Tuesday, 26 November 2013

కంప్యూటర్‌లో డాటా, ఫోటోలు డిలీట్ అయినా డోంట్ వర్రీ

ఎంతో మురిపెంగా దాచుకున్న బాబు బర్త్‌డే ఫోటోలు డిలీట్ అయిపోతే, ఆఫీసు ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించిన డాటా మొత్తం కంప్యూటర్‌లో తుడిచిపెట్టుకుపోతే, ముఖ్యమైన ఈమెయిల్స్ ఇన్‌బాక్స్‌లో కనిపించకుండా పోతే ఆ బాధ చెప్పనలవి కాదు. ముఖ్యమైన డాటా కొన్నిసార్లు అనుకోకుండా డిలీట్ కావచ్చు. మరికొన్ని సార్లు వైరస్ మూలంగా కరప్ట్ కావచ్చు. అయితే అలా డిలీట్ అయిన డాటాను తిరిగి పొందే మార్గాలు ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం...

ఫ్రీ అన్‌డిలీట్
పొరపాటున ఫైల్‌ను డిలీట్ చేశారా? రీసైకిల్‌బిన్‌లో నుంచి కూడా రిమూవ్ చేశారా? అయినా పర్వాలేదు. మీరు డిలీట్ చేసిన ఫైల్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీ అన్‌డిలీట్ టూల్ ఉంటే చాలు. యాక్సిడెంటల్‌గా రిమూవ్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొందడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. విండోస్ విస్టా, ఎక్స్‌పీ, 2000, ఎన్‌టీ ఉపయోగిస్తున్న వారు దీన్ని ఎంచుకోవచ్చు. రికవరీ అయిన ఫైల్స్‌ను మీకు కావలసిన లొకేషన్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఒరిజనల్ ఫైల్స్‌పై ఓవర్ రైట్ కావడానికి నివారించవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం ఈటూల్‌ను ఉచితంగా ఎంపిక చేసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఫుల్ ఫంక్షనల్ కాపీని పొందవచ్చు. ఈ ప్రొగ్రామ్ స్పైవేర్, అడ్‌వేర్ వంటి వాటిని ఇన్‌స్టాల్ చేస్తుందన్న భయం అక్కర్లేదు. వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. వారికి కస్టమర్ సపోర్టు సర్వీస్ లభిస్తుంది. డాటా రికవరీ కోసం ముందుగా ఫ్రీ అన్‌డిలీట్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత డిలీట్ ఫైల్స్‌ను తిరిగి పొందడం కోసం టూల్‌ను రన్ చేస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్ ఇన్‌స్టలేషన్ కోసం యూఎస్‌బీ ఫ్లాష్ డ్రైవ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టలేషన్ కోసం హార్డ్‌డ్రైవ్‌లో కనీసం 10 ఎంబి స్పేస్ ఉండేలా చూసుకోవాలి.

రెక్యువా
ముఖ్యమైన ఫైల్ అనుకోకుండా డిలీట్ అయిందా? కంప్యూటర్ క్రాష్ అయి ముఖ్యమైన సమాచారమంతా తుడిచిపెట్టుకుపోయిందా? బాధపడకండి. రెక్యువా మీ ముఖ్యమైన డాటాని రికవరీ చేస్తుంది. విండోస్ కంప్యూటర్, డిజిటల్ కెమెరా కార్డ్, ఎమ్‌పీ 3 ప్లేయర్, యూఎస్‌బీ డ్రైవ్, ఐపాడ్... ఇలా ఎందులోనైనా పోయిన డాటాను రికవరీ చేసి పెడుతుంది. అదీ ఉచితంగానే. డిస్క్ డ్యామేజ్ అయినా, ఫార్మాట్ చేసినా డాటాను వెతికిపెడుతుంది. ఫైల్ నేమ్, టైప్ ఆధారండా పోయిన ఫైల్‌ను తిరిగి పొందవచ్చు. ట్రాష్‌లో నుంచి డిలీట్ అయిపోయిన మెయిల్స్‌ను సైతం రికవరీ చేస్తుంది. ఐపాడ్‌లో డిలీట్ అయిన మీకిష్టమైన మ్యూజిక్ ఫైల్స్‌ను సైతం రెక్యువాతో తిరిగి పొందే అవకాశం ఉంది. సేవ్ చేయడం మరచిపోయిన ముఖ్యమైన వర్డ్ డాక్యుమెంట్లను కూడా టెంపరరీ ఫైల్స్‌లో నుంచి రీబిల్డ్ చేస్తుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే వందలాది ఫైల్స్‌ను రెక్యువా స్కాన్ చేస్తుంది. విండోస్ ఏ మోడ్రన్ వెర్షలోనైనా ఈ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

అన్‌డిలీట్ ప్లస్
డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్స్... ఏదైనా మీ కంప్యూటర్‌లో అనుకోకుండా డిలీట్ అయిన ఫైల్‌ను తిరిగి పొందడానికి అన్‌డిలీట్ ప్లస్ ఉపయోగపడుతుంది. రీసైకిల్‌బిన్‌లో నుంచి సైతం డిలీట్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొందవచ్చు. ఒక్క మీ కంప్యూటర్‌లోనే కాదు. యూఎస్‌బీ డ్రైవ్స్, కెమెరా మీడియా కార్డ్స్, ఫ్లాపీ డిస్క్‌ల నుంచి డిలీట్ అయిన ఫైల్స్‌ను కూడా పొందవచ్చు. ముఖ్యమైన డాటా పోయిందని ఆందోళన చెందే వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

ఫైల్ రికవర్
డిలీట్ లేక కరప్ట్ అయిన ఫైల్స్‌ని తిరిగి పొందడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. డిలీట్ అయిన ఫైల్‌ను ఏ డ్రైవ్‌లో స్కాన్ చేయాలో స్పెసిఫై చేయవచ్చు. ఫైల్ టైప్, సైజును కూడా పేర్కొనవచ్చు. ఫైల్ నేమ్‌ను టైప్ చేసి కూడా రికవరీ చేసుకోవచ్చు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే హార్డ్ డిస్క్ మొత్తం స్కాన్ చేసి మీ ఫైల్‌ని ముందుంచుతుంది.

డిస్క్ ఇన్వెస్టిగేటర్
మీ సిస్టమ్‌లో కనిపించకుండా పోయిన ఫైల్స్‌ను వెతకడం మాత్రమే కాకుండా హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న సమాచారాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఈ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే డిస్క్‌ను పూర్తిగా విశ్లేషిస్తుంది. అందులో ఉన్న సమాచారం, ఫైల్స్ సైజును లిస్ట్ రూపంలో అందిస్తుంది. ఈ టూల్ సహాయంతో వీడియో ఫైల్స్, ఈమెయిల్ అటాచ్‌మెంట్స్ వంటి వాటిని తిరిగి పొందవచ్చు. డాటాను తిరిగిపొందడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన డాటాను రికవరీ చేసుకోవడానికి ఈ టూల్స్ ఎంతగానో సహాయపడతాయనడంలో సందేహం లేదు కదూ!
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment