లాఠీ పట్టుకుని.. ట్రాఫిక్ నిర్వహణలో లేదా బందోబస్తుల్లో యమబిజీగా గడిపే పోలీసులు.. 'బీ అలర్ట్' అంటున్నారిప్పుడు. అదే పేరుతో లఘుచిత్రాన్ని తీశారు. కొత్త నేరాలకు సరికొత్త మార్గంలో 'చెక్' పెట్టేందుకు వారు చేసిన చిన్న ప్రయత్నమే ఇది..
మెడలో బంగారు నెక్లెస్, లాంగ్‌చైన్ వేసుకున్న ఒక పల్లెటూరి మహిళ అప్పుడే బస్సు దిగింది. ఒక ఎస్ఐ ఆమెకు ఎదురొచ్చాడు. ఓ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి సెల్యూట్ చేశాడు. "ఏమ్మా నీకే చెప్పేది ఇటురా. అన్నేసి బంగారు నగల్ని వేసుకున్నావే, తెలియదా హైదరాబాద్‌లో నగల్ని వేసుకోవడం నిషేధించామని. నగల కోసం మనుషుల్ని చంపే గ్యాంగులు తిరుగుతున్నాయిక్కడ. పేపర్లలో మేము ఎన్ని ప్రకటనలు ఇచ్చినా మీరు మారడం లేదు. ఏమయ్యా కానిస్టేబుల్ నువ్వేం చేస్తున్నావ్'' గదమాయించాడు ఎస్ఐ. "సారీ సార్. నేను డ్యూటీ చేస్తూనే అందరికీ చెబుతున్నాను కానీ ఇలాంటి వాళ్లు అక్కడక్కడ కనిపిస్తున్నారు..'' అంటూనే "సార్ చెబుతున్నాడు కదమ్మా. నగలన్నీ తీసి కర్చీఫ్‌లో మూటకట్టుకుని బ్యాగులో పెట్టుకుని వెళ్లు..'' అన్నాడు కానిస్టేబుల్.
ఆమె దగ్గర కర్చీఫ్ లేకపోతే కానిస్టేబులే ఒక కర్చీపు అందించి.. నగలన్నీ అందులో మూటకట్టి ఆమె బ్యాగులో భద్రంగా పెట్టాడు. ఒక ఆటోను పిలిచి అందులో ఆమెను ఎక్కించి మరీ పంపించారు ఎస్ఐ, కానిస్టేబుల్. "హైదరాబాద్‌లో ఇంత మంచి పోలీసులు ఉంటారా?'' అనుకుంటూ ఇంటికి వెళ్లిన ఆమె బ్యాగులోని మూటను విప్పి చూస్తే ఏముంది? అందులో నగల్లేవు. పాత ఇనుప కడ్డీలు, రాగితీగలు ఉన్నాయి. అప్పుడు తెలిసింది మోసపోయానని. వాళ్లు పోలీసులు కాదు. నకిలీలని. ఇదేదో ఊహించి చెబుతున్న సంఘటన కాదు. ఈమధ్య నిజంగానే జరిగిన మోసం. ప్రజల్లో చైతన్యం పెరిగేకొద్దీ మోసగాళ్లు కూడా విపరీతమైన తెలివితేటలు చూపిస్తున్నారు. "నిన్న చేసిన మోసం ఈ రోజు చేయడం లేదు. పత్రికలు, టీవీల ద్వారా ఫలానా మోసం జరిగిందని ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం తెలుస్తోంది. మళ్లీ అలాంటి మోసమే చేస్తే సులువుగా పట్టుబడిపోతామని, మరోరకం కొత్త మోసానికి పాల్పడుతున్నారు నేరస్తులు. వాటన్నిట్నీ అరికట్టడమనేది పోలీసుల ఒక్కరి వల్లే కాదు. ప్రజల్లో కూడా చైతన్యం వస్తేనే సాధ్యం అవుతుంది'' అంటున్నారు హైదరాబాద్ నగర పోలీసులు.
దృశ్య చైతన్యం..
అలాంటి నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులకు వచ్చిన ఒక ఐడియా - 'బీ అలర్ట్'. ఇది నాలుగు నిమిషాల లఘుచిత్రం. జరుగుతున్న మోసాలను కళ్లకు కట్టినట్లు ఇందులో చిత్రీకరించారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో, సులభంగా గుర్తుపెట్టుకునే దృశ్యాలను తెరకెక్కించారు. "ఇది చిన్న ఆలోచనే కావొచ్చు. కాని దీని ప్రభావం విస్తృతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. త్వరలోనే దీన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, టీవీ ఛానళ్లలో ప్రసారం చేయనున్నాం..'' అని తెలిపింది నగర పోలీసుశాఖ. "పోలీసులు చెబితేనో నటిస్తేనో అంత ఆకర్షించదు. దీనికి సెలబ్రిటీ టచ్ ఇస్తే తప్ప అందర్నీ ఆకట్టుకోదు అనుకున్నాం. ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌ను అడగ్గానే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నారు. సమాజానికి ఉపయోగపడే ఏ పనైనా తను చేస్తానని ముందుకు వచ్చారాయన. రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించాం..'' అన్నారు సెంట్రల్‌జోన్ డీసీపీ వి.బి.కమల్‌హాసన్‌రెడ్డి.
సెలబ్రిటీ టచ్..
"హైదరాబాద్‌లో అటెన్షన్ డైవర్ట్ చేసి మోసం చేయడం ఈ మధ్య ఎక్కువైంది. కారులో ప్రయాణిస్తున్న వారిని సైతం చాకచక్యంగా మోసం చేస్తున్నారిప్పుడు. రెండొందలు కిందపడేసి.. 'సార్ మీవే డబ్బులు పడిపోయినట్లున్నాయ్' అని ఎరవేసి.. లక్షల సొమ్మును దోచుకెళుతున్నారు దొంగలు. మనిషిలో సహజంగా ఉండే ఆశను ఎరగా వేయడం సులభం. మరొక మోసం - మఫ్టీ పోలీసుల్లా వచ్చి దోచుకెళ్లడం. ఇక, బంగారానికి మెరుగులు పెడతామని చెప్పి జరుగుతున్న మోసాలు కూడా తక్కువేం కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు విజయకృష్ణకు సూచించాం. అతను కొన్ని మోసాలను లోతుగా పరిశీలించి ఈ లఘుచిత్రం తీశాడు'' అని చెప్పారు ఇన్స్‌పెక్టర్లు రాజారావు, రాములు.
-నవ్య డెస్క్
Courtesy-Navya Desk

No comments:
Post a Comment