కోల్‌కతాలోని తాతయ్య ఇంట్లో ఉండేవాడు విక్కీరాయ్. ఆ ఇంట్లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి. ఇంట్లో హింసను తట్టుకోలేక 11 యేళ్ల వయసులో మామయ్య జేబులోని డబ్బును కాజేసి ఢిల్లీ రెలైక్కేశాడు. అక్కడ నుంచి విక్కీ జీవితం కొత్త మలుపు తీసుకొంది. ఢిల్లీలో ఇతడిని రోడ్ల మీద చూసి ఎవరో ‘సలాం బాలక్ ట్రస్ట్’లో చేర్చారు. అయితే అక్కడ పరిస్థితులు ఏ మాత్రం నచ్చలేదు విక్కీకి. అక్కడ నుంచి పారిపోయి మళ్లీ రోడ్ల మీదికి వచ్చిపడ్డాడు. పనిదొరికితే పనిచేయడం... లేకపోతే చెత్త ఏరి నాలుగైదు రూపాయలు సంపాదించుకోవడం.
అప్పటికి అదే జీవితం అనుకొన్నాడు. అయితే క్రమంగా తనలో ఒక ఆత్మవిమర్శ. జీవితం ఎటుపోతోందో అర్థం కావడం లేదనే భావన. ఆ భావన నుంచి కొన్ని పగటి కలలు, ఆశలు పుట్టుకొచ్చాయి.
ఉన్నట్టుండి తన స్థితిగతులను ఎవరైనా మార్చేస్తే బావుండననే ఆశ కలిగింది. అయితే అది సాధ్యం కాదని చాలా త్వరగా అర్థం చేసుకొన్న విక్కీ తిరిగి ‘బాలక్ ట్రస్’్టలో చేరిపోయాడు. ఈసారి అక్కడ పరిస్థితులు చాలా కొత్తగా కనిపించాయి. ఇష్టంగా మారాయి. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలనే తపన మొదలైందప్పటికే. ఆ బాలక్‌ట్రస్ట్‌కు అనేక మంది వ్యక్తులు వచ్చేవారు. అక్కడి పిల్లలకు వివిధ విషయాల గురించి చెప్పేవారు. అలా ఒక విదేశీ ఫొటోగ్రాఫర్ బాలక్ ట్రస్ట్‌కు వచ్చాడు. అతడి చేతిలోని కెమెరాను చూడగానే విక్కీ కళ్లు మెరిశాయి. ఫొటోగ్రఫీ మీద ఆసక్తి పెంచుకొన్నాడు. దాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ‘బాలక్ ట్రస్ట్’లో ఉండగానే ఆ ఇంగ్లిష్ ఫొటోగ్రాఫర్‌కు సహాయకుడిగా మారాడు. భాషతో ఎంతో ఇబ్బంది వచ్చింది. అతడు చెప్పే మాటలేవీ విక్కీకి అర్థం అయ్యేవి కాదు. అయితే ఇంగ్లిష్ రాకపోయినా ఫొటోగ్రఫీలో రాణించవచ్చనే విషయాన్ని అర్థం చేసుకొన్నాడు. మెలకువలు నేర్చుకొని బాలక్‌ట్రస్ట్‌లోనే లోన్ తీసుకొని సొంతంగా కెమెరాను కొనుగోలు చేశాడు. ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే
ఆ కెమెరాతో విక్కీ చేసిన తొలి ప్రయత్నమే ‘స్ట్రీట్ డ్రీమ్స్’ ప్రాజెక్ట్. అనాథాశ్రమంలో ఉండే యువకుల జీవితాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టాడు విక్కీ. అతడి ఫొటోల్లోని ఫీల్, టైమింగ్ అందరినీ ఆకట్టుకొన్నాయి. తాను అనుభవించిన స్ట్రీట్ చిల్డ్రన్ జీవితాన్ని ఫొటోల రూపంలో చూపాడు విక్కీ. ఆ ప్రాజెక్ట్‌కు చాలా మంచి పేరొచ్చింది.
Courtesy-Sakshi
No comments:
Post a Comment