మహబూబ్‌నగర్ జిల్లాలో దూరంగా విసిరేసినట్టుండే ఓ కుగ్రామం కుడికిళ్ల. నల్లమల సరిహద్దులలో ఉన్న ఈ గ్రామ ప్రజలు బస్సు ఎక్కాలంటే మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అలాంటి కుగ్రామం నుంచి ఒక కుర్రాడు హైదరాబాద్ వచ్చాడు. నగరాన్ని అర్థం చేసుకున్నాడు. క్రమక్రమంగా ఎదిగాడు. కాని తన మూలాలను మర్చిపోలేదు. గ్రామానికి అవసరమైనవన్నీ చేస్తూనే ఉన్నాడు. తొలిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కోఠిలో గుర్రపు బళ్లను చూసి ఎప్పటికైనా అలాంటి దాంట్లో ప్రయాణిస్తే బావుంటుందనుకున్న ఆ కుర్రాడే ఇప్పుడు 'మై హోం గ్రూపు'కు ఛైర్మన్ అయ్యాడు. ఆరువేల కోట్ల రూపాయల గ్రూపుకు అధిపతి అయినా- తన ఊరి మట్టి వాసన ఎప్పటికీ మర్చిపోను అంటున్న డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు జ్ఞాపకాలే ఈ వారం 'మా ఊరు'.
"మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని చిట్టచివర గ్రామం మాది. పేరు కుడికిళ్ల. మా గ్రామం దాటితే మూక్కుడుగుండ్ల అనే ఆవాసం ఉండేది. ఆ తర్వాతంతా నల్లమల అడవే. బహుశా అడవి పక్కనే ఉండటం వల్ల అనుకుంటా..మాకు వానలు బాగా పడేవి. మహబూబ్‌నగర్‌జిల్లాలో వానలు బాగా పడటం ఏమిటి? అది వర్షాభావం ఉన్న జిల్లా కదా అని మీలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. 1960లలో వాతావరణ పరిస్థితులు వేరేగా ఉండేవి. అందువల్ల ఇప్పుడున్నంత వర్షాభావం అప్పుడుండేది కాదు. ప్రతి సీజన్‌లోను రక రకాల పళ్లు దొరికేవి. వానాకాలం వచ్చి వెళ్లిన తర్వాత సీతాఫలాలు చిన్నసైజు కొబ్బరి బొండాల సైజులో వచ్చేవి.
వాటిని కాల్చుకుతినడం ఇంకా గుర్తే. మా ఊర్లో కులాలు, మతాలు పెద్దగా పట్టించుకొనేవారు కాదు. హిందూ పండగలను ముస్లింలు చేసుకొనేవారు. అలాగే పీర్ల పండగలో హిందువులూ పాల్గొనేవారు. ఊరంతా ఒక కట్టుబాటుతో ఉండేవారు. ఉదాహరణకు మా ఊర్లో కల్లు దుకాణం ఎక్కడో దూరంగా ఉండేది. తాగినవాళ్లు ఊళ్లోకి వచ్చి గొడవలు చేయడంలాంటివేమీ ఉండేవి కావు. వచ్చినా ఇంటికి వెళ్లి మౌనంగా పడుకొనేవారు. బహిరంగంగా తాగే అలవాటు ఉండేది కాదు. ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది. ఈ మధ్య ఊరు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే కొందరు మహిళలు తమకు చుక్కేసుకుందుకు డబ్బులు కావాలని అడిగారు. ఎంత మార్పు వచ్చిందా? అనిపించింది..
నాన్న- విమానం
మా నాన్న పేరు వెంకటయ్య. మాకు 30 ఎకరాల దాకా పొలం ఉండేది. నాకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. ఊర్లో వాళ్లందరూ నా మీద తండ్రి లేని పిల్లాడని సానుభూతి చూపిస్తూ ఉండేవారు. నాన్న చిన్నప్పుడే చనిపోయినా- రెండు సంఘటనలు మాత్రం నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన సంఘటనలవి. మా నాన్న చాలా నిజాయితీపరుడు. ఎవరికి అవసరం వచ్చినా ఆదుకొనేవాడు. అందువల్ల అందరూ ఆయనను చాలా గౌరవంగా చూసేవారు. ఆయనలో ఒక మంచి గుణమేమిటంటే- ఎంత కోపం వచ్చినా తమాయించుకొనేవాడు. ఎవరినీ పల్లెత్తు మాట అనేవాడు కాదు. సాయంత్రాలు మా ఇంట్లో ఉన్న జీతగాళ్లను కూర్చోబెట్టి కబుర్లు చెప్పటం నాకు ఇంకా గుర్తే. అప్పుడప్పుడు నేను కూడా మా నాన్న దగ్గర కూర్చునేవాడిని. కొన్ని సార్లు ఆకాశంలో విమానాలు కనిపిస్తూ ఉండేవి. మా నాన్నతో సహా ఎవరికీ ఆ విమానం దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందో తెలియదు.
కానీ జీతగాళ్లందరికీ- 'మావాడు పెద్దయితే అలాంటి విమానాల్లో తిరుగుతాడు..అప్పుడు మనం ఇక్కడి నుంచి చూడాలి' అని చెప్పేవాడు. ఆ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. ఏదో సాధించాలనే కోరికకు బీజం పడింది అప్పుడేనేమో! మరొక సంఘటన కూడా చెప్పాలి. ఒక రోజు మా నాన్న రూపాయి నోటును గూట్లో పెట్టి మర్చిపోయాడు. ఆ రోజుల్లో రూపాయికి చాలా విలువ ఉండేది. ఐదు పైసలు పెడితే జేబు నిండా పుట్నాల పప్పు వచ్చేది. పది పైసలికి చాక్లెట్లు వచ్చేవి. నా కన్ను మా నాన్న పెట్టిన రూపాయి మీద పడింది. వెంటనే దాన్ని తీసేస్తే నాన్నకు తెలుస్తుందని.. నాలుగైదు రోజులు ఆ రూపాయిని అటూ ఇటూ జరిపా. నాన్న ఆ నోటు గురించి మర్చిపోయాడనుకున్నాక ఒక రోజు ఆ నోటు తీసుకువెళ్లి ఖర్చు పెట్టేసా.
ఆ మర్నాడు మా నాన్నకు గుర్తొచ్చింది. ఎవరు తీసారని అడిగాడు. అమ్మ తీయలేదంది. నేను కూడా ఏ మాత్రం బెదరకుండా నేను తీయలేదని చెప్పా. అప్పటికి మా తమ్ముడు జగపతిరావుకు ఏడాదనుకుంటా. వాడు తీయలేడు కాబట్టి నేనే తీసి ఉంటానని నాన్నకు అర్థమై ఎందుకు దొంగతనం చేశావని కొట్టడం మొదలుపెట్టాడు. నేను వీధిలోకి పారిపోయా. నాన్న కోపం తట్టుకోలేక నా వెంట పడ్డాడు. మా ఇద్దరి గొడవను మొత్తం ఊరంతా విస్తుపోయి చూసింది. నాన్న నన్ను పట్టుకొని చాలా గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత కొట్టినందుకు చాలా బాధపడ్డాడనుకోండి. అయితే నన్ను ఎప్పుడూ ఎంతో ప్రేమతో చూసే నాన్నకు అంత కోపం ఎందుకు తెప్పించానా అనే ప్రశ్న నాలో తలెత్తింది. జీవితంలో క్రమశిక్షణకు, నిజాయితీకి ఉన్న విలువేమిటో అర్థమయింది.
కంఫర్ట్ జోన్
మా నాన్న చనిపోయేనాటికి మా అన్నయ్య బీఎస్సీ చదువుతున్నాడు. నాకు, ఆయనకు 12 ఏళ్ల తేడా. మా తమ్ముడు నాకన్నా ఐదేళ్లు చిన్న. దీంతో కుటుంబాన్ని నడపాల్సిన బాధ్యత మా అన్నయ్యపై పడింది. మా నాన్నకు జబ్బుగా ఉందని తెలిసి- మా అన్నయ్యకు త్వరగా పెళ్లి చేసేశారు. ఇంట్లో పనంతా అమ్మ, వదినా చూసుకొనేవారు. అన్నయ్య వ్యవసాయ పనులు చూసుకొనేవాడు. నేను ఇంటర్ పూర్తయిన వెంటనే బీఎస్సీలో చేరా. 'బీఎస్సీ చదివి బీఈడీ చేస్తే టీచరు ఉద్యోగం వస్తుంది, మా గ్రామంలో కాని సమీపంలో కాని టీచరు ఉద్యోగం చేసుకుంటూ వ్యవసాయం చూసుకుంటూ బతికేయొచ్చ'నేది, మా అన్నయ్యతో సహా మా ఊర్లో చాలామంది నా గురించి చేసిన ఆలోచన. నా గురించే కాదు, గ్రామంలో అందరు కుర్రాళ్ల గురించి వాళ్ల పెద్దవాళ్లు ఆ విధంగానే ఆలోచించేవారు.
ఊర్లోనే చదువు. చదువు అయిపోయిన వెంటనే అక్కడే ఉద్యోగం. చదువు రాకపోతే వ్యవసాయం. అంతకన్నా పెద్ద కోరికలు ఉండేవి కాదు. బహుశా వారికి ఇదొక కంఫర్ట్ జోన్ అనుకుంటా. దీని నుంచి బయటకు రావటానికి వారు ఇష్టపడరు. వారిని బయటకు తీసుకువచ్చేవారు కూడా ఎవరూ ఉండరు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో, దానిలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెప్పేవారు లేకపోవటం కూడా ఒకప్పటి గ్రామాల్లో ప్రధానమైన సమస్య. అయితే చాలామందిలా నేను ఊర్లోనే ఉండిపోవాలనుకోలేదు. బాగా చదువుకోవాలని, ఏదో చేయాలని ఉండేది. కానీ ఏం చేయాలో తెలియదు. బయటకు వెళ్లాలని.. ప్రపంచాన్ని చూడాలని.. అందరూ మనని గుర్తించేలా ఏదో సాధించాలని అనిపించేది. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. ఇలాంటి సందిగ్దావస్థలోనే మహబూబ్‌నగర్‌లో బీఎస్సీలో చేరా. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో హోమియో కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రకటన పడింది.
రింజిం రింజిం హైదరాబాద్..
బీఎస్సీ చదివితే టీచరు ఉద్యోగం వస్తుందనేది అన్నయ్య ఉద్దేశం. కానీ నాకు ఇష్టం లేదు. దాంతో ఎవరికీ చెప్పకుండా హోమియో కాలేజీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసా. సీటు వచ్చింది. ఇంట్లో చెబితే వద్దంటారని చెప్పకుండా ఫీజు కట్టేసా. ఆ తర్వాత ఇంటికి వచ్చి అమ్మకు, అన్నయ్యకు చెప్పా. ఆ సమయంలో హోమియోపతికి ఇప్పుడున్నంత ప్రచారం లేదు. అసలు హోమియోపతి అంటేనే చాలా మందికి తెలియదు. అలాంటి చదువు చదివి ఏం చేస్తావనేది అన్నయ్య ప్రశ్న. అనేక వాద ప్రతివాదాలయ్యాక అన్నయ్యను ఒప్పించగలిగా. కానీ నేను హైదరాబాద్‌కు వెళ్తానంటే అమ్మ చాలా భయపడింది. ఎందుకంటే అప్పటి దాకా మా ఊరినుంచి ఎవరూ హైదరాబాద్ వెళ్లి చదువుకోలేదు. చదువుకోవటం దాకా ఎందుకు.. అసలు హైదరాబాద్ వెళ్లినవాళ్లే తక్కువ. అలాంటి సాహసం నేను చేయటం అమ్మకు ఇష్టం లేదు. కానీ ఆమెను కూడా అతికష్టం మీద ఒప్పించా. అలా 1979లో హైదరాబాద్‌కు తొలిసారి వచ్చిన నాకు అదొక పూర్తి కొత్త ప్రపంచంలా కనిపించింది.
గౌలిగూడ బస్‌స్టాండ్‌లో దిగి స్నేహితుడి దగ్గరకు రిక్షాలో వెళ్తుంటే వింత ప్రపంచాన్ని చూస్తున్న భావన కలిగింది. దీంతో కాలేజీలో చేరిన వెంటనే సైకిల్‌ను అద్దెకు తీసుకుని మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతూ ఉండేవాడిని. డిగ్రీ మూడో ఏడాదిలో నేనే ఒక హెర్క్యులిస్ సైకిల్ కొనుక్కున్నా. ఆ సైకిల్‌ను చాలా భద్రంగా చూసుకొనేవాడిని. నా రూమ్ రెండో ఫ్లోర్‌లో ఉండేది. కిందపెడితే ఎవరైనా పట్టుకుపోతారని ప్రతి రోజు రాత్రి దాన్ని రెండు ఫోర్లు పైకి పట్టుకెళ్లేవాడిని. నడక మాత్రమే తెలిసినవాడికి ప్రపంచాన్ని వేగంగా చూడటం సైకిల్ నేర్పుతుంది. ఆ తర్వాత ఎన్ని కార్లు కొన్నా, విమానాలలో తిరిగినా- సైకిల్ మీద తిరిగిన అనుభూతి రాలేదు. ఇది కార్లలో పుట్టి పెరిగిన వాళ్లకు తెలియదు. నేను మా కాలేజీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉండేవాడిని.
ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా మమ్మల్ని చూడాలంటూ సమ్మె చేశాం. చాలాసార్లు మమ్మల్ని అరెస్టు చేశారు. పగలు కస్టడీలో ఉంచుకుని రాత్రి సనత్‌నగర్ దగ్గర వదిలేసేవారు. అప్పుడు హైదరాబాద్‌లో ఎక్కువ బస్సులు తిరిగేవి కావు. అక్కడి నుంచి మసాబ్‌ట్యాంక్ దాకా నడుచుకుంటూ వచ్చేవాళ్లం! ఆ సమయంలో హయగ్రీవాచారి వైద్యశాఖ మంత్రిగా ఉండేవారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. వీరిద్దరితోను పోరాడి మేం డిమాండ్‌లు సాధించుకోగలిగాం. కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడల్లా ఊరుకి వెళ్లిపోయేవాడిని. ఊర్లో వాళ్లకు వైద్యం చేసేవాడిని. మా గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళ్లి చదువుకుంటున్నది నేనొక్కడినే కాబట్టి ఊర్లో వాళ్లు నన్ను భలే గౌరవంగా చూసేవారు.
ఎదిగే సమయం..
1982లో దిల్‌షుక్‌నగర్‌లో హోమియోడాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించా. తమ్ముడు జగపతిరావు కూడా నాతో పాటు హైదరాబాద్ వచ్చేసాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. భూములు కొనేవాళ్లు ఎక్కువ మంది ఉండేవారు కాదు. ఏ విషయాన్నైనా కూలంకషంగా తెలుసుకోవటమనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నా దృష్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పడింది. కానీ వ్యాపారం చేయటానికి నా దగ్గర పెట్టుబడి లేదు. మా మామయ్యను 50 వేల రూపాయలు అప్పు అడిగా. ఆయన దగ్గర కూడా అంత సొమ్ము లేదు. అయినా మా అమ్మ వెళ్లి అడిగేసరికి ఆయన కాదనలేకపోయాడు. మొత్తం వాళ్లింట్లో ఉన్న బంగారమంతా ఇచ్చేసాడు. దాన్ని అమ్మి వ్యాపారం మొదలుపెట్టా. ఈ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లా ఆయనకు నేను ఎంత రుణపడి ఉన్నానా అనిపిస్తుంది.
ఆయనకే కాదు. మా అత్తయ్యకు కూడా. ఇంట్లో బంగారమంతా ఇచ్చేయటానికి ఏ ఇల్లాలు ఒప్పుకుంటుంది? మా అత్తయ్య మాత్రం ఏ మాత్రం వెనకాడకుండా ఇచ్చేసింది. ఒక వైపు ప్రాక్టీసు చేస్తూనే మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని. ఆ సమయంలో భూమి దగ్గరకు వెళ్లి ఎవరూ చూసేవారు కాదు. లేఅవుట్‌ను కాగితాల మీదే చూపించేవారు. రిజిస్ట్రేషన్లు అయిపోయేవి. అయితే కొందరు మోసం కూడా చేసేవారు. మా కస్టమర్లకు మాపై నమ్మకమే మాకు శ్రీరామరక్షగా మారింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌తో పాటు మా గ్రూపు కూడా ఎదిగింది. తమ్ముడు, సిబ్బంది కూడా నాతో పాటుగా శ్రమించారు. మేం కొత్త వ్యాపారాలలో ప్రవేశించి విజయం సాధించాం. ఈ విజయాల వెనక మా ఊరు నేర్పిన పాఠాలున్నాయి. తీర్చిదిద్దిన వ్యక్తిత్వముంది. అదే నన్ను ఈ నాటికీ ముందుకు నడిపిస్తోంది!
మా ఊరి కోసం..
చాలామంది ఊరును అభివృద్ధి చేయటమంటే విరాళాలు ఇవ్వటం అనుకుంటారు. చాలాసార్లు ఊరి అవసరాలకు, మన ఆలోచనలకు మధ్య చాలా తేడా ఉంటుంది. నా దృష్టిలో ఊరు అభివృద్ధి చెందాలంటే- ముందుగా ప్రతీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉపాధి ఉండాలి. ఆ తర్వాత కుటుంబంలో పిల్లలందరూ విద్యావంతులు కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. అందరూ సామరస్యంగా జీవించగలిగిన మౌలికసదుపాయాలు ఉండాలి. ఈ ఐదు అంశాలపైనే నేను దృష్టిని కేంద్రీకరించాను. ముందుగా కొందరికి ఉపాధి కల్పించా. ప్రస్తుతం మా గ్రూపులో దాదాపు రెండు వందల మంది మా ఊరు వాళ్లే ఉన్నారు. ఒకసారి ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత మిగిలినవన్నీ సులభమవుతాయి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రభుత్వం వద్ద నిధులకు కొరత లేదు. ఆ నిధులు సక్రమంగా అందేటట్లు చూసి, అదనంగా అవసరమైన సాయాన్ని మనం చేయాలనేది నా ఉద్దేశం.
ఉదాహరణకు మా ఊర్లో స్కూల్లో చెప్పే పాఠాలు పిల్లలకు సరిపోవు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే వారికి అదనంగా శిక్షణ కావాలి. అందుకోసం ప్రతి రోజు మా ఊర్లో ప్రైవేట్ టీచర్లు వచ్చి స్కూలు పిల్లలకు అదనంగా పాఠాలు చెబుతారు. వారికి అయ్యే ఖర్చు మేం భరిస్తాం. అంతే కాదు ప్రతి వేసవి సెలవులలోను- వందేమాతరం ఫౌండేషన్ ద్వారా పిల్లలకు విద్యావికాస శిక్షణ ఇప్పిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రత కోసం ఊరంతా సిమెంట్ రోడ్లు వేయించాం. ప్రభుత్వం కొన్ని నిధులు మంజూరు చేసింది. అదనంగా అయిన ఖర్చును మేము భరించాం. పల్లెటూళ్లలో టాయిలెట్లు పెద్ద సమస్య. మా చిన్నప్పుడు ఎంత పెద్ద కుటుంబంలో మహిళలలైనా బయటకు వెళ్లాల్సిందే. రాత్రిళ్లు వారు చాలా ఇబ్బందులు పడేవారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 1500 మరుగుదొడ్లు మంజూరు చేయించాం.
మరుగుదొడ్లు మాత్రమే కాదు- వాటికి అవసరమైన డ్రైనేజీ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాం. తాగే నీరు ఒక సమస్య కాబట్టి వాటర్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్ పెట్టించాం. గుడిని పునర్ నిర్మించాం. కేవలం మా ఊరులోనే కాదు, మొత్తం మహబూబ్‌నగర్ జిల్లాలోనే అనేక కార్యక్రమాలు చేపట్టాం. మేం చేస్తున్న కార్యక్రమాలకు గ్రామప్రజలు కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అందరి సహకారంతో మా గ్రామం దేశంలోనే ఒక 'మోడల్'గా నిలపాలనేది మా లక్ష్యం.
సివిఎల్ఎన్ ప్రసాద్
ఫోటోలు: రాజ్‌కుమార్
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment