స్థలం : విశాఖపట్నం శివార్లలోని ఆరిలోవలో అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్.
ఏం జరిగింది : అక్కడున్న అనాథ బాలల సంఖ్య 16 నుంచి 100కు పెరిగింది.
ఎప్పుడు : గడచిన ఆరు నెలల్లో
ఏమిటి విశేషం : రాష్ట్రంలో 27చోట్ల ప్రభుత్వం అలాంటి హాస్టళ్లను ప్రారంభించింది. కాని ఇక్కడొక్కచోటే అది విజయవంతంగా నడుస్తోంది.
ఎవరు కారణం : గూడూరు సీతామహాలక్ష్మి అనే ఉపాధ్యాయిని కృషి.
ఇంత క్లుప్తంగా చదివితే ఏం అర్థమవుతుంది? ఆమె ఎలా చేసిందో ఏమేం చేసిందో తెలుసుకోవాలి కదా మనం. దాని గురించే ఈ కథనం..
ఒకచోట మట్టి ట్రాక్టరు తిరగబడింది. కూలికెళుతున్న భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. వాళ్ల ఇద్దరు పిల్లలు అనాథలయిపోయారు. మరోచోట మద్యానికి బానిసైన భర్త క్షణికావేశంలో భార్యను తెగనరికాడు. ఆమె చనిపోయింది, అతను జైలుపాలయ్యాడు. పిల్లలు నిరాశ్రయులయ్యారు. ఇంకోచోట దంపతులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విడిపోయి ఎవరి మానాన వారు దూరప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిపోయారు. బిడ్డలు వీధులపాలయ్యారు.
ఇలాంటి ఉదంతాలన్నిటిలోనూ బలైపోయేది బాలల భవిష్యత్తే. పట్టించుకునేవారు లేక, పాలనాపోషణా లేక వాళ్లు నిరాశ్రయులైపోతుంటారు. ఈ పిల్లలే నగరాలకు చేరి రోడ్ల పక్కన అడుక్కునేవారిగా, చిన్నచిన్న దుకాణాల్లో టీ కప్పులు టిఫిన్ ప్లేట్లు కడిగేవాళ్లుగా, రైల్వే ప్లాట్‌ఫాముల మీదా వీధుల్లోనూ చెత్త ఏరుకునేవారిగా మారిపోతారు. అలా కాకుండా ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 'పసిపిల్లలు పనుల్లో కాదు - పాఠశాలల్లో ఉండాలి' అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంలోని 'రాజీవ్ విద్యామిషన్'తో కలిసి ప్రతి జిల్లా కేంద్రంలోనూ అనాథ పిల్లలను చేరదీసి వసతి కల్పించి విద్య నేర్పించడానికి వీలుగా హాస్టళ్లను పెట్టింది.
పందులైనా ఉండవక్కడ...
విశాఖపట్నం శివారు ప్రదేశమైన ఆరిలోవలోని హాస్టల్ ఆ క్రమంలో ఏర్పడిందే. ముందు పదహారు మంది పిల్లలు ఉండేవారు. అప్పుడు గాంధీనగర్ కమ్యూనిటీ హాలును హాస్టల్‌గా వాడుకోమంది ప్రభుత్వం. సాధారణంగా బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లంటే లోకల్ కుర్రకారు కబుర్లు చెప్పుకునే ప్రదేశం. పేకాట మొద లు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలకూ నిలయాలవి. అలాంటి చోట అనాథ పిల్లల హాస్టలంటే అసౌకర్యాల మురికి కూపంలోకి వారిని తోసినట్టే. అందుకే మొదట్లో పిల్లలు అక్కణ్నుంచి తరచూ పారిపోతూ ఉండేవారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న గూడూరు సీతామహాలక్ష్మిని అప్పటి కలెక్టర్ వి.శేషాద్రి ఈ హాస్టల్ బాధ్యతను స్వీకరించమని ఆదేశించారు. "గడిచిన ఫిబ్రవరి ఒకటిన నేను వచ్చేసరికి లెక్కకు పదహారుమంది పిల్లలున్నారు. పందికొక్కులు తవ్వేసిన నేల, ఎలుకలు తిరుగుతున్న కన్నాలు నిండి పెచ్చులూడుతున్న గోడలు, చెమ్మ పట్టి కారుతున్న శ్లాబు, పనిచెయ్యని బోరింగ్ పంపు, అపరిశుభ్రంగా ఉన్న ఒకేఒక్క మరుగుదొడ్డి - ఇదీ దృశ్యం. అలాంటిచోట పిల్లలు కాదుకదా, పందులు కూడా ఉండవు. అందుకే వాళ్లు తరచూ పారిపోయి రోడ్ల మీద అడుక్కుని తినేవారు. కొంతమంది సింహాచలం దేవస్థానం ధర్మసత్రంలో పెట్టే ఉచిత భోజనం తిని తిరిగేవారు. తినడానికి తిండే దొరకని పిల్లలతో చదువుసంధ్యల గురించి ఏం మాట్లాడతాం?'' అన్నారు సీతామహాలక్ష్మి.
అందరూ కలిసి ముందడుగేసి
ఈ అవగాహన ఆమెకు రాగానే తానేం చెయ్యాలో తెలిసిపోయింది ఆమెకు. కలెక్టరును కలిసి కమ్యూనిటీహాలును వీలైనంత బాగుచేయించి సున్నాలేయించారు. విద్యుత్ సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, నీటి మోటారు, కొళాయిలు ఏర్పడ్డాయి. గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చి వంటగది కట్టించి ప్రతిరోజూ వేళకింత ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. తర్వాత పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి బోధించారు. సామాజిక స్పృహ ఉన్న స్థానికులు కొందరిని కూడగట్టారు. అప్పటికే అక్షరాస్యత, అవయవదానం, శరీరదానం వంటి అంశాలను ప్రచారం చేస్తున్న మహిళగా సీతామహాలక్ష్మి విశాఖలో ఎక్కువమందికి పరిచయమున్నవారే. ఆమె సేవాభావం, పట్టుదల తెలిసిన స్నేహితులు, పరిచయస్తులు ఈ హాస్టల్‌ను మెరుగుపరచడానికి ముందుకొచ్చారు. సీఎమ్ఆర్ వస్త్రదుకాణంవారు పిల్లలందరికీ ట్రంకుపెట్టెలు, తాళాలు, రాత్రి వేసుకునే దుస్తులు అందజేశారు.
మరొకరు ప్రతి గదిలోనూ ఫ్యాన్లు అమర్చారు. ఒకరు పుస్తకాల బ్యాగులిస్తే ఇంకొకరు అందరికీ చెప్పులిచ్చారు. పరిశుభ్రమైన నీరందే ఏర్పాటు ఒకరు చేస్తే, పుస్తకాలు, పెన్సిల్‌బాక్సులు, పెన్నులు ఇచ్చారు మరికొందరు. కప్పుకునే దుప్పట్లు, సబ్బులు వంటివి కూడా దాతలిచ్చినవే. ఒకసారి పిల్లలందరినీ సమావేశపరిచి వాళ్లకేం కావాలో రాయమన్నారు సీతామహాలక్ష్మి. "వాళ్లేం రాశారో చూస్తే నా కడుపు తరుక్కుపోయింది. కడుపు నిండా తినేంత పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి కావాలని రాశారు ఎక్కువమంది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్లు గుడి ప్రాంగణంలో తిరిగేవారు, అక్కడ ప్రసాదంగా పెట్టే ఆ పదార్థాల రుచి వాళ్లకు కాస్తకాస్త తెలుసు. కాని ప్రసాదమంటే కొద్దికొద్దిగానే పెడతారు కదా, మళ్లీ వెళితే పెట్టరు. అందుకే వాటిని కడుపు నిండా తృప్తిగా తినాలని కోరుకున్నారు మా పిల్లలు'' అంటూ కళ్లనీళ్లతో చెప్పారామె. వెంటనే అలాంటివి వండించి పెట్టారు హాస్టల్లో. నెమ్మదిగా వారి సంఖ్య వందకు పెరిగింది. సంఖ్యతోపాటు ఆమె బాధ్యతా పెరిగింది.
వాళ్ల ఇల్లే అనుకుంటారు
వందమంది ఉన్నప్పటికీ ఈ హాస్టలు ఇప్పుడు ఒక పద్ధతిలో నడుస్తోంది. రోజూ ఉదయాన్నే లేచి చదువుకోవడం, పాఠశాలకు తయారవడం, సాయంత్రం వచ్చాక కొద్దిసేపు ఆటలు, వ్యాయామం, మళ్లీ చ దువుకోవడం - ఇలా సాగుతుంది పిల్లల దినచర్య. వాళ్లంతా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే పిల్లలు. పక్కనున్న ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి చదువుకుంటారు. ఉదయం, సాయంత్రం ట్యూషన్లు చెప్పే ఐదుగురు టీచర్లు, మరో ఏడుగురు నాన్‌టీచింగ్ స్టాఫ్ అనుక్షణమూ వారిని కనిపెట్టుకుని ఉంటారు. వాళ్ల సహకారంతో పిల్లలు ఫినాయిల్, రూమ్ ఫ్రెష్‌నర్‌లు తయారుచెయ్యడం వంటి పనులు నేర్చుకున్నారు. పద్యాలు, డ్యాన్సులు, కోలాటాలు నేర్చుకున్నారు. చిన్నవయసులోనే అనాథలయిపోయిన పిల్లలను కుదురుగా ఒకచోట ఉంచడం, క్రమశిక్షణలో పెట్టి చదివించడమంటే మాటలు కాదు.
దాన్ని సాధ్యం చేసి చూపించారు సీతామహాలక్ష్మి. "ఇది మా ఇల్లు, ఈమె మా అమ్మ. వీళ్లంతా మావాళ్లు, ఇక్కడ మేం భద్రంగా ఉన్నామన్న భావం పిల్లల్లో కలిగితే వాళ్లెక్కడికీ వెళ్లరు. వాళ్లకా భావన కలిగించడంలో మా బృందమంతా సఫలీకృతులయ్యాం. ఇప్పుడెవరైనా బాగా అల్లరి చేస్తున్నా, బాగా చదవడం లేదన్నా ఇక్కణ్నుంచి పంపేస్తామన్న ఒక్క మాట అంటే చాలు. వాళ్లు కళ్లనీళ్లు పెట్టుకుని దారికొచ్చేస్తారు'' అని చెప్పారామె. "ఈ హాస్టల్‌కు ప్రభుత్వం విధించిన సామర్థ్యం 100 మందే. కాని ఒక్క విశాఖపట్నంలోనే ఇంకా 298 మంది వీధిబాలలున్నారని ప్రభుత్వ సర్వేలు తెలియజేస్తున్నాయి. మాకు వాళ్లందరినీ కూడా తీసుకొచ్చి బాగుచెయ్యాలనే ఉంటుందిగాని మా పరిధిలో అది సాధ్యమయ్యే విషయం కాదు'' అంటున్నారు ఈ హాస్టల్ ఉద్యోగులు.
బిల్లులు రాక ఇబ్బంది
అన్నీ చక్కబడ్డాయి కాబట్టి ఇప్పుడంతా బ్రహ్మాండంగా ఉందనుకుంటే పొరపాటే. ప్రభుత్వం మొదలెట్టిన హాస్టలే అయినా, వివిధ శాఖల మధ్య సరైన సమన్వయం లేక బిల్లులు సకాలంలో అంద క ఇబ్బంది పడుతున్నారు హాస్టళ్ల ఉద్యోగులు. బియ్యంతో సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొండెక్కి కూర్చున్న ఈ కాలంలో వంద మంది చిన్నారుల కడుపు నింపడమంటే మాటలు కాదు. "ఇంతచేశాక ఈ పిల్లలను వదిలి వెళ్లిపోలేను, అలాగని సకాలంలో నిధులు రాలేదని పిల్లలను పస్తులుంచలేను. మూడునాలుగు నెలలుగా బిల్లులు రాకపోతే నేను దాచుకున్న సొమ్ము, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు డ్రా చేసి ఆ డబ్బుతో బండి నెట్టుకొస్తున్నా. నా కొడుకు ఉద్యోగస్తువడంతో ఆదుకుంటున్నాడు. స్నేహితులు సాయం చేస్తారుగాని, ఎన్నిసార్లని వాళ్లను అడగ్గలను?'' అని తన నిస్సహాయతను వ్యక్తం చేశారామె. ఆమె చెప్పడం లేదుగాని, బిల్లులు మంజూరు చెయ్యడానికి లంచం అనే భూతం కూడా అడ్డుపడుతోందనిపిస్తుంది హాస్టల్ ఫైళ్లు చూస్తే. ప్రభుత్వ శాఖలు సహకరించకపోవడం వల్లనే మిగిలిన జిల్లాల్లోని హాస్టళ్లు మూతపడ్డాయని కూడా అనిపిస్తుంది. "ఆనకట్టలు, విద్యుత్కేంద్రాల్లాగా పిల్లలు కూడా మన దేశానికి ఆస్తే. శారీరకంగా, మానసికంగా వాళ్లు బలంగా ఎదిగినప్పుడే జాతికి బలం'' అంటున్నారు సీతామహాలక్ష్మి. ఆ భావన అందరికీ ఉన్నప్పుడే కదా ఇలాంటి సంక్షేమ పథకాలు సార్థకమయ్యేది! అనా«థలకు ప్రభుత్వమే అమ్మానాన్న. ఆ అమ్మానాన్నే పట్టించుకోకపోతే వాళ్లేమైపోవాలి?
అరుణ పప్పు
ఫోటోలు: వై.రామకృష్ణ, విశాఖపట్నం
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment