ఈనాడు, హైదరాబాద్: పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే తెలియని ఆందోళన. అసలు చాలా సందర్భాల్లో తాము స్వయంగా నేరగాళ్ల బారినపడ్డా అసలు ఎవర్ని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాల విషయంలో అయితే బాధితులు నోరు మెదిపేందుకు కూడా ఇష్టపడరు. ఇటువంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర సీఐడీ సిద్ధమైంది. వెబ్‌సైట్ ద్వారా తమ సమస్యకు సంబంధించి చిన్న సందేశం పంపితే చాలు సంబంధిత అధికారులు అందుబాటులోకి వస్తారు. ఇప్పుడిప్పుడే ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఈ సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. దొంగతనాలు, హత్యలు.. ఇతరత్రా సాధారణ నేరాలయితే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.
కాని ఆర్థిక నేరాలు, ఇంటర్నెట్ ద్వారా జరిగే దుష్ప్రచారం, అసభ్య సందేశాలు, మహిళలపై జరిగే వేధింపుల వంటి విషయంలో బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటే జంకుతారు. అక్కడ పోలీసులు రకరకాల ప్రశ్నలతో వేధిస్తారనే భావనే ఇందుకు కారణం. అందుకే చాలామంది బాధితులు అన్యాయం జరిగినప్పటికీ తమలో తామే కుమిలిపోతుంటారు. అసలు తమకు వచ్చిన సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలి, ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలన్న విషయం కూడా చాలామందికి అవగాహన లేదు. ఈ పరిస్థితిని గుర్తించే సీఐడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 'సీఐడీఏపీ' వెబ్‌సైట్‌ను మెరుగుపరుస్తున్న అధికారులు దానిలో భాగంగా ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేలా పలు చర్యలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగా ప్రజలు ఎవరైనా, ఎలాంటి సమస్యయినా తమ దృష్టికి తీసుకొచ్చేలా వెబ్‌సైట్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించారు. ఈమేరకు వెబ్‌సైట్లో 'సంక్షిప్త సందేశం' పంపడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దానిద్వారా బాధితులు తమ వివరాలు ఇవ్వడంతోపాటు తమకు వచ్చిన సమస్య గురించి కూడా క్లుప్తంగా వివరిస్తే ఆ సందేశం సంబంధిత ప్రత్యేక విభాగానికి బదిలీ అవుతుంది. దాన్నిబట్టి సంబంధిత అధికారి బాధితులను సంప్రదిస్తారు. ఉదాహరణకు ఆర్థిక నేరానికి కాని, ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన సమాచారమైతే సీఐడీలో ఆ విభాగం చూస్తున్న అధికారులకు సందేశం వెళుతుంది. బాధితుల ఫిర్యాదు, అధికారుల ప్రతిస్పందన అంతా గోప్యంగా జరుగుతుంది. దాంతో ఎవరైనా నిర్భయంగా తమ సమస్యను చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే తమకు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
Courtesy-EEnadu

No comments:
Post a Comment