మానవత్వం పరిమళించే మంచి మనిషి ... ఈ దేశం లో పేదల బతుకులు మార్చ దానికి సర్కారు ఎన్నో పథ కాలు,వాటి అమలుకు వందల కోట్ల రూపాయలు కేటాఇంచచడం అందరికి తెలిసిందే ... అయి తే అవన్నీ ప్రజలకు అందితే మన సమాజం ఎప్పుడో మారి పోయేది . పథ కాలు అమలు చేయాల్సిన ఆధికారుల నిర్లక్ష్యం వల్ల పేదోడు మరింత దరిద్రుడు గా మారు తున్నాడు. ... కాని ఈ చీకటిని చీల్చిన కాంతి కిరణం గురించి మీకు చెపుతున్నాను...మన రాష్ట్రం లో 50 వేల ఆదివాసి కుటుంబాల బతుకుల్లో కొత్త చిగుర్లు చిగు రించిన దృశ్యాని మీ ముందుంచుతున్నా.... కొండ కోనల్లొ ని ఆది వాసులకు సుస్థిర జీవనోపాదులు కల్పించదానికి ఒక్కో కుటుంబానికి ఎకరా భూమిలో పండ్ల తోటలు పెంచు కోవడానికి ఆర్ధిక సాయం తో పాటు తోటల నిర్వహణలో శిక్షణ ఇచ్చారు. దీనిని 'మా తోట ' అంటారు. ఇది 2006లొ శ్రీకాకుళం లో తొలి చిగురు తొడిగింది . అడవుల్లో కట్టెలు ఏరుకొని బతికిన పేదలు నేడు మామిడి తోటలకు యజమానులయ్యారు . అంతర పంటలుగా కూరగాయలు పండిస్తూ ఆనందం గా ఉన్నారు. ఈ వెలుగుల వెనుక .... మోహనయ్య ఉన్నారు. పాడి ,పంటలను,భూమి ని నమ్ముకొని బతుకు తున్న వారి అభివృద్ది కోసం ఏర్పడిన నాబార్డ్ కి గతం లో పి.మోహనయ్య cgm గా పని చేసి నప్పుడు జరిగిన అద్భుతం ఇది. మా తోట ' లు ఎలా పెరుగుతున్నాయో చూడ దానికి తరచూ ఫీల్డ్ visit చేసే వారు . ఒక సారి ఆయనతో ఖమ్మం జిల్లా వెళ్ళాను . మోహనయ్య గారు అక్కడి పేదలతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకొని వారు పెట్టిన కలో,గంజో తాగుతూ ...పండ్ల తోటల పెంపకం లో వారికి సూచన లిస్తూ గడిపిన సందర్భం నన్ను కదిలించింది. గిరిజన పల్లెలకు కొత్త శోభను తే వాలను కున్న ఆయన కల నేర వేరింది. ప్రస్తుతం ఆయన ముంబై లో ఉన్నారు. కుటుంభ సభ్యులను చూడడానికి అపుడపుడు hyd వస్తుంటారు. కొసమెరుపు ............... వేలాది పేదలకు మామిడి తోటలు ఇచ్చిన మోహనయ్య గారికి ఒక్క మామిడి మొక్క కూడా లేదు. మొన్న పండగ పూట మామిడి తోరణాల కోసం హైదరాబాద్ నగర శివారు లో మామిడాకులు కోస్తూ ....ఇలా నవ్వుతూ కనిపించారు. ఆత్మీయంగా కరచాలనం చేసారు. ఇలాంటి ఆధి కారులుంటే సమాజం మారదా ..
No comments:
Post a Comment