కట్ యవర్ కాల్స్
మీ
సెల్‌ఫోన్‌లో పొద్దున నుంచి సాయంత్రం వరకు వచ్చిన కాల్స్‌ను ఒకసారి సరి
చూసుకోండి. కాల్‌హిస్టరీలో మిస్‌డ్ కాల్స్, డయల్‌కాల్స్, రిసీవ్డ్‌కాల్స్
లెక్కపెట్టండి. అందులో అవసరమైనవి ఎన్ని? అనవసరమైనవి ఎన్ని? తేల్చండి.
రోజుకు ఎన్నేసి వృథా కాల్స్ మీ ఫోన్‌కు వస్తున్నాయో అర్థమవుతుంది. ఆ లెక్కన
వారం, మాసం వరకు లెక్కపెడితే పనికిరానివి కనీసం యాభై నుంచి వంద
ఫోన్‌కాల్స్ ఉంటాయి. మార్కెటింగ్ కాల్స్, ఉబుసుపోక కబర్లు చెప్పుకునే
కాల్స్, క్యాజువల్ కాల్స్ ఇవన్నీ ఫిల్టర్ చేస్తే.. అందులో మీకు పనికొచ్చేవి
కొన్నే! అనవసర ఫోన్‌కాల్స్‌ను కట్ చేసేందుకు ఒక పద్ధతిని పాటించండి.
షాపింగ్‌లకు వెళ్లినప్పుడు, ఎగ్జిబిషన్లను సందర్శించినప్పుడు, కొత్త వాహనాల
కొనుగోళ్లకు వెళ్లినప్పుడు, బహుమతులు ఇస్తామంటూ ఊరించే పోటీలకు మీ ఫోన్
నెంబర్‌ను ఇవ్వకపోవడం ఉత్తమం. బీమాపాలసీల కొనుగోళ్లు, వ్యక్తిగత,
వాహనరుణాలు, కొనుగోళ్లకు సంబంధించి వివరాలు కనుక్కునేముందు అవసరమైతే తప్ప
ఫోన్ నెంబర్లను ఇవ్వకూడదు. ఇంటర్‌నెట్‌లో కూడా వీలైనంత వరకు ఫోన్
నెంబర్లను నమోదు చేయకండి.
రెగ్యులర్‌గా సంభాషించే మిత్రులకు మీ సమయపాలనను తెలియజేస్తే మంచిది. మొహమాటానికి పోకుండా మీ ఆఫీసు పనివేళలు, రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయాన్ని చెబితే.. అవతలివాళ్లు అర్థం చేసుకుంటారు. ఫోన్లను చేయడం తగ్గిస్తారు. ఒక్కోసారి మొబైల్ ఆపరేటర్స్ నుంచి వచ్చే వాణిజ్యప్రకటనల కాల్స్ విసుగు తెప్పిస్తుంటాయి. వీటిని పూర్తిగా వదిలించుకునేందుకు సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఇక, మీ ఫోన్‌లో నమోదుకాని కొత్త నెంబర్లను లిఫ్ట్ చేయడం తగ్గించండి. అది అర్జెంటు కాల్ అయితేనో అని అనుకుంటే.. అదే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేసి.. అవతలివ్యక్తి గురించి కనుక్కోండి. ప్రతి చిన్న విషయానికీ చేతిలో ఫోన్ ఉందికదాని కాల్ చేయడం మానండి. చిన్న చిన్న విషయాలకు మెసేజ్‌లు ఇవ్వడమే సుఖం. తరచూ నెట్‌వాడే అలవాటుంటే మెయిల్స్ పంపుకోవచ్చు.

Courtesy-Andhrajyothi
No comments:
Post a Comment