పేస్ బుక్ కి ఎందుకు ఆకర్షితులము అవుతాము ? మానసిక శాస్త్ర సహాయం తో ఒక విశ్లేషణ
ఒక విచిత్రం ఏమిటంటే నేను ఏదో సైకాలజీ జర్నల్ లో దాదాపు సంవత్సరం కింద ఒక
వ్యాసం చదివినాను . పేస్ బుక్ కి addict అయ్యే వారి గురించి .
అప్పటిదాకా నాకు పేస్ బుక్ అంటే ఏమిటో తెలియదు . అప్పటిదాకా నేను
ట్విట్టర్ , యాహూ ఆన్సర్ లు సామ్రాజ్యాన్ని ఎలుతుండే వాడిని
అసలు ఈ పేస్ బుక్ అంటే ఏమిటి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అని నెట్ లో వ్యాసాలూ చదివి ఇందులో ప్రవేశించాను
మొదట నేను పేస్ బుక్ లో ని బొమ్మలు, సూక్తులు అన్నీ వారి స్వంతం అని భ్రమ లో ఉండే వాడిని .
వారిని ఆరాధించే వాడిని . తరవాత తెలిసింది. అవి డౌన్ లోడ్ చేసుకుని షేర్ చేసుకున్నవని
సైకాలజీ జర్నల్ లో పేస్ బుక్ వ్యసనం గురించి కామెంట్ రాద్దాము అను కున్న
వాడిని కాస్తా నేను గూడా దాని పట్ల ఆకర్షితుడు ను అయినాను. పద్మ వ్యూహం లో
చిక్కుకున్న అభిమన్యుడి మాదిరి అయ్యాను .
పేస్ బుక్ వలన లాభాలు
1 ప్రపంచం మన గుప్పిట్లో ఉంటుంది . ఈ పేస్ బుక్ ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ చదవచ్చు
2, అదే కాలం లో యాహూ మెసెంజర్ బదులు మన ఫ్రెండ్స్ తో చాట్ చెయ్య వచ్చు,
సంగీతం విన వచ్చు , చూడ వచ్చు జోక్స్ ను చదివి కార్టూన్స్ ను చూసి పొట్ట
చెక్కలు అయ్యే విధంగా నవ్వు కోవచ్చు
3, ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటె
విభిన్న మనస్తత్వాలని , ఇరుగమ్మ, అరుగయ్య కబుర్లనీ రస కందాయము గా ఉండు చాట్
ఇంపు (చాటింపు) లను కొనసాగించా వచ్చు
4. మన కష్ట సుఖాలను పంచు కోవచ్చు ఈ సోషల్ మీడియా వలన ప్రజలకి ఉపయోగ పడే కార్యక్రమాలను చేసే వారు ఎందరో ఉన్నారు
5
ఆఖరికి తేలింది ఏమిటంటే ఒంటరిగా ఉండే వారు పేస్ బుక్ కి అడిక్ట్ అవుతారా
లేదా పేస్ బుక్ కి అడిక్ట్ అవటం వలన బయట ప్రపంచానికి దూరం అవుతారా అన్నది
విత్తు ముందా చెట్టు ముందా , కమోడిటీ ధర ను నిర్ణయించేది డిమాండ్ నా లేక
సప్లై నా , Nature vs Nurture సిద్ధాంతాలు లాగా తేలని సమస్య
కానీ ఈ కారణాల వలన పేస్ బుక్ ని ఉపయోగిస్తారు కొందరు
1. ఒంటరి తనాన్ని అధిగమించటానికి. నేటి ప్రపంచం లో అంతా ఉరుకుల పరుగుల
ప్రపంచం అయ్యింది . ఎవరికి వారే యమునా తీరే అయి పోయారు . పేస్ బుక్ లాంటి
సోషల్ మీడియా లు ఈ వంటరి తనాన్ని అధిగమిస్తుంది . బిజీ గా ఉన్నప్పుడు
స్నేహితుల తో గడపలేము . అదే పేస్ బుక్ లో అయితే ఇంటికి వాచ్చినాక కాసేపు
రెస్ట్ తీసుకుని ముచ్చట్లు పెట్టుకోవచ్చు
2. తమ తాత్విక, రాజకీయ సిద్ధాంతాలని ప్రచారం చెయ్యటానికి
3. తమ లో ని తమ పిల్లల విద్యనూ, సంగీతం, కవిత్వం చిత్రకళా ను మొదలైన
వాటిని ఇతరుల కి చూపటానికి . అదే పూర్వం అయితే ఒక కవిత కానీ , చిత్రం
కానీ ఇతరులు చూడాలి అంటే ఎంతో ఖర్చు చెయ్యాల్సి వచ్చేది
4 అసలు పేస్ బుక్ addiction గురించి వీరు అందరూ ఏం చేస్తున్నారు చెప్మా అని కుతూహలం తో ఇందులో కి దూరే వారు
5. కా సేపు బయట ప్రపంచం లో ని బాధలు మర్చి పోవటానికి
కానీ పేస్ బుక్ ఫ్రెండ్స్ మన నిజజీవితం లో ఫ్రెండ్స్ కారు . వారిని ఎంత
దూరం లో ఉంచాలో అంత దూరం లో ఉంచాలి . లేక పొతే లేని పోనీ సమస్యలను ఎదుర్కో
వలసి వస్తుంది . బాహ్య ప్రపంచం లో ఎటువంటి మనస్తత్వము కల వారు ఉంటారో
అన్ని రకాల వారూ ఉంటారు .
మీ మెడలో పొగడ్తల పొగడపు దండలే
వేసే వారే కాక మాటల ముళ్ళ కిరీటం పెట్టె వారూ ఉంటారు . అందుకే
సున్నిత మనస్తత్వము కలవారు అటువంటి మనస్తత్వము కలవారితో నే స్నేహం
చెయ్యాలి . తమ హృదయాన్ని అందరి ముందూ పరచ రాదు .
కానీ ఎక్కువ
గంటలు పేస్ బుక్ లో గడపటం మంచిది కాదు . దీనివలన బాహ్య ప్రపంచం లో ని
నిజమైన వ్యక్తుల తో మానవ సంబంధాలు దెబ్బతింటాయి కొంత కాలానికి
డిప్రెషన్ అదివరకే ఉన్నవారికి ఇంకా ఎక్కువ అవుతుంది . ఇతరులు మన మనసును
కించ పరిచినప్పుడు ఆందోళన కి గురి అవుతాము . ఫలితము గుండె దడ ఎక్కువ
అవుతుంది . తీవ్రమయిన అశాంతికి లోను అవుతాము .
ఖైదీ కన్నయ్య సినిమా లో ని సాంగ్ తీయ తీయని మాటలతో , పాట లో లాగా ప్రవర్తించే మనుషులు ఉంటారు
తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నవారికి, అదివరకే జీవితం లో అనేక సమస్యలు ను ఎదుర్కొన్న వారికి మటుకు ఇది వర్తించదు
అసలు పేస్ బుక్ అంటే పూర్వం ఇళ్ళల్లో అమ్మలక్కలు మధ్యన్నాలు మాటలే . అలాగే
అరుగుల మీద, రచ్చ బండల మీద , కరెంటు స్తంబాల కిందా చేరి మొగవారు
చెప్పుకునే ఖబుర్లే
Courtesy-Swechamanavathanath
No comments:
Post a Comment