Thursday, 14 November 2013

మరి అవినీతి పరిస్తితి మారేదెలా?

నిజం చెప్పాలంటే ఏ కాలంలోనైనా సరే,మన దేశం మంచి పరిస్తితిలో ఉన్నది చాలా తక్కువ.
దానికి కారణాలు
సమర్ధమైన నాయకత్వం లోపించడం.
సరియైన నాయకులని ప్రజలు ఎన్నుకోక పోవడం.
అసలు సరియైన నాయకులను ఎన్నుకునే చాయిస్ ప్రజలకు లేకపోవడం.

దీనికి ఇంకొక ముఖ్యకారణం ఏమంటే ఎక్కడ చూచినా పేరుకుపోయిన అవినీతి.దానిని పోషిస్తున్న రాజకీయులు,వ్యాపారులు, ఉద్యోగులు.వెరసి అవినీతి జీర్ణించుకుపోయిన పౌరులు. మా ఫ్రెండ్ ఒకాయనతో మాట్లాడుతుంటే ఒక విషయం చెప్పాడు.గుంటూరులో తను ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంటే అక్షరాలా ఏభైవేలు లంచం ఇస్తేగాని పని కాలేదట.ఇదివిని నాకు మతి పోయినంత పనైంది.

ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండే లంచగొండితనం తెలీనిదేమీ కాదు. ఇంతకు ముందు లంచం తీసుకునేవారు భయపడుతూ తీసుకునేవారు. తాగుడు లాగానే.ఇంతకుముందు తాగి రోడ్డుమీద తిరగాలంటేనో,ఇంటికి రావాలంటేనో ఆ తాగినవాడే సిగ్గు పడేవాడు.వాడిలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది.ఇప్పుడో? అవేవీలేవు.తాగనివాడు చేతగాని వాడికింద జమకట్టబడే సమాజం నేడున్నది.కుటుంబసభ్యులందరూ కూచుని కాఫీ తాగినట్లు విదేశీసారా తాగుతున్న రోజులివి.అలాగే లంచంకూడా.ఒకప్పుడు దొంగచాటుగా తీసుకున్వేవారు.ఇప్పుడు పబ్లిగ్గా,అడిగి మరీ తీసుకుంటున్నారు.ఇచ్చేవారూ ఇస్తున్నారు.ఇద్దరిదీ తప్పే.ఎవరి కారణాలు వారికుంటున్నాయి.

నేను మా ఫ్రెండ్ ని ఇదే అడిగాను.డబ్బిచ్చి నీవూ తప్పుచేశావు కదా.వారిని అనే హక్కు నీకెక్కడిది? అని.ఇవ్వకపోతే ఈ జన్మకు నాకు అప్రూవల్ రాదు.ఈలోపల కట్టుబడి ఖర్చులు దారుణంగా పెరుగుతాయి.వాళ్ళు పెట్టే ఇబ్బందులకు,చేసే ఆలస్యానికీ,పెరిగే ఖర్చులకూ చూసుకుంటే, వాళ్ళు అప్రూవల్ ఇచ్చే నాటికి నేనా స్థలంలో గుడిసె కూడా వేసుకోలేను. అన్నాడు.అది అతని లాజిక్.

ఇక తీసుకునే వాని లాజిక్ విందాం.అన్ని రేట్లూ విపరీతంగా పెరిగాయి.మేమూ బ్రతకాలిగా?ఎవరు తీసుకోవడం లేదు?నాయకులు లంచగొండులు కాదా?వ్యాపారులు కాదా?పెద్ద పెద్ద ఆఫీసర్లు కారా?మేమొక్కల్లమే లంచాలు తీసుకుంటున్నామా? అని వారంటున్నారు.మొత్తం మీద అవినీతి అనేది ఒక ఆమోదనీయమైన వాస్తవం అయిపొయింది.

Courtesy-Nijam Maatlaadu mithrama

No comments:

Post a Comment