Thursday, 21 November 2013

Be Aleert with Online relations

శృతి మించుతున్న ఆన్‌లైన్‌ ప్రేమలు... సెల్‌ఫోన్లు, ఆన్‌లైన్లు వచ్చాక స్నేహం, ప్రేమలు కూడా హైటెక్‌ అనుబంధాలైపోయాయి. 'హాయ్ నైస్‌ మీటింగ్‌ టు యు' అంటూ నెమ్మదిగా మొదలయ్యే ఆ పరిచయాలు కొద్ది కాలంలోనే స్నేహాల పరిధిని దాటేసి తమదైన లోకంలో విహరిస్తున్నాయి. ఏదో కొద్దిమందికి నిజమైన స్నేహాన్ని పంచినా చాలామందికి మాత్రం ఆ ఆనందం తాత్కాలికమే. కాలం గడిచే కొద్దీ చిక్కులు మొదలు. పరిచయాల్లో చనువు అధికమై, మాటలు కోటలు దాటి, సరదాలు శ్రుతి మించుతాయి. ఇంకేం? ఆ తర్వాత స్నేహం ముసుగులో గాఢమైన బంధాలు ఏర్పరుచుకునే దిశగా అడుగులు పడతాయి. ఒకప్పుడు ఇతరుల వ్యామోహంలో పడడానికి వైవాహిక జీవితంలో అసంతృప్తి ప్రధాన కారణంగా ఉండేది. ఈ వర్చువల్‌ రిలేషన్స్‌ విషయంలో అదసలు కీలకం కానేకాదు. అపోజిట్‌ సెక్స్‌తో మాట్లాడాలన్న తహతహ, ఉత్సుకత వంటివే ఇక్కడ ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో మాటల హద్దుమీరినా, భావాలు పోటెత్తినా పట్టించుకునేవారు లేరు. ఇక ఎవరికి తెలిసే అవకాశం లేకపోవడం మరో అనువు. ఇవే ఆన్‌లైన్‌ స్నేహాలు హద్దులు దాట డానికి దారితీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఐదుగురు దీనిలో ఎఫైర్‌గా మార్చు కుంటున్నారు. ఇతర దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా విస్తరించిన ఈ సంస్కృతి మనదేశంలోని మెట్రో నగరాలకూ వచ్చేసింది. అనేక ఇతర నగరాల్లోనూ ఆన్‌లైన్‌ పరిచయాన్ని తరచూ కలుసుకునే ఓ బంధంగా మార్చుకోవాలని కోరుకునే వారు కోకొల్లలు. ఆన్‌లైన్‌ కబుర్లు, కవ్వింతల్లో కాలక్షేపం చేసే యువతీయువకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రత్యక్షంగా కలుసుకునే థ్రిల్‌ని ఆహ్వానించే వారి సంఖ్య అధికమవుతోంది. విస్తరిస్తున్న ఈ పరిణామంతో దుష్ప్రభావాలు మాత్రం ఎక్కువే అంటున్నారు మానసిక నిపుణులు. ఆన్‌లైన్‌ స్నేహంలో ఒకస్థాయి దాటి కవ్వింతలు తేలియాడే వారికి కంప్యూటరే లోకం..@ బహుజనబంధు గారి సౌజన్యంతో

No comments:

Post a Comment