ఇరవై ఐదేళ్ల సురేష్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చిన్న ఉద్యోగంలో చేరాడు.
అతనిలో తీవ్ర అసంతృప్తి. ఆశలేమో ఆకాశమంతా విస్తరించాయి. కాని అవకాశాలు
లేవనే నిరాశ నిస్పృహలతో తనలో దాగి ఉన్న నైపుణ్యానికి పదును పెట్టకుండా,
చిన్న ఉద్యోగంలో ఏర్పడిన అసంతృప్తిని కొండంత సమస్యగా ఊహించుకొని తాగుడుకు
బానిస అయ్యాడు. ఎంతమంది చెప్పినా అతనిలో మార్పులేదు. అతని వల్ల కన్నవారికి
సైతం నిత్యం శారీరక, మానసిక బాధలే. ఇలా నేటి యువతరం తమలో దాగిఉన్న
నైపుణ్యానికి పదును పెట్టకుండా నిర్వీర్యం అవుతోంది. వాస్తవానికి యువత
తలచుకుంటే సాధించలేనిది లేదు. దేశంలో 45శాతం మంది యువతే ఉంది. చురుకుగా,
చలాకీగా, ఆరోగ్యం, ఆనందోత్సవాలకు అవధలు లేకుండా ప్రవాహం వలే సాగిపోవాలి.
స్నేహాలు, సరదాలు వారి జీవితంలో ఓ భాగమైతే, ఉపాధి కూడా మరో భాగం కావాలి.
ఆర్థికమాంద్యం నెలకొన్న నేటీతరుణంలోఉద్యోగాలకు కోతపడుతున్న వేళ
సురేష్‌లాంటి వాళ్లు నైపుణ్యానికి పెద్దపీట వేస్తే రాబోయో కాలంలో ఎన్నో
విజయాలను సొంతం చేసుకోవటమే కాదు డబ్బు, సంఘంలో హోదాను సంపాదించుకోవటం ఏమంతా
సాధ్యంకానిది కాదు. ఇందుకు అవసరమైన సామర్థ్యాలను, సాఫ్ట్ స్కిల్స్‌ను
పెంపొందించుకోవాలి. పరుగులు తీసే క్రమంలో తమ ప్రాధాన్యాలలో మార్పులు
చేసుకుంటూ ఆల్‌రౌండర్‌గా ఎదగటానికి ప్రయత్నించాలి.
యువతలో నైపుణ్యం వృద్ధి చెందేలా తగిన కార్యాచరణ ప్రణాళికల్ని అమలు చేస్తే 2022 నాటికి ఉపాధి అవకాశాలను భారీగా మెరుగుపరచే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనం సందర్భంగా ప్రభుత్వ,ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో 2022 నాటికి సుమారు 500 మిలియన్ల మందికి వృత్తి విద్యలో ఉపాధి కల్పించవచ్చని అంచనా వేశారు. వౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు పెంచడం- అనే రెండు సవాళ్లను అధిగమించాలంటే పెద్ద ఎత్తున నిధులను సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఎంతగానో ఉపకరిస్తుంది. వృత్తివిద్యలో యువత రాణించినపుడే ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. 2022 నాటికి 500 మిలియన్ల యువతీ యువకులు ఉపాధి పొందాలంటే కొన్ని నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేయాలని ఎన్‌ఎస్‌డిసి సూచించింది. గ్రామీణ ప్రాంతాలు, అల్పాదాయ వర్గాలకు చెందిన వారికి వృత్తి విద్యలో మెళకువలను నేర్పాలి. ఉపాధి అవకాశాలు విరివిగా ఉండే ఉత్పత్తుల రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వృత్తి విద్యలో నైపుణ్యం పెంపొందించేందుకు యువతకు తగిన శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్‌ఎస్‌డిసి ఎండి, సిఇఓ దిలీప్ షెనాయ్ సూచిస్తున్నారు. యువతలో నైపుణ్యం పెరిగేలా అవసరమైన వ్యూహాలను అనుసరించాలని, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి విద్యలో కొత్త పద్ధతులను ఆవిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వృత్తి విద్య కోర్సుల్లో చేరి కొన్ని కారణాల వల్ల మధ్యలోనే మానేస్తున్న వారిని గుర్తించి, చదువు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పలు ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం అందిస్తే వృత్తివిద్యపై ముఖ్యంగా గ్రామీణ, పేద వర్గాల యువత ఆసక్తి పెంచుకునే వీలుంది. యువతలో నైపుణ్య వికాసానికి ఎన్‌ఎస్‌డిసి పలు సూచనలు చేసింది.
* గ్రామీణ, బడుగువర్గాలకు చెందిన యువతీ యువకులకు ఉపాధిపై భరోసా ఇచ్చేందుకు వృత్తి విద్యను ప్రోత్సహించాలి. 15 ఏళ్లు నిండిన వారందరికీ వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉంచాలి. తొందరగానే సంపాదన మార్గాలు ఎంచుకునేందుకు, జీవితంలో స్థిర పడేందుకు వృత్తివిద్య ప్రాధ్యాన్యంపై యువతలో అవగాహన పెంచాలి.
* ఉత్పత్తి రంగంలో ఉపాధి లభించేలా కొత్త కోర్సులను ప్రారంభించాలి. వీలైనంత వరకూ స్వల్పకాలిక కోర్సులను అందుబాటులో ఉంచాలి. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సులువుగా ‘అప్రెంటిస్ షిప్’ లభించేలా ఏర్పాట్లు చేయాలి. దీర్ఘకాలిక కోర్సుల పట్ల యువత విసుగు చెందే అవకాశం ఉన్నందున, వీలైనంత తక్కువ వ్యవధిలో వృత్తి విద్య ముగిసేలా చూడాలి.
* కంప్యూటర్ల వినియోగం, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, సామాజిక పరిస్థితులపై అవగాహన తదితర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధికి వీలుండే కోర్సులపై తగిన సమాచారం అందుబాటులో ఉంచాలి.
* చిన్నతరహా పరిశ్రమల సహకారంతో అప్రెంటిస్ షిప్ పూర్తయ్యేలా ప్రభుత్వమే తగు ఏర్పాట్లు చేయాలి. శిక్షణ కాలంలో యువతకు ఆర్థిక సహాయం అందించాలి. శిక్షణ పూర్తయితే ఉపాధికి లోటుండదనే భద్రతా భావాన్ని యువతలో కల్పించాలి.
* వృత్తివిద్య కోర్సుల నిర్వహణను ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థలు తమ బాధ్యతగా గుర్తించాలి. కెరీర్ పరంగా ఎదిగేందుకు వృత్తి విద్య కోర్సులు, నైపుణ్య వికాస పద్ధతులు మేలు చేస్తాయన్న నమ్మకం యువతలో ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి.
Courtesy-Andhra bhoomi

No comments:
Post a Comment