ఇప్పుడు సిటీల్లోనే కాదు. ఓ మోస్తరు పట్టణాల్లో కూడా అపార్ట్‌మెంట్లు వచ్చేస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఆరేడు రకాల ఆయుర్వేద లక్షణాలు కలిగిన మొక్కల్ని పెంచుకోవడం చాలా సులువు. చీటికీమాటికీ మార్కెట్‌కు పరిగెత్తే బదులు ఇంట్లోనే అవి లభిస్తే మంచిదే కదా. మొక్కల్ని పెంచేందుకు బయట రకరకాల ఆకారాల్లో మట్టి, ప్లాస్టిక్ తొట్టెలు దొరుకుతున్నాయి. బాల్కనీ లేదా గుమ్మానికి ఇరువైపులా అదీ కుదరకపోతే అపార్ట్‌మెంట్‌పైన.. కాస్త జాగాలోనే ఈ మొక్కల్ని సాగు చేయొచ్చు. ఆయుర్వేద మొక్కల్లో ముఖ్యమైనది లెమన్‌గ్రాస్. దీన్ని జ్యూస్‌లాగ చేసుకుని తాగుతారు. కొన్ని రకాలైన వంటల్లోనూ వేస్తారు. అందుకని లెమన్‌గ్రాస్‌ను ఒక చిన్న కుండీలో పెంచవచ్చు. రెండు మూడు అంగుళాల నీటితడితోనే ఈ గడ్డి పెరుగుతుంది. అవసరం వచ్చినప్పుడు వెంటనే వాడుకోవచ్చు. ఇక వంటగదిలో పుదీనా నిత్యావసర ఆకుకూర. పచ్చళ్లు, మసాలా కూరలు, చికెన్, మటన్‌లలోనూ దీని వాడకం ఎక్కువ. ఏ కూరలోకైనా పనికొస్తుంది. కాబట్టి పుదీనాను మరో కుండీలో పెంచండి. కూరల్ని పోపు పెట్టాలంటే కరివేపాకు అవసరం అవుతుంది. దీన్నీ మరో కుండీలో వేస్తే బెటర్. ఏ కూర చేయాలో దిక్కుతోచనప్పుడు నాలుగు రెమ్మల కరివేపాకు పీక్కుని పచ్చడి చేసుకోవచ్చు. కొత్తిమీర, రోజ్‌మేరీ, పార్‌స్లీ వంటి మొక్కల్ని నాటుకోండి. వీటితోపాటు తులసినీ పెంచడం మరిచిపోవద్దు.
Courtesy-Andhrajyothy
- See more at: http://www.andhrajyothy.com/node/26155#sthash.yUstkqML.dpuf
Courtesy-Andhrajyothy
ఫ్లాట్‌లో ఆయుర్వేద మొక్కలు
ఇప్పుడు
సిటీల్లోనే కాదు. ఓ మోస్తరు పట్టణాల్లో కూడా అపార్ట్‌మెంట్లు
వచ్చేస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ఆరేడు రకాల ఆయుర్వేద లక్షణాలు
కలిగిన మొక్కల్ని పెంచుకోవడం చాలా సులువు. చీటికీమాటికీ మార్కెట్‌కు
పరిగెత్తే బదులు ఇంట్లోనే అవి లభిస్తే మంచిదే కదా. మొక్కల్ని పెంచేందుకు
బయట రకరకాల ఆకారాల్లో మట్టి, ప్లాస్టిక్ తొట్టెలు దొరుకుతున్నాయి. బాల్కనీ
లేదా గుమ్మానికి ఇరువైపులా అదీ కుదరకపోతే అపార్ట్‌మెంట్‌పైన.. కాస్త
జాగాలోనే ఈ మొక్కల్ని సాగు చేయొచ్చు. ఆయుర్వేద మొక్కల్లో ముఖ్యమైనది
లెమన్‌గ్రాస్. దీన్ని జ్యూస్‌లాగ చేసుకుని తాగుతారు. కొన్ని రకాలైన
వంటల్లోనూ వేస్తారు. అందుకని లెమన్‌గ్రాస్‌ను ఒక చిన్న కుండీలో పెంచవచ్చు.
రెండు మూడు అంగుళాల నీటితడితోనే ఈ గడ్డి పెరుగుతుంది. అవసరం వచ్చినప్పుడు
వెంటనే వాడుకోవచ్చు. ఇక వంటగదిలో పుదీనా నిత్యావసర ఆకుకూర. పచ్చళ్లు, మసాలా
కూరలు, చికెన్, మటన్‌లలోనూ దీని వాడకం ఎక్కువ. ఏ కూరలోకైనా పనికొస్తుంది.
కాబట్టి పుదీనాను మరో కుండీలో పెంచండి. కూరల్ని పోపు పెట్టాలంటే కరివేపాకు
అవసరం అవుతుంది. దీన్నీ మరో కుండీలో వేస్తే బెటర్. ఏ కూర చేయాలో
దిక్కుతోచనప్పుడు నాలుగు రెమ్మల కరివేపాకు పీక్కుని పచ్చడి చేసుకోవచ్చు.
కొత్తిమీర, రోజ్‌మేరీ, పార్‌స్లీ వంటి మొక్కల్ని నాటుకోండి. వీటితోపాటు
తులసినీ పెంచడం మరిచిపోవద్దు.
No comments:
Post a Comment