Wednesday, 6 November 2013

లెర్నింగ్ మేడ్ ఈజీ

లెక్చరర్ చెబుతుంటే నోట్స్ రాసుకోవడం పాత పద్ధతి. నోట్స్ రికార్డింగ్ చేసుకోవడం, ఆర్టికల్స్‌ను వెబ్‌లో సెర్చ్ చేయడం, టాబ్లెట్‌లో ప్రెజెంటేషన్ ఇవ్వడం న్యూట్రెండ్. ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఇదే ఫాలో అవుతున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని సాఫ్ట్‌వేర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ చదువుతున్నా, గ్రాడ్యుయేషన్‌లో ఉన్నా ప్రతి విద్యార్థీ వాటిని టాబ్లెట్‌లో, పీసీలో ఉంచుకుంటే లెర్నింగ్ మరింత ఈజీ అవుతుంది. అవేంటో తెలుసుకుందాం.

ఇప్పుడు ఎక్కువ పోటీ ఉంది ఎడ్యుకేషన్ రంగంలోనే అనడంలో సందేహం లేదు. ఈ పోటీ మూలంగా విద్యార్థులపై ఎక్కువ ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడిని అధిగమించాలంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందే. అందుకే విద్యార్థులు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ అంశాలపై అమితాసక్తిని కనబరుస్తున్నారు.

ప్రాక్టీస్ చకచకా
రాయడం, చదవడం, మా«థ్స్ ప్రాక్టీస్ చేయడం, ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయడం వంటి పనులు ప్రతి విద్యార్థీ చేయాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తి చేయాలంటే బోలెడు సమయం కేటాయించాలి. కూర్చుని శ్రద్ధగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ దగ్గర ఔజీఛట్ఛౌజజజీఛ్ఛి ఉంటే ఆ పనులన్నీ చకచకా పూర్తియిపోతాయి. మీరు ఏం చదివినా, ఎక్కడికి వెళ్లినా సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఉండే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ట్రాక్ చేంజెస్, ఫార్మాంటింగ్ బ్రష్ వంటి ఫీచర్లు అదనం. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న పవర్‌ఫుల్ రైటర్, కాలిక్యులేటర్, ఇతర ప్రొగ్రామ్స్ విద్యార్థులకు చక్కగా ఉపయోగపడతాయి. దీన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు.

ఈజీ సెర్చ్
ఆర్టికల్స్ సేకరించడం, లైబ్రరీ నిర్వహణ, అనులేఖనం వంటి పనులు ప్రతి విద్యార్థిని ఇబ్బంది పెడతాయి. అయితే ోౌ్ట్ఛటౌ టూల్ ఆ ఇబ్బందులన్నింటినీ దూరం చేసింది. వెబ్‌లో రీసెర్చ్ పేపర్స్‌ను కలెక్ట్ చేయడాన్ని ఈ టూల్ మరింత సులభతరం చేస్తుంది. పీడీఎఫ్‌లను అటాచ్ చేయడం, లైబ్రరీ రిలవెంట్ ఆర్టికల్స్‌ను వెతకడం వంటి పనులన్నింటికి ఇది ఉపయోగపడుతుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తికావడానికి ోౌ్ట్ఛటౌ బాగా సహాయపడుతుంది.

గుర్తించడం సులభం
డజన్ల కొద్దీ ఆర్టికల్స్‌ను వెతకడం, ఇమేజెస్ ఎగ్జామిన్ చేయడం, ముఖ్యమైన అంశాలను హైలెట్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం.... ఇవన్నీ రోజూ చేయాల్సి వస్తూనే ఉంటాయి. ఈ పనులు చేయడం కాదు. అవసరమైనపుడు త్వరగా రెఫర్ చేసుకునేలా ఉండాలి. ఇందుకోసం ఖ్ఛ్చఛీఛిఠఛ్ఛ ఉపయోగపడుతుంది. ఇది ఒక పీడీఎఫ్ మేనేజర్. ఇందులో బిల్టిన్‌గా పీడీఎఫ్ రీడర్ ఉంటుంది. ఆర్టికల్స్ వెతకడం, చదవడం వంటి పనులను ఇది సులభతరం చేస్తుంది. ఇది మీ డాటాబేస్‌లో ఉన్న ఆర్టికల్స్‌ను ఐడెంటిఫై చేస్తుంది. చదివిన ప్రతి ఆర్టికల్ క్విక్‌లిస్ట్‌లో చేరుతుంది. ఇది ప్రతి విద్యార్థీ ఎంపిక చేసుకోదగిన టూల్ అనడంలో అతిశయోక్తి లేదు.

ఆర్టికల్ ఏదైనా...
పబ్లిషర్ దగ్గర నుంచి ఆర్టికల్స్‌ను రెంట్ తీసుకోవడం బాగానే ఉంటుంది. కానీ అది సరిపోదు. ఒకవేళ మీరు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాకపోతే ఫుల్ టెక్ట్స్ వెర్షన్‌లు ఉన్న ఆర్టికల్స్ పొందలేరు. ఒకవేళ పొందినా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ్ఛ్ఛఞఈడఠ్ఛి ని ఎంచుకుంటే ఆ ఇబ్బందులన్నీ దూరమయిపోతాయి. ఇందులో వేల జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజూ ఉచితంగా ఐదు నిమిషాల పాటు ఏదైనా ఆర్టికల్‌ను చదువుకోవచ్చు. ఒకవేళ మీకు ఆర్టికల్ ఆసక్తి అనిపిస్తే డబ్బులు చెల్లించి పూర్తి ఆర్టికల్ చదువుకోవచ్చు. ఈ టూల్‌ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు.

నోట్స్ రాసే పనిలేదు
ప్రతి రోజు విద్యార్థులకు ఉండే పని పాఠాలు వినడం, నోట్స్ రాసుకోవడం. అయితే చాలా మంది విద్యార్థులు ఒక డైలమా ఉంటుంది. పాఠం వినడమా? లేక నోట్స్ రాసుకోవడమా? పాఠం వింటూ నోట్స్ రాసుకోవడం కష్టం. రెండింటిలో ఏది చేయాలో అర్థం కానీ డైలమా ఉంటుంది. అటువంటి వారికి అఠఛీజీౌ ూౌ్ట్ఛ్ట్చజ్ఛుట బాగా ఉపయోగపడుతుంది. ఇది విద్యార్థుల చెంత ఉంటే నోట్స్ రాసే పని ఉండదు. శ్రద్ధగా పాఠాలు వినవచ్చు. పాఠం మొత్తం రికార్డు అవుతుంటుంది. లైవ్ లెక్చర్స్, ఇంటర్వ్యూస్, స్కైపి కాల్స్, ఆన్‌లైన్ టాక్స్...ఇలా అన్నింటిని రికార్డు చేసుకోవచ్చు. ఆ తరువాత సమయం దొరికినపుడు ఆ పాఠాన్ని మళ్లీ వినవచ్చు.

కళ్లకు కట్టే శరీర నిర్మాణం
సైన్స్ విద్యార్థులు మానవ శరీరం గురించి ప్రత్యేకంగా అభ్యసించాల్సి వస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కండరాలు, మెదడులో ఉండే భాగాలు, గుండె, ఇతర అంతర్గత అవయవాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి లెక్చరర్ చెప్పినవి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు.
అలాంటప్పుడు ోడజ్ట్ఛౌ ఆౌఛీడని ఎంచుకుంటే హ్యూమన్ అనాటమీ మొత్తం కళ్లకు కట్టినట్లుగా తెలిసిపోతుంది. ఇందులో మానవ శరీరం ప్రతి లేయర్‌తో సహా కనిపిస్తుంది. అవయవాలు, రక్తనాళాలు క్లియర్‌గా కనిపిస్తాయి. కీబోర్డ్ లేక మౌజ్ సహాయంతో ఒక్కొక్క అవయవాన్ని పక్కకు జరిపి చూడవచ్చు. ఆసక్తిగా అనిపించిన అవయవంపై క్లిక్ చేస్తే దాని గురించిన సమాచారం లభిస్తుంది. ఒకవేళ మీరు సైన్స్ చదవకపోయినా ోడజ్ట్ఛౌ ఆౌఛీడ సహాయంతో మానవ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవచ్చు. సైన్స్ విద్యార్థులే కాకుండా అందరూ ఎంపిక చేసుకోదగిన సాఫ్ట్‌వేర్ ఇది.

గ్రంథ సూచిక
పుస్తకం మొత్తం చదవడం మాట పక్కన పెడితే, మనకు కావలసిన సమాచారం ఏ పేజీలో ఉందో తెలుసుకోవడానికే కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది. సూచిక మొత్తం ఆసాంతం చూడాల్సి వస్తుంది. అయితే ఖ్ఛీజూజూజీఛిౌ ప్రొగ్రామ్‌ను ఎంచుకుంటే సూచిక మాదిరిగా ఉపయోగపడుతుంది. మీ పుస్తకాల్లో ఉన్న గ్రంథసూచికల సమాచారం మొత్తం ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కావలసినప్పుడు సెకన్లలో తిరిగి పొందవచ్చు. కొన్నిసార్లు మనకు అవసరమైన సమాచారం ఏ పేజీలో ఉందో తెలుసుకోవడానికే సమయమంతా పోతుంది. అలాకాకుండా ఈ టూల్‌ను ఎంచుకుంటే సూచికల వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. అగ్రస్థానంలో నిలవాలనే విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు కదూ.
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment