Wednesday, 6 November 2013

చేతి రాతతో ఈమెయిల్- టెక్ బిట్స్

స్మార్ట్‌ఫోన్‌ల పట్ల మహిళల మొగ్గు

పురుషుల కంటే మహిళలే స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంపై మొగ్గు చూపుతున్నారని ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. మొబైల్ డివైజ్‌పై 60 శాతం మంది ఆసక్తి చూపిస్తుండగా, స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడుతున్న పురుషుల సంఖ్య కేవలం 43 శాతం మాత్రమే ఉన్నారు. 1200 మంది మహిళల అభిప్రాయాలు సేకరించగా వీరిలో 87 శాతం మంది హ్యాండ్ సెట్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తేలింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో మేసేజింగ్ కోసం కూడా మహిళలు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వాడుతున్నారని అధ్యయనంలో తెలిసింది. ఫోటోలు, వీడియోలను తీయడం, వాటిని నిక్షిప్తం చేసుకోవటంలోనూ మహిళలే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడుతున్నారని సర్వేలోని సారాంశం.

చేతి రాతతో ఈమెయిల్

గూగుల్ డాక్స్, కొత్త హ్యాండ్‌రైటింగ్ ఇన్‌పుట్ టూల్ సాయంతో మీ చేతి రాతతోనే మీరు ఈమెయిల్ పంపించవచ్చని గూగుల్ ఇటీవల ప్రకటించింది. మౌస్‌ప్యాడ్ లేదా కర్సర్ యూజర్స్ వర్డ్స్‌ను ఎంపిక చేసుకొని మెయిల్స్ పంపించవచ్చు. 50 భాషల్లో సొంత దస్తూరితో ఈమెయిల్స్ పంపించేందుకు వీలవుతుందని గూగుల్ పేర్కొంది. యూజర్‌లు జీమెయిల్ లేదా డాక్స్ సెట్టింగ్స్‌లోకెళ్లి భాషను జనరల్ ట్యాబ్ ద్వారా ఎంపిక చేసుకొని ఇన్‌పుట్ టూల్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. పెన్సిల్ ఐకాన్ సాయంతో మీరు ఈమెయిల్ రాసి పంపించవచ్చు.

గూగుల్ నెక్సస్ 5 స్మార్ట్‌ఫోన్

గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన లేటెస్ట్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ నెక్సస్ 5 పేరిట కొత్తగా విడుదల చేసింది. కొత్త కిట్‌క్యాట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు ఇంటర్‌నెట్ టైటన్స్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఈ మొబైల్ ఫోన్‌లో ఉన్నాయి. 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్క్రీన్, టాప్ఆఫ్ ది లైన్ 2.3జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 800 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 లేదా 32 జీబీల ఇన్‌బిల్ట్ స్టోరేజీ సౌకర్యం, 8 ఎంపీ న్యూలెన్స్ కెమేరా, వైర్‌లెస్ ఛార్జింగ్, బ్లూటూత్ సౌకర్యాలు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌తో ఉన్న గూగుల్ ఫోన్ తెలుపు, నలుపు రంగుల్లో లభ్యమవుతుంది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ ప్లే ఇండియా వెబ్‌సైట్ ద్వారా త్వరలో ఆన్‌లైన్‌లోనూ కొనవచ్చు.
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment