ఫేస్ బుక్ లో తెలుగులో టైప్ చేసేదేలా?
అనేకమంది మిత్రులు అంతర్జాలంలో తెలుగులో రాయాలనే కోరిక వ్యక్తం
చేస్తున్నారు. కానీ ఎలా రాయాలో తెలీక ఆగిపోతున్నారు. నేరుగా ఫేస్
బుక్ లోనే రాయడానికి గూగుల్ అంతర్లిపి సదుపాయం కల్పిస్తోంది. ఇందుకు మీరు
క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించాలి. మీరు ఇప్పటికే క్రోం ఉపయోగిస్తూ ఉంటే సరే!
లేకపోతె ఈ క్రింది శృంఖల ద్వారా క్రోం పొందండి.
https://www.google.com/intl/ en/chrome/browser/
తర్వాత, క్రింది శృంఖల ద్వారా గూగుల్ ఇన్ పుట్ సాధనం పొందండి.
https://chrome.google.com/ webstore/detail/ google-input-tools-for-ch/ iiicejfhlmmhlekmafefbecflcpdkoc b?hl=en
పై
సాధనంలో కుడి వైపు పై మూల "Add to chrome" అనే మీట నొక్కండి.. అక్కడ వివిధ
భాషలను ఎంపిక చేసుకునే సదుపాయం ఉంటుంది." తెలుగు" ఎన్నుకోండి. OK
చెయ్యండి. మీ బ్రౌజర్లో కుడి మూల బాణం గుర్తు వస్తుంది. దాని ద్వారా మీరు
తెలుగు లేదా ఆంగ్ల భాషలకు మారుతూ టైపు చెయ్యవచ్చు. ఇదే పద్ధతిలో బ్లాగులలో
కానీ, మెయిల్ లో కానీ టైప్ చెయ్యవచ్చు. ప్రయత్నించండి. మరింత వివరం కావలసి
వస్తే ఇక్కడ అడగండి.
అమ్మ భాష తెలుగులో మన అభిప్రాయాలు, వాదనలు, విశేషాలు మరింత చక్కగా వ్యక్తం
చెయ్యగలమని గుర్తించండి
No comments:
Post a Comment