- శ్రీభావ
ఫెంగ్‌షూ సిద్ధాంతాల ప్రకారం ఇంటిలో ఎలాంటి రంగులు వాడాలో గత వారం తెలుసుకున్నాం. ఈ వారం బెడ్‌రూమ్‌ను ఫెంగ్‌షూ సిద్ధాంతాల ప్రకారం ఎలా సర్దుకోవాలో తెలుసుకుందాం..
ఇంటికి దీపం ఇల్లాలు అనేది మన నానుడి. ఇదే విధంగా ప్రతి ఇంట్లో బెడ్‌రూం చాలా కీలకం. ఇంట్లో నివసించే వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే బెడ్‌రూమ్‌ను ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం సర్దుకోవాలి. అలాంటి ఏడు సూత్రాలను చూద్దాం..
1. బెడ్‌రూమ్‌లో టీవీ, కంప్యూటర్, వ్యాయామం చేయటానికి ఉపయోగించే పరికరాలు ఉండకూడదు. వీటి వల్ల బెడ్‌రూమ్‌లో సహజసిద్ధంగా ఉండే ఫెంగ్‌షూ శక్తి కలుషితమయిపోతుంది. ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీనితో మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది బెడ్‌రూంలలో టీవీలను పెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు.
2. వీలైనంత ఎక్కువ సేపు బెడ్‌రూం తలుపులు, కిటికీలు తీసి ఉంచాలి. దీనివల్ల గాలి ధారాళంగా లోపలికి రాగలుగు తుంది. ఉదయం పూట సూర్యకిరణాలు బెడ్‌రూంలోని ఫర్నిచర్‌ను తాకితే మంచిది. చిన్న చిన్న సూక్ష్మక్రిములు ఈ కిరణాల తాకిడికి నాశనమయిపోతాయి. బెడ్‌రూమ్‌లో మొక్కలు పెట్టుకోకూడదు. ఒక వేళ బెడ్‌రూమ్ చాలా పెద్దగా, రెండు భాగాలుగా ఉంటే మంచానికి దూరంగా మొక్కలను పెట్టుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోను మంచంపై తలపెట్టుకొనే వైపు మొక్కలను ఉంచకూడదు.
3. బెడ్‌రూంలో మంచం మీద పడుకున్నప్పుడు నేరుగా కాంతి మొహం మీద పడేలా ఉండకూడదు. ఫెంగ్‌షూ సూత్రాల ప్రకారం రాత్రిళ్లు బెడ్‌లైట్ పెట్టుకోవటం కన్నా క్యాండిల్ వెలిగించి దాని నుంచి వచ్చే కాంతిలో నిద్రించటం మంచిది.
4. బెడ్‌రూం కేవలం నిద్రించటానికి మాత్రమే కాదు. భాగస్వాముల మధ్య లైంగిక శక్తి స్వేచ్ఛగా ప్రసరించటానికి కూడా బెడ్‌రూం ఉపయోగపడుతుంది. అందువల్ల బెడ్‌రూంలో 'చర్మపు రంగులు' ఉపయోగించాలి. (కొందరు చాలా తెల్లగా ఉంటారు. మరి కొందరు చామనఛాయలో ఉంటారు. ఇంకొందరు మట్టి రంగులో ఉంటారు. మానవుల చర్మం ఛాయలను చర్మపురంగులుగా పిలుస్తారు).
5. బెడ్‌రూంలో ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతిబింబించే చిత్రాలను ఉంచుకోవాలి. క్రూరజంతువుల బొమ్మలను, విషాదాన్ని పెంచే బొమ్మలను ఉంచకూడదు. నల్లటి ఫ్రేములను ఉపయోగించకపోవటం మంచిది.
6. బెడ్‌రూంలో మంచాన్ని అటూ ఇటూ మారుస్తూ ఉండకూడదు. ఎంపిక చేసిన ఒక ప్రాంతంలోనే ఉంచాలి. మంచానికి రెండు వైపులా దిగే విధంగా కొంత ఖాళీ ఉంచాలి. మంచానికి అటూ ఇటూ రెండు బెడ్‌సైడ్ టేబుల్స్ ఉంటే మంచిది. మంచం గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు. మంచం చాలా ఎత్తులో ఉండకూడదు. మరీ తక్కువ ఎత్తులో కూడా ఉండకూడదు.
7. రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్‌రూంకి ఉన్న తలుపులన్నీ వేయాలి. దీని వల్ల ఫెంగ్‌షూ శక్తి బయటకు పోదు.
Courtesy-Andhrajyothy

No comments:
Post a Comment