మీరు కొత్తగా ఉద్యోగంలోకి చేరుంటే.. వీటిని తప్పక అనుసరించండి...
-ఆఫీసుకు వెళుతూనే మీ బాస్, సహోద్యోగులందర్నీ పరిచయం చేసుకోండి. వారిని కలవడానికి ప్రత్యక్షంగా వీలుకాకపోతే ఇంటర్‌నల్ సోషల్‌నెట్‌వర్క్ ద్వారా అయినా మీ గురించి తెలియజేయండి.
- ముందుగా మీ కంపెనీ ప్రధాన సేవల్ని, ఉత్పత్తుల్ని, లక్ష్యాలను గురించి తెలుసుకోండి.
- సంస్థ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనండి. అయితే ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించకండి.
- విధుల్లో భాగంగా మీకు ఎలాంటి సందేహం తలెత్తినా వెంటనే సీనియర్లను అడిగి నివృత్తి చేసుకోండి. మొహమాటానికి పోయి మౌనంగా ఉండిపోకండి.
- సహోద్యోగులందరితో సఖ్యతగా మెలగండి. ఉత్తమ సంబంధబాంధవ్యాలను నెరపండి. భవిష్యత్తులో అవన్నీ పనికొస్తాయి.
- వారానికి, నెలకు ఒకసారి మీ పనితీరు గురించి మీ బాస్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకుని ఒక అంచనాకురండి. అవసరమైతే పనితీరును మెరుగుపరుచుకోవడం, స్వభావాన్ని మార్చుకోవాలి.
- కంపెనీ యాజమాన్యం అడిగినప్పుడు మాత్రమే.. సంస్థ అభివృద్ధికి అవసరమైన సలహాలను ఇవ్వొచ్చు. అభ్యంతరం లేని ఫిర్యాదులను చేయవచ్చు.
- సామాజికసేవలో పాల్గొనే సంస్థ ఉద్యోగుల బృందాలలో కలవండి. మీరు కూడా భాగస్వాములుకండి.
-ఆఫీసులో పని వాతావరణాన్ని దెబ్బతీసే సంభాషణలకు తావివ్వకండి. అనవసరమైన గాసిప్స్, పాలిటిక్స్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
Courtesy-Andhrajyothy
No comments:
Post a Comment