పాల ఉత్పత్తి పెరిగిపోయి, కొనే వాళ్ళు లేక పాల కేంద్రాలు మూసి వేసిన సంఘటన ఇటీవల పత్రికలలో మీరు చూసే ఉంటారు! అంటే తెలుగునాట పాల వెల్లువ పొంగిపొర్లుతున్నట్లు లెక్కా? లేక, జనం పాలు కొనడం మానివేశారని అర్థమా?'మందు' తాగడం ఎక్కువై, జనానికి పాలంటే ఏవగింపు వచ్చేసిందని అర్థమా?
ఈ విచిత్రాన్ని మరో వైపు చిత్రంతో పోల్చి చూస్తే .. వాస్తవం మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పాల పరిశ్రమ రూ. 5000 కోట్ల వ్యాపారం చేస్తోంది. పాల ఉత్పత్తిలో దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. ఒక్క భాగ్యనగర్ చుట్టుపక్కలే 200కు పైగా డైరీలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా 1000 కి పైగా చిన్నా పెద్దా డైరీలు రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.2 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రంగంలో ప్రైవేట్ వ్యాపారం ఇటీవల బాగా పుంజుకొంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని APDDCF ఒక్కటే రూ. 500 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఈ 'ప్రభుత్వ డైరీ' గత సంవత్సరం 9 శాతం అభివృద్ధి నమోదు చేసింది. 1500 లక్షల లీటర్ల పాలు సరఫరా చేసింది. నాలుగు లక్షల లీటర్లకే డిమాండ్ ఉండగా, 6 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నందున నష్టం వస్తోందని, అందుచేత పాల సేకరణ ధర తగ్గించాలనీ ప్రైవేట్ కంపెనీలు చెల్లిస్తున్న ధరలనే తనూ చెల్లిస్తానని ఈ 'ప్రభుత్వ డైరీ' కొత్త పల్లవి అందుకోండి. అందుకు రైతులను బలవంతంగా ఒప్పించడానికే కొద్ది రోజులపాటు పాల సేకరణ నిలిపి వేసింది. లీటరుకు రూ. 19 ల నుండి రూ. 16. 50 కు ధర తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
కర్ణాటక తీరు:
మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రైతులకు లీటరుకు రూ. 18.68 నుంచి - రూ. 21ల వరకు చెల్లిస్తున్నారు. వెన్న తక్కువ పాలు బజారులో రూ. 27లకు విక్రయిస్తున్నారు. అదే మన రాష్ట్రంలో రైతులకు ప్రైవేటే డైరీలు లీటరుకు రూ.16. 50 నుంచి రూ. 18 చెల్లిస్తున్నారు. కానీ వెన్న తక్కువ పాలు బజారులో రూ. 32 రూ. లకు విక్రయిస్తున్నారు. అంటే కర్ణాటకలో సేకరణ ధరకూ - అమ్మకం ధరకూ తేడా రూ. 7 నుంచి రూ. 9 వరకూ ఉండగా, మన రాష్ట్రంలో ఆ తేడా రూ.14నుంచి రూ.16 వరకూ ఉంది. 'ప్రభుత్వ డైరీ' ధరలో ఆ తేడా రూ.13ల వరకూ ఉంది. కర్ణాటకకన్నా మన దగ్గర రూ.5 లు ధర ఎక్కువ!
ఇపుడు రైతులకు ధర రూ. 2.50ల వరకూ తగ్గిస్తామని 'ప్రభుత్వ డైరీ' చెబుతోంది. అందుకు "అధిక ఉత్పత్తిని" సాకుగా చూపిస్తోంది. కర్ణాటకలో రైతులకు ఖర్చు పెరిగిందని పాల రేటు పెంచాలని కోరుతూ ఉంటే ... ఇక్కడ రైతులకు ధర తగ్గింపు చెయ్యమని 'ప్రభుత్వ డైరీ' కోరుతోంది! అదేమంటే, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే రేటు గిట్టుబాటయితే, మా రేటూ రైతులకు గిట్టుబాటవుతుందని 'ప్రభుత్వ డైరీ' నమ్మబలుకుతోంది. నిజమే కదా మరి, ప్రైవేట్ కంపెనీలు లీటరుకు రూ. 16.50 లే చెల్లిస్తూ ఉంటే, ఆ రైతులు ఆనందంగా పాలు పోస్తూ ఉంటే, ప్రభుత్వ డైరీ' రైతులకూ అదే రేటు గిట్టుబాటు అవుతుంది కదా!
కానీ వాస్తవమేమిటి? ! పెద్ద ప్రైవేట్ కంపెనీలన్నీ ముఠా కట్టి, పాల సేకరణ ధర తగ్గించి రైతుల నోళ్ళు కొడుతున్నాయి. ఇప్పుడవి 'ప్రభుత్వ డైరీ' ని కూడా ఆ ముగ్గులోకి లాగుతున్నాయి. అట్లాంటి కుళ్ళు రాజకీయాలు చెయ్యడానికి పెద్ద తెలివి తేటలు అవసరం లేదు కదా!
రాష్ట్రంలో పోషకాహార సమస్య ఒక పక్క ఉంటే >> http://goo.gl/qkpxqI << అధిక పాల ఉత్పత్తి మాట ఎందుకు వస్తుంది? కర్ణాటకలో మధ్యాహ్న భోజన పథకం క్రింద బడి పిల్లలకు సుగంధ పాల పాకెట్లు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో కేవలం వరి అన్నమే కాకుండా గుడ్డు, పాలు ఇవ్వడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇదే పధ్ధతి చేపట్టడం ఉభయ తారకంగా ఉంటుంది. ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి 'ప్రభుత్వ డైరీ' విధాన నిర్ణయాలు ఉపయోగపడాలి. అంతేకానీ ప్రైవేట్ వ్యాపారులు 'ప్రభుత్వ డైరీ'ని నియంత్రించే పరిస్థితి రానీయ కూడదు! రైతుల పొట్ట కొట్టే పని చెయ్య కూడదు! వినియోగదారుల ఉసురు తియ్యకూడదు!
రాష్ట్రంలో పాల ఉత్పత్తికి మరింత అవకాశం ఉంది. ఇది లక్షలాదిమందికి ఉపాధి కలిగిస్తుంది. పాల ఉత్పత్తులను ఎగుమతి చేసే దశకు ఇంకా మనం చేరుకోలేదు. పశువుల పెంపకంలో మెళకువలు, పాల ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసే సామర్థ్యం పెరగాలి. ప్రస్తుతం ఉన్న తలసరి పాల వినియోగం 330 గ్రాములనుంచి 500 గ్రాములకు పెరగాలి. "పాలు తినండి" అని అమూల్ చేపట్టిన ప్రచారోద్యమం మనకూ అవసరం. రోజువారీ భోజనంలో పాల ఉత్పత్తుల శాతం పెరగాలి. పాలు పలచబడ కూడదు, చిక్కబడాలి! ఇది తెలుగు జాతికి ఆరోగ్య పుష్టిని, ఆర్ధిక పుష్టిని కలిగిస్తుంది!
Courtesy-Telugujaathi

No comments:
Post a Comment