సంగీతం మహాసముద్రం. దాన్ని ఈదడం పక్కనబెట్టండి. తీరం వద్ద నిల్చోవాలన్నా అపారమైన పరిజ్ఞానం, సాధనసంపత్తి అవసరం. అలాంటి సంగీతం మీద కాస్త ఆసక్తి, అవగాహన ఉంటే చాలు.. ఆ విద్యను సులువుగా నేర్చుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది మా 'మ్యూజిక్‌చక్ర' అంటున్నారు దాని రూపకర్త లేళ్లపల్లి రమేష్..
"మాది తెలుగు కుటుంబం. ఉద్యోగరీత్యా మద్రాసు ఐఐటీలో మా తల్లిదండ్రులు స్థిరపడ్డారు. దీంతో నా బాల్యమంతా అక్కడే గడిచింది. సంగీతం మీద ఆసక్తి కలగడానికి కారణం ఇళయరాజా గారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ఆయన సంగీతాన్ని వినడం వల్ల.. హార్మోనియం మీద మోజు ఏర్పడింది. నాలోని కుతూహలాన్ని గమనించిన నాన్న డాక్టర్ ఎల్‌వీ శర్మ నాకొక కీ బోర్డును బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి కీ బోర్డు మీద ప్రయోగాలు చేస్తుండేవాణ్ణి. ఇళయరాజా గారి పాటలను వినడం, ఆయన ఎలాంటి సంగీత స్వరాలను సమకూర్చారో ఆలోచించడం ఇదే నా పని. నాకు పదిహేనేళ్లు కూడా నిండక ముందే 'ఇళయరాజా కంపోజిషన్ బుక్'ను సొంతంగా తయారు చేసుకున్నాను. ఒక ప్రైవేటు నౌకా సంస్థలో ఉద్యోగం చేస్తున్నా కూడా.. నా దగ్గరున్న కీబోర్డు మీద తెలిసిన రాగాలను పలికించడం మానలేదు. శాస్త్రీయ సంగీతం సాధన చేస్తూనే పాశ్చాత్య సంగీతం కూడా నేర్చుకోవాలనిపించింది. వెంటనే గోపాలకృష్ణ అనే ఆయన దగ్గర చేరి అందులో మెళకువలను ఔపోసనపట్టాను.
ట్యూషన్లు చెప్పి...
స్నేహితుల పిల్లలకు సంగీతం నేర్పుతుండగా వచ్చిన ఆలోచనే 'మ్యూజిక్ చక్ర'. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా స్వరాలను గుర్తించగలిగి, వాయించే ఓ గైడ్ లాంటిది ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. ఆ ఆలోచనను పదును పెట్టి శోధించి సాధించిన ఆవిష్కరణే 'మ్యూజిక్ చక్ర'. శాస్త్రీయ సంగీతంలోని మేళకర్త రాగాల సంఖ్య 72. వాటి విభాగాలన్నీ స్వర చక్రాలే! వీటిని స్ఫూర్తిగా తీసుకునే మ్యూజిక్ చక్రను తయారుచేశాను. మేళకర్త రాగాలన్నిటినీ ఒక చక్రంలో ఇమిడ్చి, అవి పలికే కీబోర్డు సూచికలను గుర్తించే ఆధారాన్ని రూపొందిస్తే ఎవరైనా కీ బోర్డును వాయించగలరు అన్నది నా భావన. మ్యూజిక్‌చక్రను ఎలా చేశానంటే - 72 మేళకర్తలను రెండుగా విభజించి చక్రం ఒక వైపు 36 మేళకర్తలు, మరో వైపు మిగతా 36 మేళకర్తలను ఏర్పాటు చేశాను. ఆయా మేళకర్తలలోని ఆరు చక్రాలను, జన్యురాగాలను వేర్వేరుగా విభజించి కీ బోర్డు పలకలపై ఏ మీట నొక్కితే ఏ రాగం జనిస్తుందో తెలిపే విధంగా 'చుక్కల' సిద్ధాంతాన్ని వర్తింపచేశాను. ఆయా రాగాల పేర్లు రాసి, ఆ రాగాల కింద కీ బోర్డు పలకలను ఉంచి, ఏ మీట నొక్కాలో చూపించే విధంగా ఆ మీటలపై చుక్కలను సూచికగా ఉంచాను. ఇలా చేయడం వల్ల చుక్కలు ఉన్న మీటలను నొక్కడం ప్రాక్టీసు చేస్తే, ఆయా రాగాలను సులువుగా నేర్చుకోవచ్చన్నది నా మ్యూజిక్ చక్ర విధానం. ఇలా రూపొందించిన మ్యూజిక్ చక్రకు నేను 'శ్రీ సరస్వతీ 72 మేళకర్త చక్ర'గా నామకరణం చేశాను. కొన్నేళ్లపాటు శ్రమిస్తేకానీ ఈ యజ్ఞం పూర్తవ్వలేదు. ఇందుకోసం నా భార్య శ్రీదేవి ఎంతో సహకరించింది. ఈ పరికరం సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడిని తీసుకొస్తుందన్న విశ్వాసం నాకు ఉంది. సాధారణ సంగీతాభిరుచి ఉన్నవాళ్లు ఎవరైనా 'మ్యూజిక్ చక్ర'ను ముందుపెట్టుకుని.. స్వరాలను సమకూర్చవచ్చు..''
గొల్లపలి ప్రభాకర్‌రావు, చెన్నయి
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment