మేము 1981లో 9.09 గుంటల భూమిని కొనుగోలు చేసి, రిజిస్టర్ చేయించుకున్నాం, తహసీల్‌దారు నుండి పాసుపుస్తకంతో పాటు టైటిల్ డీడ్ కూడా పొందాం. అంతకు ముందు అంటే, 1954-55లో ఈ 9. 09 గుంటల భూమి మహ్మద్ సర్వర్ అనే వ్యక్తి పేరు మీద ఖాస్రా పహాణీలో పట్టాదారుగా నమోదై ఉంది. అయితే, ఆ వ్యక్తి మరొకరికి అమ్మాడు. ఆ రెండవ వ్యక్తినుంచి మేము కొనుగోలు చేశాం. ఆ వెంటనే అంటే 1981లోనే రివెన్యూ రికార్డుల్లో మా పేరు నమోదు చేయించడంతో పాటు, కబ్జాలోనే ఉన్నాం. ఈ విషయమై ఏ ఫిర్యాదులు కూడా ఏమీ లేవు. అందుకే చదును చేసి, ప్లాట్లు చేశాం. భూమి విలువను అనుసరించి అంటే 10 శాతం డబ్బులు రివెన్యూ అధికారికి చెల్లించి, ల్యాండ్ కన్వర్షన్ ఉత్తర్వులు కూడా పొందాం. ఆ తరువాత కొందరు, ఈ భూమి, రికార్డుల్లో చరాయిగా ఉందని, కొన్న వారు బాగా ధనవంతులని, కలెక్టర్ గారికి ఒక ఆకాశరామన్న ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ ఉత్తరానికి స్పందించిన కలెక్టర్ ఈ భూమి విషయమై ఒక నివేదిక కోరారు. తహసీల్దారు గారు మేము కొనుగోలు చేసిన 9.09 గుంటల్లో 5 ఎకరాల చరాయి భూమి ఉందని నివేదిక పంపారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చు భూమి 5 ఎకరాల ఖుష్కి, లేదా 2.20 ఎకరాల తరిని ఇవ్వడానికి ఆదేశాలు ఉన్నాయి.ఆ మేరకు అంతకు మించి ఇవ్వడానికి వీలులేదు. ఈ విషయాల ఆధారంగా, 1954 కాస్రాపహాణీలో 9.09 గుంటల భూమి ఉన్నందున, అది లావోణీ పట్టా కాదని, నిర్ధారించారు. ఎవరో వాస్తవాలు తెలియని వారు ఏవో ఆరోపణలు చేశారని, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకుని, పాసు పుస్తకం, టైటిల్ డీడ్ కూడా పొందిన మా భూమి పై ఈ రకమైన చర్యలు చేపట్టడం న్యాయసమ్మతమేనా? ఈ విషయమై మాకు తగిన సలహా ఇవ్వండి.
- ఎన్ . వెంకటేశ్, రామన్నపేట
మీకు 9.09 గుంటల భూమిని అమ్మిన మహ్మద్ సర్వర్‌కు మాత్రమే ఆ భూమిపై సంపూర్ణమైన యాజమాన్యపు హక్కులు ఉంటాయి. ఖాస్రా పహాణీ , భూమి హక్కులకు సంబంధించిన ఒక మౌలికమైన రికార్డు. ఖాస్రా పహాణీలో నమోదయిన భూ స్వాధీన విధానాన్ని, ఎవరూ మార్పిడి చేసేందుకు వీలు లేదు. పైగా ఎవరో రాసిన ఆకాశ రామన్న ఉత్తరం ఆధారంగా, ఆ సర్వే నంబర్‌లోని 9,09 ఎకరాల భూమి పట్టాగా, మిగతా 5 ఎకరాల భూమి చరాయిగా నమోదయినట్లుగా తహసీల్‌దారు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, విచారణ జరిపి, ఒక రిపోర్టు పంపించినట్లుగా తెలియచేశారు. ఒకవేళ 5 ఎకరాల భూమి, చరాయిగా నమోదయినా, మీరు 9. 09 గుంటలు మాత్రమే, దాని పట్టాదారు నుంచి కొనుగోలు చేసినందున, ఆ భూమిపై మీ హక్కులకు ఏ విధమైన భంగమూ వాటిల్లదు.
అంతే కాకుండా 1981లో రిజిస్టర్ దస్తావేజు ద్వారా కొని, ఆ భూమిని గత 30 ఏళ్లుగా మీ స్వాధీనంలో ఉంచుకుని దాన్ని అనుభవిస్తున్నందు వల్ల, ఆ భూమిపై మీకు సంపూర్ణమైన యాజమాన్యపు హక్కులు సంక్రమిస్తాయి. మీరు కొన్న భూమి, ఖాస్రా పహాణీలో పట్టాభూమిగా నమోదు అయినందువల్ల, ఆ పట్టాదారుడు రిజిస్టర్ దస్తావేజు ద్వారా మీకు దఖలు చేసిన భూమికి ఇతరులు ఏవిధమైన ఫిర్యాదులు చేసినా, కలెక్టర్ గానీ, రివెన్యూ అధికారులు గానీ, ఎవరి ప్రలోభాలకో లోనై, మీకు విరుద్ధంగా ఏదైనా ఆర్డర్ పాస్ చేసినా, ఆ ఆర్డర్‌ను మీరు సంబంధిత సివిల్ కోర్టులోకానీ, హైరోర్టులో గానీ సవాలు చేసే అధికారం మీకు ఉంది. మీరు తెలిపిన వివరాల ప్రకారం, మీరు ఆ భూమిని కొనుగోలు చేసిన వెనువెంటనే, రిజిస్టర్ దస్తావేజు ఆధారంగా, రివెన్యూ రికార్డుల్లో కూడా మీ పేరును నమోదు చేసుకుని, పట్టేదారు పాసుపుస్తకాలు కూడా పొంది, అలా సంపూర్ణ యాజమాన్యపు హక్కులతో 30 ఏళ్లకు పైగా ఆ భూమిని మీరు అనుభవిస్తు న్నందు వల్ల, మీ యాజమాన్యపు హక్కులకు ఏవిధమైన భంగమూ ఏర్పడదు.
మీరు మీ భూమిని వ్యవసాయేతర ఏర్పాట్లకు వినియోగించడానికై, ల్యాండ్ కన్వర్షన్‌కు ఆర్‌డిఓను సంప్రదించి, నిబంధనలను అనుసరించి, రుసుము చెల్లించి, భూమిని చదును పరిచి, ప్లాట్స్ చేసి అమ్ముకోవడానికి, ఏ విదమైన అభ్యంతరమూ ఉండదు. ఆర్ డిఓ గారు మీ పట్టాభూమిగానే గుర్తిస్తూ, ఆ భూమిని మీకు వ్యవసాయేతర లక్ష్యాలకు ఉపయోగించుకోవడానికి, అనుమతి లభించినందువల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎవరో రాసిన ఆకాశ రామన్న ఉత్తరం ఆధారంగా, ఆ విషయమై పూర్వాపరాలేవీ పరిశీలించకుండా, ఒకవేళ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ద్వారా మీకు అన్యాయం చేసినట్లయితే, ఆ ఆర్డర్‌ను సవాలు చేసే అధికారం మీకు ఎలాగూ ఉంటుంది. ఏమైనా మీరు కొన్నది పట్టా భూమే కాబట్టి, మీ భూమిపై మీకున్న యాజమాన్యపు హక్కులకు ఏ విధమైన భంగమూ కలగదు.
వొడ్నాల శ్రీహరి
న్యాయవాది, హైదరాబాద్
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment