నగరంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీరు... వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు కొత్త ప్రయోగం చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న నేరాల ఆధారంగా బీ అలెర్ట్ అనే లఘు చిత్రాన్ని రూపొందించారు.
వీ.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్ కథా నాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని ఇక నుంచి నగరంలోని
థియేటర్లలో ప్రదర్శించడంతోపాటు టీవీలలో ప్రసారం చేస్తారు.
బంగారం నగలకు మెరుగు పెడతామని టోకరా వేస్తారు కొందరు. తక్కువ ధరకే బంగారం కడ్డీలు ఇస్తామని ఇనుప కడ్డీ చేతిలో పెట్టి పారిపోతారు మరికొందరు. వంద రూపాయలు రోడ్డుపై పడేసి చేతిలో ఉన్న లక్ష రూపాయలు లాక్కుపోతుంది ఇంకో గ్యాంగ్. నగరంలో కొంతకాలంపాటు వరుసగా జరుగుతున్న నేరాలవి. ఈ నేరాల్లో బాధితులు వేలల్లో ఉన్నప్పటికీ రికవరీ అందుకుంటున్న వారి సంఖ్య వందల్లోనే ఉంటోంది. ఈ తరహా నేరాలు నగరంలో జరుగుతున్నప్పటికీ, పోలీసు అధికారులు పలు సూచనలు జారీ చేసినప్పటికీ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కనీసం అనుమానితుల గురించి కూడా ప్రజలు పోలీసులకు సమాచారమివ్వడం లేదు. "ప్రజల నుంచి సహకారం లేకపోతే మేం మాత్రం ఏం చేయగలం. మా వంతు కృషి మేమే చేస్తున్నాం. ప్రజల్లో అవగాహన పెరగాలి'' అని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ లఘుచి త్రం రూపొందించారు.
ఆపదలో ఉన్న వారికి సేవలందించేందుకు ప్రభుత్వం డయల్ 100ను ప్రారంభించింది. ఎప్పటి నుంచో ఉన్న దీన్ని 108కు అనుసంధానం చేయడంతో సమీకృతం చేశారు. 100కు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే సమీపాన ఉన్న పోలీస్‌స్టేషన్‌కు గానీ, పెట్రోలింగ్ వాహన సిబ్బందికి సమాచారం అందుతుంది. ఆపదలో ఉన్న వారి కోసం 100ను ఏర్పాటు చేస్తే ఆకతాయిల నకిలీ కాల్స్ చేస్తున్నారు. డయల్ 100 నెలకు 50వేల ఫోన్ కాల్స్ వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటే అందులో 20వేలు నకిలీ కాల్స్ ఉంటున్నాయి. ఆపదలో ఉన్న వారికి 100 ఎలా ఉపయోగపడుతుంది? ఫోన్ చేసిన తక్షణం పోలీసులు చర్యలు ఎంత వేగంగా ఉంటాయో బీ అలెర్ట్ లఘుచిత్రంలో చూపించారు. పాఠశాల విద్యార్థి నుంచి ఇంట్లో ఉండే ఇల్లాలు వరకు 100 సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించే సన్నివేశాలను ఈ చిత్రంలో పొందుపరిచారు. ఈ లఘు చిత్రం సీడీ ఉచితంగా అందజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
సీడీలకోసం ఫోన్:9490616520

No comments:
Post a Comment