Tuesday, 12 November 2013

Be Aler with Facebook usage

పేస్ బుక్ ని మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం స్నేహితులుగా ఎంచుకో బోతున్న వారు ఏ దృష్టితో వాడుతున్నారు అనేదే ప్రధానం. పేస్ బుక్ లో ఒక్కప్పుడు కంటే ఇప్పుడు కొంత పరిపక్వత చెందిన వారు ఖాతా దారులుగా ఎక్కువుగా చేరుతున్నప్పటికి కుర్ర కారు మత్రం దానిని ఇంకా తమ లోని వికారాలు ప్రదర్శించ దానికే వినియోగిఒస్తున్నారు అని చెప్పక తప్పదు.

ఒక మంచి కోసం ముందుకు పోతున్నపుడు ముందుగా ఎదురయ్యేది చెడే కావచ్చు . కానీ దానిని అదిగమిస్తేనే మంచి అనేది దొరకదు. ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపేన్ చేసే వారిలో చాలా మంది తమ ఒరిజినల్ పోటోలు కానీ , అడ్రెస్ కానీ ఇవ్వరు. ఆడపిల్లలు అయితే సరే. కానీ మగపిల్లలు కూడా ఆడపిల్లల పేరుతో అకౌంట్ లు ఓపెన్ చేసి ఆడపిల్లలతో స్నేహాలు కలిపి చాటింగ్ లు చేస్తూ ఉంటారు. ఇది లేని పోని వ్యవహారాలకు దారి తీసి తమ జీవితాలు నాశనం చేసుకున్న వారి గురించి పేపర్లలో చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి వారి అకౌంట్ ల పట్ల జాగర్త గా ఉంటే, ఫేస్ బుక్ విషయ సేకరణకు, సామజిక అవగాహనకు బాగా పనికి వస్తుంది. ప్రజల అభిప్ర్రాయాలు తెలుసుకోవడానికి సామాజిక వెబ్సైట్లు ను ప్రభుత్వ వర్గాలు ఉపయోగించడం గమనార్హం.మీ బావాలను , మీ లోని నైపుణ్యాలను పది మందితో పంచుకుని , మీ విషయ పరిదిని పెంచుకోవడానికి , మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది తప్పకుండా పనికి వస్తుంది. కాకపొతే దానిలో ఉన్న రాక్షసుల అకౌంట్ లను పట్టించుకోకుండా , ఎవరి అకౌంట్ అయినా కొంత కాలం పరిశీలించాకే వారిని మిత్రులుగా స్వీకరింఛి వారితో మీ బావాలు షేర్ చేసుకోవడం మంచిది.మీ ఫేస్ బుక్ మిత్రులు గురించి మీ కుటుంబం లోని వారికి కూడా తెలియటం మంచిది
Courtesy-Nijam Matladu Mitrama

No comments:

Post a Comment