Wednesday, 13 November 2013

మీ అన్వేషణకు ఈ యూప్స్ తోడైతే..

కొందరు విద్యార్థులు సైన్స్ సబ్జెక్ట్‌ను అమితంగా ఇష్టపడతారు. ప్రతీ విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారు టెక్నాలజీని ఉపయోగించుకుంటే సైన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా తెలుసుకోవచ్చు. సైన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కొన్ని యాప్స్ ఉపయోగపడతాయి.
వీటిని ఎంచుకుంటే సైన్స్ అధ్యయనం మరింత సులభతరం అవుతుంది. ఆ విశేషాలు మీ కోసం....

Geology sample collector
ఆండ్రాయిడ్
జియాలజీ నోట్‌బుక్
జియాలజిస్ట్‌లుగా పనిచేయాలనుకునే వారికి ఉద్దేశించిన అప్లికేషన్ ఇది. మీ చుట్టుపక్కల పరిశీలించిన ప్రతీ అంశాన్ని రికార్డు చేసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్, వీడియోలు, ఫోటోలు, టెంపరేచర్ రీడింగ్, టైమ్ స్టాంప్స్, నోట్స్, జీపీఎస్ డాటా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ యాప్‌లో ఉన్న మరొక అద్భుతమైన ఫీచర్ డిజిటల్theodolite. దీని సహాయంతో ఎత్తు, దూరం, యాంగిల్స్ వంటి వాటిని కొలవవచ్చు. ప్రాజెక్టు పూర్తయినపుడు ఈ యాప్ మీ డాటాను అప్‌లోడ్ చేసి క్చ్జౌటజౌటఝట.ఛిౌఝ లో బ్యాకప్ ఇస్తుంది. అప్పుడు మీరు గూగుల్ మ్యాప్‌లో సులభంగా డిస్‌ప్లే చేయవచ్చు.
Weather signal
ఆండ్రాయిడ్
మొబైల్ వెదర్ స్టేషన్, సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్
వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఫోన్ సెన్సర్స్ ఆధారంగా వెదర్ కండిషన్స్‌ను తెలుసుకోవ చ్చు. ఉష్ణోగ్రత, ఒత్తిడి, వెలుతురు, మాగ్నెటిక్ ఫ్లక్స్ వంటి సమాచారా న్ని తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపకరిస్తుంది. ఒకవేళ మీరు సామ్‌సం గ్ గెలాక్సీ ఎస్4 ఉపయోగిస్తున్నట్లయితే తేమ శాతాన్ని లెక్కించవచ్చు.
ISS Detector
ఆండ్రాయిడ్
ఆస్ట్రానమీ నావిగేషన్ టూల్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మీరున్న లొకేషన్ నుంచి వెళుతున్నప్పుడు మీకు చూపిస్తుంది. అంతేకాకుండా ఏ సమయంలో కనిపిస్తుందో తెలియజేస్తుంది. ఈ యాప్‌లో వెదర్ కండిషన్, స్పేస్ స్టేషన్ కనిపించే అవకాశం ఉందా లేదా తెలియజేస్తుంది. స్పేస్ స్టేషన్ మీ లొకేషన్ నుం చి వెళ్లడానికి గంట ముందు నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.
Sky Map
ఆండ్రాయిడ్
ఆస్ట్రానమీ నావిగేషన్ టూల్
ఖగోళ విషయాలపై ఆసక్తి కనబరిచే వారికి ఉపయోగపడే టూల్ ఇది. రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాల కనువిందును పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ యాప్ ఎంచుకోవాల్సిందే. ఈ యాప్ సహాయంతో ఇష్టమైన నక్షత్రాలను చూడవచ్చు. గ్రహాలను వీక్షించవచ్చు. ఖగోళంలోని ఇతర వస్తువులు, సమూహాలను పరిశీలించవచ్చు.
Sonar ruler
ఐఓఎస్
చిన్న చిన్న దూరాలను కొలవడానికి ఉపయోగపడుతుంది.
మీకు ఎదురుగా ఉన్న గోడ లేదా రాయి ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలంటే ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇది దూరాన్ని కొలవడానికి చిన్న శబ్దాన్ని చేస్తుంది. ఆ శబ్దం వస్తువును తాకి మరలా ఫోన్‌ను చేరడానికి పట్టిన సమయం ఆధారంగా దూరాన్ని లెక్కిస్తుంది. ఈ యాప్ 60 ఫీట్ల దూరం వరకు పనిచేస్తుంది. అయితే ఈ అప్లికేషన్ ఇంకా ప్రయోగదశలోనే ఉంది. కాబట్టి ఉపయోగించినపుడు ఫలితాలు కొంత వేరుగా వచ్చే అవకాశం ఉంటుంది.
Leafsnap
ఐఓఎస్
ట్రీ క్యాటలాగ్
చెట్ల శాస్త్రీయనామాలు, జాతులు గుర్తుపెట్టుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ సైన్స్ విద్యార్థులు గుర్తుపెట్టుకోక తప్పదు. చెట్ల శాస్త్రీయనామాలే కాకుండా ఆ చెట్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే లీఫ్స్‌నాప్ యాప్‌ని ఎంచుకోవాలి. కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ వారు రూపొందించిన అద్భుతమైన యాప్ ఇది. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్న వృక్షం ఆకును స్మార్ట్‌ఫోన్‌తో ఒక ఫోటో తీస్తే మిగతా వివరాలన్నీ యాప్ చూసుకుంటుంది. అయితే ఈ అప్లికేషన్ సరిగ్గా పనిచేయాలంటే పిక్చర్‌లో వైట్ బ్యాక్‌గ్రౌండ్‌పై చెట్టు ఆకు ఉండేలా చూసుకోవాలి. ఒక తెలుపు కాగితంపై చెట్టు ఆకును అతికిస్తే ఎలా ఉంటుందో పిక్చర్‌లో అలా ఉండాలి. అప్పుడే యాప్ సరిగ్గా స్కాన్ చేసి వివరాలను తెలియజేస్తుంది.
Smart Tools
ఆండ్రాయిడ్
కలెక్షన్ ఆఫ్ హ్యాండీ టూల్స్
ఈ అప్లికేషన్ ప్యాకేజీ రూపంలో లభిస్తోంది. ఇందులో ఐదు యాప్స్ లభిస్తాయి. స్మార్ట్ రూలర్ సహాయంతో మొబైల్ స్క్రీన్‌పైనే వస్తువుల పొడవు తెలుసుకోవచ్చు. ట్రయాంగులేషన్ సహాయంతో ఎత్తును కొలవడానికి మరో టూల్ ఉపయోగపడుతుంది. వీటితో పాటు సౌండ్ లెవెల్ మీటర్, కంపాస్, ప్రొట్రాక్టర్, ఫ్లాష్‌లైట్ వంటి టూల్స్ లభిస్తాయి. అంతేకాకుండా మెటల్ డిటెక్టర్, స్కేల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే నెక్సస్4లో ఈ ఫీచర్లు పనిచేయడంలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యాప్ డిజిటల్ టూల్‌కిట్‌గా ఉపయోగపడుతుంది.

iNaturalist
ఆండ్రాయిడ్, ఐఓఎస్
నేచర్ లవర్స్ సోషల్ నెట్‌వర్క్
ఈ అప్లికేషన్ ప్రకృతి ప్రేమికులకు అబ్జర్వేషన్ నోట్‌బుక్‌గానూ, సోషల్ నెట్‌వర్క్‌గానూ ఉపయోగపడుతుంది. మీరు బొటానికల్ టూర్స్‌కు వెళ్లినపుడు అక్కడ ఇష్టమైన చెట్టు లేదా జంతువును చూసినపుడు దానికి సంబంధించిన వివరాలను నోట్‌బుక్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. మీ అబ్జర్వేషన్‌ను షార్ట్‌నోట్‌గా ఫీడ్‌చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా గూగుల్ అకౌంట్‌తో సైనిన్ అయి ఐన్యాచురలిస్ట్ యూజర్స్‌ను ఫాలో కావచ్చు. మీ అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.

Loss of the night
ఆండ్రాయిడ్
సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్
లైట్ పొల్యూషన్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడే యాప్ ఇది. ఈ యాప్‌ను ఉపయోగించే సమయంలో ఆకాశంలో ఒక స్టార్‌ను మీకు డైరెక్ట్ చేస్తుంది. ఆ తరువాత రిజల్ట్స్‌ను డాటాబేస్‌లోకి అప్‌లోడ్ చేస్తుంది. ఆ డాటాను పరిశోధకులు క్రోడీకరించి లైట్‌పొల్యూషన్ ఎంత ఉంది. దాని ప్రభావం ఆరోగ్యంపై ఎంత పడుతోంది అనే విషయాలను తెలియజేస్తారు. ఈ యాప్‌ను జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సహాయం అందిస్తోంది.

WolframAlpha
ఆండ్రాయిడ్, ఐఓఎస్
రెఫరెన్స్ యాప్
మూలకాల గురించి సైన్స్ విద్యార్థులు నిత్యం తెలుసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి జింక్ గురించి తెలుసుకోవాలంటే జింక్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సమస్త సమాచారం వస్తుంది. సింబల్, అటామిక్ నంబర్, అటామిక్ వెయిట్, మెల్టింగ్ పాయింట్, డెన్సిటీ తదితర పూర్తి సమాచారం లభిస్తుంది. ఇమేజ్ కూడా చూడవచ్చు. ఆ మూలకం పీరియాడిక్ టేబుల్‌లో ఎక్కడ ఉంటుందో చూడవచ్చు. ఆకాశంలో స్వాతినక్షత్రం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ యాప్ సవివరంగా చూపిస్తుంది. ఒక నెంబర్‌ను టైప్ చేస్తే దాని యూనికోడ్‌ను, బైనరీ రూపాన్ని చూపిస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలకు రెఫరెన్స్‌గా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. సైన్ విద్యార్థులకు ఈ యాప్స్ ఎంతగానో ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు కదూ.
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment