Sunday, 10 November 2013

రిజిస్టర్ కాని వీలునామాకు విలువే లేదా?

నేను 1977లో హైదరాబాద్‌లోని కాప్రా ఏరియాలో 200 గజాల స్థలాన్ని నా భార్య పేరున కొన్నాను. రిజిస్టర్డ్ సేల్ డీ డ్ నా పేరు మీదే ఉంది. అయితే 2002లో నా భార్య తన తదనంతరం ఆ స్థలం మా చిన్న కుమారుడికి మాత్రమే చెందాలని వీలునామా రాసింది. కానీ రిజిస్టర్ చేయించలేదు. సాక్షి సంతకాలు, నేను, నా మిత్రుడూ చేశాం. నా భార్య 2005లో చనిపోయింది. ఆ వీలునామా చట్టపరంగా సక్రమంగానే ఉందని లాయర్లు చెప్పారు. కాకపోతే అది రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ఆ స్థలాన్ని మా చిన్న కుమారుడి పేరున మున్సిపల్ రికార్డ్సుల్లో, రిజిస్ట్రార్ ఆఫీసులో మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే, రిజిస్టర్ కాని వీలునామాకు విలువ లేదని, ఈ రెండు ఆఫీసుల్లోనూ చెబుతున్నారు. మా మిగతా ముగ్గురు కుమారులకు ఈ విషయంలో అభ్యంతరం లేదని కోర్టు నుండి అఫిడవిట్ తెమ్మంటున్నారు. వాస్తవంగా, నాకు గానీ, నా మిగతా ముగ్గురు కుమారులకు గానీ, చిన్న కుమారుని పేరున మార్చడానికి ఎంత మాత్రం అభ్యంతరం లేదు. మా కుంటుబంలో ఏ తగాదాలూ లేవు. అయినా ఈ అధికారుల అభ్యంతరం ఏమిటి?నిజంగా రిజిస్టర్ కాని వీలునామాకు విలువ లేదా? ఆ స్థలాన్ని మా చిన్న కుమారుని పేరిట మార్చే సులువైన మార్గం ఏదైనా ఉంటే తెలియచేయండి.

-ఆర్ ప్రకాశ్, మెడ్చల్

వాస్తవానికి, వీలునామాను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలనే చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. వీలునామా రిజిస్టర్ కానంత మాత్రాన మీ చిన్న కొడుక్కు కలిగే నష్టం ఏదీ లేదు. మీ భార్య రాసిన వీలునామా రాసిన మేరకే తనకు సంబంధించిన స్థిరచరాస్తులు, ఆమె యిష్టాయిష్టాల మేరకే సంక్రమిస్తాయి. మీ భార్య తన పేరున గల 200 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన వీలునామా రాస్తూ, తన తదనంతరం, ఆ స్థలం తన చిన్న కుమారుడికి చెందాలని రాసి, దానిపై ఇద్దరు సాక్ష్యుల సంతకాలు చేయించినందువల్ల చట్టపరంగా ఆ వీలునామా చెల్లుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కలసి వీలునామా ప్రతిని జతపరిచి డిస్క్లేమర్ అఫిడవిట్ గానీ, లేదా ఏదైనా డిక్లరేషన్ గానీ ఇచ్చి, మున్సిపల్ అధికార్లను కోరండి. వారు తప్పకుండా మారుస్తారు. మున్సిపాలిటీ ఆఫీసును సంప్రదించి, అట్టి భూమిని మీ అబ్బాయిపై మ్యూటేషన్ చేయమని, సంబంధిత పత్రాలతో దర ఖాస్తు చేసుకోండి. ఏ రకంగా చూసినా, వీలునామా రాసినందువల్ల మీ భార్య ఆస్తి, మీ చిన్న కుమారునికి మాత్రమే చెందుతుంది.

సాక్ష్యుల్లో ఒకరు మీరే అయినా, ఆ వీలునామా మీద ఇద్దరు సాక్ష్యులు సంతకాలు చేసినందున ఆ ఇద్దరూ ఇంకా బతికే ఉన్నందున మీకు ఏ సమస్యా లేదు. మీ భార్య ఆ వీలునామా మీ ముందే రాసినట్లుగా, దాని మీద ఒక సాక్షిగా మీరు సంతకం చేసినట్లుగా పేర్కొంటూ, ఆ రెండవ సాక్షిగా ఉన్న మీ మిత్రుడి అఫిడవిట్ కూడా తీసుకుని, ఆ అఫిడవిట్‌ను కూడా జతచేసి, సంబంధిత కార్యాలయానికి మీరు దరఖాస్తు చేసుకుంటే, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఒకవేళ వారు ఏదో ఒక మిషతో మీ చిన్న కుమారుడిపై ఆస్తి మార్పిడి జరపనట్లయితే, ఆస్తి ఏ రెవెన్యూ మండలంలో ఉందో, దానికి సంబంధించిన విలువ ఆధారితంగా కోర్టును సంప్రదించి, వారిపై డెరెక్షన్ తీసుకుని, ఆ ఆస్తిని మీ చిన్న కుమారుడి పేరిట మార్పిడి చేసుకోవచ్చు అలా మీ చిన్న కుమారుడు ఆ భూమిపై సంపూర్ణ యాజమాన్యపు హక్కులు సొంతమవుతాయి. అందువల్ల ఈ విషయంలో ఎవరి అభ్యంతరాలూ చెల్లవనేది పూర్తి వాస్తవం.

వొడ్నాల శ్రీహరి
న్యాయవాది, హైదరాబాద్
Courtesy-Andhrajyothy

రిజిస్టర్ కాని వీలునామాకు విలువే లేదా?

Published at: 11-11-2013 06:40 AM

- See more at: http://www.andhrajyothy.com/node/26136#sthash.v1nzOXz9.dpuf

No comments:

Post a Comment