* సివిఎల్ఎన్ ప్రసాద్
సహారా ఎడారిలో జీవించే చిన్న సంచార సమూహానికి చెందిన చిత్రాల దగ్గర నుంచి.. అంతరిక్షంలోని అంతర్జాతీయ కేంద్రం తాజా కక్ష్య దాకా సకల సమాచారం గూగుల్‌లో దొరుకుతుందని కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు.. జీమెయిల్, గూగుల్ సెర్చ్, క్రోమ్ బ్రౌజర్- ఈ మూడిటితోనే ఆ కంపెనీ ఆగిపోయిందా? ప్రతి రోజు ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపించే ఈ కంపెనీ ఇంకా ఏం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి తలెత్తుతూ ఉంటాయి. 'ఇంతింతై వటుడింతై..' అన్నట్లు మన కళ్ల ముందే అంచలంచెలుగా ఎదిగిన ఈ కంపెనీ అసలు కథేమిటి అని తరచి చూస్తే అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్‌లు, మానవ చోదకరహిత కార్లు, కళ్లజోళ్లలోనే ఇంటర్నెట్‌ను అందించే సదుపాయం, భూమికి 20 మైళ్ల ఎత్తులో టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే బెలూన్లు, ప్రపంచంలోని అణువణువును అనుసంధానం చేసే సామర్థ్యమున్న బెలూర్లు- ఇలా ఒకటేమిటి- మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే పరిశోధనలు అనేకం బయట పడతాయి. తాజాగా క్యాన్సర్‌పై పరిశోధనలు చేయటానికి, వృద్ధాప్య సమస్యలను అడ్డుకోవటానికి కేలికో అనే కొత్త కంపెనీని కూడా గూగుల్ మొదలుపెట్టింది..
గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ను చూస్తే ఐటీ కంపెనీలలో కనిపించే సాధరణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లా ఉంటాడు. కానీ అతని ఆలోచనలన్నీ అసాధారణంగా ఉంటాయి. అత్యంత క్లిష్టమైన సమస్యలకు కూడా అతి సులువైన పరిష్కారాలుంటాయనేది అతని సిద్ధాంతం. 26 ఏళ్ల వయస్సులో అతని గొంతు నరాలకు పక్షవాతం రావడంతో అతను ఎక్కువగా మాట్లాడలేడు. కానీ ఈ వైకల్యం అతని ఆలోచనలకు ఏ మాత్రం అడ్డుకాదనే విషయం అతని వ్యూహాలను చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఒక తాజా వ్యూహమే ' కేలికో'. క్యాన్సర్ పరిశోధనలపైనా, వృద్ధాప్యం రాకుండా చూడటానికి అవసరమైన మందులను అభివృద్ధి చేయటంపైనా పనిచేస్తుందిది. 'కేలికో'ను ప్రారంభిస్తున్నట్లు పేజ్ ప్రకటించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం చెలరేగింది. టెక్నాలజీ రంగంలో రారాజుగా వెలుగుతున్న గూగుల్- ఆరోగ్య రంగంలోకి ఎందుకు అడుగుపెట్టిందనే విషయంపై అనేక విశ్లేషణలు వెలువడ్డాయి.
క్యాన్సర్, వృద్ధాప్యం వంటి పరిష్కారం లేని సమస్యలపై పనిచేయడం మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందని కొందరు నిపుణులు హెచ్చరించారు కూడా. కానీ పదేళ్ల క్రితం పేజ్- గూగుల్ మెయిల్‌ను ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలే వెలువడ్డాయి. కొందరైతే గూగుల్ ప్రారంభించే కంపెనీలన్నింటికీ 'మూన్‌షాట్'లనే ముద్దుపేరు కూడా పెట్టారు. 'ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాం.. ఈ కంపెనీ కూడా బుడగలా పేలిపోతుంది' అని విమర్శకులు విశ్లేషణలు చేశారు. కానీ అవన్నీ తప్పని తేలాయి. నెమ్మదిగా పేజ్ ఆధ్వర్యంలో గూగుల్ మిగిలిన రంగాల్లోకి కూడా ప్రవేశించటం మొదలుపెట్టింది. "గూగుల్ సామర్థ్యమంతా సెర్చ్ బిజినెస్‌లో ఉంది. దానిని చెడగొట్టుకోకుండా- మిగిలిన రంగాలపై దృష్టి సారించాలనేది నా ఉద్దేశం. మిగిలిన కంపెనీల కన్నా ఒక్క అడుగైనా ముందుకు వేసి ఆలోచించకపోతే వెనకబడిపోతాం..'' అంటాడు పేజ్.
ఆలోచన వచ్చిందిలా...
అసలు గూగుల్ స్థాపనే చాలా చిత్రంగా జరిగింది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా పేజ్ కొన్ని పాఠ్యాంశాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో వెతకటం మొదలుపెట్టాడు. అవసరమైన వాటి కన్నా అనవసరమైనవి ఎక్కువ దొరికాయట ఆయనకు. దాంతో సెర్చ్ కొట్టిన వెంటనే వెబ్ పేజీలు అందించే సామర్థ్యం ఉన్న సెర్చ్ ఇంజన్ తయారుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. పేజ్‌కు సెర్గి బిన్ అనే స్నేహితుడు ఉండేవాడు. వీరిద్దరూ కలిసి సెర్చ్ ఇంజన్ తయారుచేశారు. మైక్రోసాఫ్ట్, యాహూ వంటి కంపెనీలు అప్పటికే టెక్నాలజీ రంగంలో ఉన్నా- అవి ఎప్పుడూ ఈ వైపు ఆలోచించలేదు. పేజ్ ఆలోచన క్లిక్ అయింది. 1998లో గూగుల్ ఒక కంపెనీగా అవతరించింది.
మొదట సెర్చ్ రంగంలోకి, ఆ తర్వాత ఈమెయిల్ రంగంలోకి ప్రవేశించింది. అప్పటికే మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్, ఏఓఎల్ వంటి కంపెనీలు ఉచిత ఈమెయిల్ సర్వీసును అందిస్తున్నాయి. అయినా గూగుల్ వీటన్నింటినీ అధిగమించగలిగింది. దీనికి కారణం అత్యంత క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలను కనిపెట్టడం, అందుబాటులో ఉన్న టెక్నాలజీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, అవసరమైనప్పుడు కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయటం అనే త్రిసూత్రాల ఆధారంగా అది ముందుకెళ్ళడమే. 1998లో గూగుల్ ఒక కంపెనీగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ కంపెనీ వద్ద 5400 కోట్ల డాలర్ల (32,000 కోట్ల రూపాయలు) నిల్వ లు ఉన్నాయి. ప్రతి ఏడాది గూగుల్‌కు 5000 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుంది. దీనిలో 400 కోట్ల డాలర్లు యూట్యూబ్ నుంచి, 680 కోట్ల డాలర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి, మిగిలిన సొమ్ము గూగుల్ సెర్చ్, మెయిల్‌లలో వచ్చే ప్రకటనల ద్వారా లభిస్తుంది.
చిత్రాతిచిత్రమైన ప్రాజెక్టులు
"ఒక సమస్యను పరిష్కరించాలంటే- మానవ వనరులు, ఆర్థిక వనరులు ఉంటే చాలనే అభిప్రాయం చాలా కంపెనీలలో ఉంది. ఇదే నిజమైతే ఈ పాటికి ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయిపోవాలి. అలా జరగటం లేదంటే కారణం వేరే ఉండి ఉండాలి. దానిని మనం అన్వేషించి పట్టుకోగలిగినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి'' అనేది పేజ్ సిద్ధాంతం. దీని కోసం పేజ్ గూగుల్‌లో 'ఎక్స్' అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది గూగుల్ ప్రధానకార్యాలయంలోనే ఉన్నా- దీనిలో జరిగే పరిశోధనల గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.
'ఎక్స్'కు అధినేత సెర్గిబిన్. ఇప్పటి దాకా గూగుల్ ఎక్స్ చేస్తున్న పనులలో నాలుగు ప్రాజెక్టుల గురించే బయటకు తెలుసు. వీటిలో మొదటిది గూగుల్ గ్లాస్. ఇది బయటకు సాధారణమైన కళ్లజోడు మాదిరిగానే ఉంటుంది. కాని దీనికి వెబ్ అనుసంధానమై ఉంటుంది. ఒక ల్యాప్‌టాప్‌లో చేసే పనులన్నీ దీనిలో కూడా చేయవచ్చు. కంటి సంజ్ఞల ద్వారా, గొంతు ద్వారా నియంత్రించే సౌలభ్యం కూడా దీనిలో ఉంటుంది. ఇది ఇప్పటికే యూ రప్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 1500 డాలర్ల (రూ.90 వేలు)కు దొరికే ఈ కళ్లజోడు వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే విమర్శలు వెలువడటంతో- ఇంకా పూర్తి స్థాయిలో అన్ని మార్కెట్లలోను దీనిని ప్రవేశపెట్టలేదు.
ఇలాంటి మరొక చిత్రమైన ప్రాజెక్టే 'లూన్'. బెలూన్ల ద్వారా ప్రపంచంలోని అన్ని మూలలకు నెట్‌ను అందించటానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా ఇప్పటికే విజయవంతమయింది. ఇది కార్యరూపం దాలిస్తే- భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో- 12 మీటర్లు ఎత్తు ఉండే బెలూన్లు ఎగురుతూ- నెట్ సౌకర్యాన్ని అందరికీ అందిస్తాయి. అంతేకాదు. బెలూన్లపై ఉండే టర్బయిన్ల ద్వారా పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి దానిని భూమిపైకి ప్రసారం చేసే ప్రాజెక్టు కూడా 'ఎక్స్' పరిశోధనల్లో రూపుదిద్దుకుంటోంది. ఇంతకు ముందు ఈ తరహాలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన- మకానీ పవర్ అనే కంపెనీని గూగుల్ గత ఏడాది కొనుగోలు చేసింది. 'ఎక్స్' పరిశోధనాశాలల్లోకి ఈవిధంగా వచ్చి చేరిన మరో ఆలోచన- మానవ చోదక రహిత కారు.
కాలిఫోర్నియాలో ఒక రోజు కారులో ప్రయాణిస్తున్న సమయంలో- అసలు డ్రైవర్ లేకుండా, మ్యాప్‌లు, జీపీఎస్, లేజర్ల ద్వారా కార్లను ఎందుకు నడపలేమనే ఆలోచన వచ్చిందట. దానికి రూపమే డ్రైవరు రహిత కారు. 'రోబో కార్స్' అని పిలిచే ఈ వాహనాలు, జీపీఎస్, గూగుల్ మ్యాప్స్, లేజర్ టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. వీటిని కాలిఫోర్నియా, నవాడా, ఫ్లోరిడాలలో ఇప్పటికే ఐదు లక్షల మైళ్లు నడిపి చూశారు. మరో ఐదేళ్లలో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కేలికో మరో ఎత్తని చెప్పాలి. దీనిని ఒక ప్రత్యేక కంపెనీగా ఏర్పాటుచేస్తున్నామని పేజ్ ప్రకటించినా- దీనికి అవసరమైన నిధులన్నీ గూగుల్ నుంచే వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. విమర్శకులందరూ ఈ కొత్త కంపెనీపై దృష్టి సారించటానికి మరొక కారణం కూడా ఉంది.
వ్యాధుల కట్టడికి...
వృద్ధాప్యం లేకుండా నిరంతర యవ్వనంతో ఉండాలనేది మానవుడి చిరకాల ఆశ. దీనిపై ఎప్పటినుంచో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. 1992లో అమెరికాలో కొందరు శాస్త్రవేత్తలు కలిసి- 'అకాడమీ ఆఫ్ యాంటీ ఏజింగ్ మెడిసిన్' అనే సంస్థను స్థాపించారు. అయితే ఈ సంస్థ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దాదాపు పదేళ్ల క్రితం సిట్రిస్ ఫార్మాసుటికల్స్ కంపెనీ- 'ఎస్ఆర్‌టీ501' అనే మందును తయారుచేసింది. వైన్‌లో దొరికే రిజర్వాట్రాల్ అనే పదార్థం ఆధారంగా దీనిని తయారుచేశారు. ఇది మన శరీరంలో రక్తకణాలు ఎక్కువ కాలం బతికేలా చేస్తుంది. ఈ మందు ప్రయోగాత్మక దశలో ఉండగానే- 2008లో గ్లాస్కోస్మిత్‌లైన్ అనే సుప్రసిద్ధ ఫార్మాసుటికల్ కంపెనీ - సిట్రస్‌ను 7.2 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 450 కోట్లు) కొనుగోలు చేసింది.
ఈ మందు విజయవంతమయితే తాము పెట్టిన పెట్టుబడికి వెయ్యి రెట్లు వస్తుందని గ్లాస్కోస్మిత్‌లైన్ భావించింది. అయితే ఈ మందు సమర్థవంతంగా పనిచేయటం లేదని తేలింది. దీనితో 2010లో కంపెనీని మూసేశారు. అలాంటి సమయంలో క్యాన్సర్, వృద్ధాప్యం వంటి సమస్యలపై గూగుల్ దృష్టి పెట్టడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది అత్యంత క్లిష్టమైన సమస్యలకు వెతికితే సులభమైన పరిష్కారాలు దొరుకుతాయనే పేజ్ సిద్ధాంతం. రెండోది ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ. ప్రతి సమస్యను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి.. అందుబాటులో ఉన్న టెక్నాలజీ ద్వారా ప్రయత్నిస్తే పరిష్కారం దొరుకుతుందనేది గూగుల్ మూలసూత్రం. గూగుల్ సెర్చ్ ఇంజన్ మొదలుకుని వారు తాజాగా విడుదల చేసిన నాలెడ్జ్‌గ్రాఫ్ దాకా అన్నింటిలోను అంతఃసూత్రమిదే.
మానవుడి ఆయుష్షు పెంచడానికి...
క్యాన్సర్, వృద్ధాప్యాలకు సంబంధించి- ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ సమాచారం అందుబాటులో ఉంది. వీటిని విశ్లేషించగలిగిన శక్తి ఉన్న సూపర్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రమపద్ధతిలో పెట్టి, దానిని విశ్లేషించి- ఆ విశ్లేషణను ముక్కముక్కలుగా విడగొడితే పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని గూగుల్ భావిస్తోంది. దీనికి తోడు గత ఏడాది గూగుల్ '23 అండ్ మీ' అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీ వివిధ వ్యాధులు రావటానికి జన్యుపరమైన కారణాలను కనుగొనే పరిశోధనలు చేస్తుంది. ఒక వైపు తమ వద్ద ఉన్న టెక్నాలజీని, మరో వైపు జన్యుశాస్త్రంలో వస్తున్న అభివృద్ధిని మేళవిస్తే- క్యాన్సర్, వృద్ధాప్యం వంటి చిక్కుముడులు వీడుతాయనేది పేజ్ వాదన. ఒకసారి వీటిని పరిష్కరించగలిగితే ఆ తర్వాత వాటికన్నా ప్రమాదకరమైన జబ్బులపై దృష్టి పెట్టవచ్చని- అప్పుడు మానవుడి ఆయుష్షు పెరుగుతుందని పేజ్ పేర్కొంటున్నాడు.
విమర్శలూ ఉన్నాయి
అందరి జీవితాలతోను ఏదో ఒక విధంగా పెనువేసుకుపోయిన గూగుల్ విధానాలపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. గూగుల్ సమాచారాన్ని తనకు నచ్చిన విధంగా నియంత్రించటానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా విమర్శకులు అంటున్నారు. తాజాగా గూగుల్ ప్రైవసీ విధానంలో చేసిన మార్పులపై ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విరుచుకుపడుతున్నారు. మారిన విధానం ప్రకారం- తన సేవలను ఉపయోగించుకొనేవారి పేర్లను, ఫోటోలను ఉపయోగించే హక్కు గూగుల్‌కు ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్ ఇంజన్లు కోట్ల మంది వినియోగదారులకు అనుక్షణం దాదాపు 20 లక్షల వెబ్‌సైట్లను వెతికి సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ సమాచారాన్ని అందించే సమయంలో గూగుల్ అనేక ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలను కూడా వినియోగదారులకు అందిస్తుంది.
ఈ ప్రకటనలలో తమ సేవలను ఉపయోగించుకొనే వినియోగదారుల ఫోటోలను వాడాలని గూగుల్ విధాన నిర్ణయం తీసుకుంది. అయితే ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కల్గించటమేనని ఇంటర్నెట్ హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. దీనిపై కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ (సీయూటీఎస్ ఇంటర్నేషనల్) అనే సంస్థ- కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు కూడా చేసింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఫిర్యాదుపై విచారణ కూడా ప్రారంభించింది. అయితే ఈ ఆరోపణలు కేవలం అపోహలేనని గూగిల్ వాదిస్తోంది. తాము వినియోగదారులకు ప్రైవసీ పాలసీ గురించి ముందే చెప్పామని.. తమ ఫోటోలు వెబ్‌లో ప్రచారం కావటం ఇష్టం లేని వారు.. పాలసీలో ఆ ఆప్షన్‌ను తొలగించుకోవచ్చని పేర్కొంటోంది. అంతే కాకుండా- ఈ ప్రకటనలు అందరికీ కనిపించవని, వినియోగదారుడి సోషల్ సర్కిల్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తాయని.. అందువల్ల అది వ్యక్తిగత స్వేచ్ఛకు ఏ విధంగా భంగం కాదని వాదిస్తోంది.
వైఫల్యాలూ ఉన్నాయ్...
గూగుల్ చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- గూగుల్ చేసిన అన్ని ప్రయోగాలూ విజయవంతం కాలేదు. కొన్ని విఫలం కూడా అయ్యాయి. గూగుల్ హెల్త్, బజ్ వంటివి ఆదరణ పొందలేదు. ఇలాంటి పరాజయాలెదురయినప్పుడు- ఈ సర్వీసులను గూగుల్ వెంటనే తొలగిస్తుంది. ప్రతిష్ఠ కోసం కొనసాగించదు. ముఖ్యంగా మూడు అపజయాలున్నాయి. గూగుల్ హెల్త్ - ప్రపంచంలో ఉన్న అందరి ఆరోగ్యరికార్డులు భద్రపరచాలనేది దీని ఉద్దేశం. 2008లో మొదలైన ఈ ప్రాజెక్టు పూర్తిగా విఫలమయింది. 2011లో దీనిని మూసేశారు. గూగుల్ వేవ్- ఈమెయిల్‌ను, మెసేజింగ్‌ను కలిపే ప్రయత్నం. 2009లో మొదలైన ఇది కూడా విఫలమయింది. గత ఏడాది మూసేశారు. గూగుల్ బజ్ - ట్విట్టర్ తరహా సేవ ఇది. ఇది జీమెయిల్ ద్వారా పనిచేస్తుంది. అయితే ఇది కూడా విఫలమయింది. 2010లో మొదలెట్టిన దీనిని 2011లో మూసేశారు.
ఈ తొలగించే పద్ధతినే పేజ్ ముద్దుగా 'స్ప్రింగ్ క్లీనింగ్' అని పిలుస్తాడు. ప్రతి రెండు, మూడేళ్లకు ఇలాంటి క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది. " నేను చాలా ఆశావాదిని. ప్రతి విషయం త్వరగా పూర్తవుతుందనే ఆశతోనే ఉంటా. కొన్ని సార్లు నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ పడుతుంది. ఉదాహరణకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేయటానికి ఏడాది చాలనుకున్నా. కానీ దానిని తయారుచేయటానికి ఐదేళ్లు పట్టింది. ప్రపంచంలో ఉన్నవారందరూ తమ హెల్త్ రికార్డులను గూగుల్‌లో దాచుకుంటారనుకున్నా. అది పూర్తిగా విఫలమయింది. అయినా పరాజయం ఎదురయినప్పుడల్లా- వందరెట్లు ఉత్సాహంతో ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తా'' అంటాడు పేజ్.
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment