్ ముందు భాగాన్ని కోయాలి. బాటిల్ వెనకవైపు పై భాగంలో హ్యాండిల్ ఆకారంలో మార్క్ చేసి ఆ ఆకారంలో బాటిల్‌ను కట్ చేయాలి. తరువాత చివర్లను శాండ్ పేపర్‌తో రుద్దితే ఎగుడు దిగుడులేమైనా ఉంటే పోతాయి. ఆ తరువాత స్ప్రే పెయింటింగ్, వినైల్ లేదా స్టెన్సిల్ వర్క్ చేస్తే లుక్ వస్తుంది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న సెల్‌ఫోన్ హోల్డర్ మాత్రం క్లాత్‌తో తయారైంది. కట్ చేసిన బాటిల్ చుట్టూరా శాండ్ పేపర్‌తో రుద్ది దానిపై ఉన్న అక్షరాలు పోయేలా చేయాలి. ఆ తరువాత బాటిల్ చుట్టూ ఎంత క్లాత్ పడుతుందో కొలుచుకుని బాటిల్ షేప్‌లో దాన్ని కత్తిరించాలి. ఆ తరువాత బాటిల్ ముందు భాగానికి గమ్ రాయాలి. దానిపైన కత్తిరించుకున్న క్లాత్‌ని బాటిల్ పై భాగంలో అతికించాలి. ఆ తరువాత బాటిల్ అంతటా గమ్ రాసి మిగతా క్లాత్‌ని బిగుతుగా అతికించాలి. అదనంగా వస్త్రం మిగిలిపోతే దాన్ని కత్తిరించేయాలి. ఆ తరువాత బాటిల్ అడుగు భాగం ఆకారంలో క్లాత్ కత్తిరించాలి. బాటిల్ అడుగున గమ్ రాసి కత్తిరించిన క్లాత్‌ని అతికించాలి. అంతే ప్లాస్టిక్ బాటిల్ హోల్డర్ రెడీ.
సౌజన్యం:www.makeit-loveit.com
సౌజన్యం:www.makeit-loveit.com
No comments:
Post a Comment